ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీలో డిస్టెన్స్ కోర్సులు.. అప్లికేషన్ లింక్!

ఏపీలోని ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీలో డిస్టెన్స్ కోర్సులకు ప్రవేశాలు ప్రారంభం అయ్యాయి. ఆసక్తిగల అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.

Published on: Jun 24, 2026, 19:44:12 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

వ్యవసాయ రంగంలో సరికొత్త నైపుణ్యాలను నేర్చుకుని, సొంతంగా ఉపాధి పొందాలనుకునే వారికి ఆచార్య ఎన్‌జీ రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ(ANGRAU) ఒక అద్భుతమైన అవకాశాన్ని కల్పిస్తోంది. విశ్వవిద్యాలయానికి చెందిన 'సెంటర్ ఆఫ్ ఓపెన్ అండ్ డిస్టెన్స్ లెర్నింగ్' (ODLC) ద్వారా పలు రకాల వ్యవసాయ ఆధారిత సర్టిఫికెట్ కోర్సుల ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ డిస్టెన్స్ కోర్సులు
ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ డిస్టెన్స్ కోర్సులు

వ్యవసాయ శాస్త్రవేత్తలు ఎన్నో పరిశోధనలు చేస్తున్నప్పటికీ, కేవలం 30 శాతం లోపు సాంకేతికతలు మాత్రమే రైతులకు చేరుతున్నాయి. ఈ గ్యాప్‌ను భర్తీ చేయడానికి, ఆధునిక సమాచార సాంకేతికత సాయంతో నేరుగా గ్రామీణ ప్రజలకు వ్యవసాయ విద్యను అందించడమే ఈ ఓపెన్ డిస్టెన్స్ లెర్నింగ్ సెంటర్ ముఖ్య ఉద్దేశం.

స్కూల్ డ్రాపౌట్స్ (చదువు మధ్యలో ఆపేసిన వారు), చిన్న, సన్నకారు రైతులు, గ్రామీణ మహిళలకు ప్రాధాన్యతనిస్తూ వ్యవసాయ విద్యను అందించడం ఈ డిస్టెన్స్ లెర్నింగ్ ఉద్దేశం. దీనిద్వారా సరికొత్త వ్యవసాయ పద్ధతులను గ్రామీణ ప్రాంతాలకు విస్తరింపజేయాలి.

రైతులు, గ్రామీణ యువత, మహిళలు ఎవరైనా ఈ కోర్సుల్లో చేరవచ్చు. కోర్సు ఫీజు రూ. 1500 గా నిర్ణయించారు.

ఆర్గానిక్ ఫార్మింగ్-1 (సేంద్రీయ వ్యవసాయం)-రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి

టెర్రస్ గార్డెనింగ్ (మిద్దె తోటల పెంపకం) రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి.

మష్రూమ్ కల్టివేషన్ (పుట్టగొడుగుల పెంపకం) రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి.

బయోఫెర్టిలైజర్స్ ప్రొడక్షన్ (జీవ ఎరువుల ఉత్పత్తి)-ఆగస్టు 2026 - అక్టోబర్ 2026

బీ కీపింగ్ (తేనెటీగల పెంపకం) సెప్టెంబర్ 2026 - నవంబర్ 2026

ఆర్గానిక్ ఫార్మింగ్-2(సేంద్రీయ వ్యవసాయం)-నవంబర్ 2026 - జనవరి 2027

చిరుధాన్యాల ఉత్పత్తి, విలువ ఆధారిత ఉత్పత్తులు-జనవరి 2027 - మార్చి 2027

వర్మీకంపోస్ట్, ఆర్గానిక్ ఫార్ములేషన్స్-జనవరి 2027 - మార్చి 2027

మూడు సర్టిఫికేట్ కోర్సుల సేంద్రీయ వ్యవసాయం, టెర్రస్ గార్డెనింగ్, పుట్టగొడుగుల పెంపకం రిజిస్ట్రేషన్ గడువు 30-06-2026 వరకు ఉంది.

సర్టిఫికెట్ కోర్సులను డిస్టెన్స్ మోడ్ (దూరవిద్య) ద్వారా చదువుకోవచ్చు. వ్యవసాయ రంగంపై ఆసక్తి ఉన్న రైతులు, మహిళలు, గ్రామీణ యువతతో పాటు సొంతంగా అగ్రి-బిజినెస్ లేదా నర్సరీలు, బయో-ఫెర్టిలైజర్ యూనిట్లు ప్రారంభించాలనుకునే పారిశ్రామికవేత్తలకు, స్వయం సహాయక సంఘాల మహిళలకు ఈ కోర్సులు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి.

ప్రస్తుతం కొన్ని కోర్సులకు రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. ఆసక్తి గల అభ్యర్థులు ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి వివరాలు చూడవచ్చు.

ఈ లింక్ క్లిక్ చేసి మీరు అప్లికేషన్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More