Deewana: ఒక్క బూతు లేదు.. పిల్లలు, ఫ్యామిలీతో కలిసి చూసే సినిమా తీశాం.. ‘ఎ’ సర్టిఫికెట్ ఎందుకు ఇచ్చారో: దీవానా నిర్మాత
Deewana: దీవానా మూవీ ప్రొడ్యూసర్ శ్రీదేవి తమ మూవీకి సెన్సార్ వాళ్లు ‘ఎ’ సర్టిఫికెట్ ఇవ్వడంపై ఆవేదన వ్యక్తం చేసింది. తన పిల్లలు, భర్త, ఫ్యామిలీ మొత్తం కలిసి చూసే సినిమా తీసినా.. ఎందుకు అడల్ట్ సర్టిఫికెట్ ఇచ్చారో అర్థం కావడం లేదని చెప్పింది.
Deewana: హర్షిత్ రెడ్డి, స్మేహ మణిమేఖలై జంటగా నటించిన లేటెస్ట్ లవ్ అండ్ ఇంటెన్స్ ఎమోషనల్ డ్రామా 'దీవానా' (Deewana). ఈ సినిమాకు అద్భుతమైన రివ్యూలు, బాక్సాఫీస్ వసూళ్లు వస్తుండటంతో మూవీ టీమ్ సోమవారం (జూన్ 22) ఓ సక్సెస్ మీట్ ఏర్పాటు చేసింది.

అయితే ఈ మూవీకి వస్తున్న ఆదరణ విషయంలో మేకర్స్ సంతోషంగా ఉన్నా.. సెన్సార్ నుంచి ఎ సర్టిఫికెట్ రావడంపైనే వాళ్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నిర్మాత శ్రీదేవి ఓపెన్ గా సెన్సార్ బోర్డుపై విమర్శలు చేసింది.
బుక్‌మైషో రేటింగ్ చూసి ఆగిపోతున్న ఫ్యామిలీ ఆడియన్స్
ఈ దీవానా మూవీ సక్సెస్ మీట్‌లో చిత్ర నిర్మాత శ్రీదేవి మాట్లాడుతూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు.
"ప్రీమియర్ షో చూసిన ప్రతి ఒక్కరూ థియేటర్ నుండి బయటకు వచ్చి మమ్మల్ని ఎంతగానో మెచ్చుకున్నారు. కానీ ఒక నిర్మాతగా నేను పూర్తిగా సంతోషంగా లేను. మా 'దీవానా' సినిమాను థియేటర్లలో చూడటానికి సిద్ధమైన ఫ్యామిలీ ఆడియన్స్, ఫ్రెండ్స్ చివర నిమిషంలో బుక్‌మైషో (BookMyShow) యాప్‌లోకి వెళ్లి టికెట్లు బుక్ చేసుకునేటప్పుడు అక్కడ 'A' రేటింగ్ కనిపించడంతో తమ ప్లాన్స్ క్యాన్సిల్ చేసుకుంటున్నారు. అందులో ఏదో బూతు కంటెంట్ లేదా అశ్లీలత ఉందనే అపోహతో జనాలు థియేటర్లకు రావడం మానేస్తున్నారు. ఇది మా సినిమా వసూళ్లను దారుణంగా దెబ్బతీస్తోంది" అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
ఒక మహిళగా చెబుతున్నా.. నా పిల్లలతో కలిసి చూశా
సెన్సార్ బోర్డు నిర్ణయాన్ని తప్పుబడుతూ.. నిర్మాత శ్రీదేవి మరికొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు.
"నేను ఒక మహిళగా, ఒక తల్లిగా పూర్తి బాధ్యతతో చెబుతున్నాను.. మేము ఒక వంద శాతం క్లీన్ ఫిల్మ్ తీశాము. నా సొంత పిల్లలతో, కుటుంబ సభ్యులతో కలిసి నేను ఈ సినిమాను చాలా కంఫర్టబుల్‌గా థియేటర్లో కూర్చుని చూశాను. ఎక్కడా కూడా అసభ్యత అనేదే లేదు. నేను ఎలాంటి సినిమా తీశానో అనే విషయంలో నాకు పూర్తి గర్వంగా ఉంది. కానీ సమాజంలో మార్పు తీసుకురావాలని, బాధ్యతాయుతమైన ప్రేమ గురించి మేము చూపించిన ఇంటెన్స్ ఎమోషనల్ సీన్లను తప్పుగా అర్థం చేసుకుని సీబీఎఫ్‌సీ వాళ్లు దీనికి ఎ సర్టిఫికేట్ కేటాయించడం మాకు అస్సలు అర్థం కావడం లేదు" అని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగానే ఆమె అక్కడే ఓ మహిళా జర్నలిస్టును స్టేజీపైకి పిలిచి మూవీ గురించి అడిగారు. అసలు ఈ మూవీకి ఎ సర్టిఫికెట్ ఇచ్చేలా బూతు కంటెంట్ ఏమైనా ఉందా అని ప్రశ్నించారు. దానికి సదరు మహిళా జర్నలిస్ట్ స్పందిస్తూ.. అసలు అలాంటిదేమీ ఈ సినిమాలో లేదని స్పష్టం చేశారు. నిర్మాత శ్రీదేవితోపాటు మిగతా టీమ్ కూడా ఈ విషయంలో తమ అసంతృప్తి వ్యక్తం చేసింది.
విమర్శకుల ప్రశంసలు ఉన్నా కలెక్షన్ల తిప్పలు
ఈ సినిమాలో హీరోగా నటించిన హర్షిత్ రెడ్డి ఒక పిచ్చి ప్రేమికుడి పాత్రలో ఊరమాస్ పెర్ఫార్మెన్స్‌తో అందరి హృదయాలను గెలుచుకున్నాడు. హీరోయిన్ స్మేహ మణిమేఖలై కూడా వెంటపడే కుర్రాళ్లను కడిగిపారేసే సీన్లలో అద్భుతమైన యాక్టింగ్ కనబరిచింది. గీతా ఆర్ట్స్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థ ఈ చిన్న సినిమాకు బ్యాకప్ ఇవ్వడంతో ఇండస్ట్రీలో మంచి పాజిటివ్ బజ్ క్రియేట్ అయింది.
కథనంలో సెకండాఫ్, తండ్రీ కొడుకుల మధ్య బంధంపై వచ్చే సీన్లు ప్రేక్షకులను బాగా కదిలిస్తున్నాయి. అయితే మూవీకి పాజిటివ్ టాక్ ఉన్నా.. సెన్సార్ వాళ్లు ఇచ్చిన సర్టిఫికెట్ కారణంగా రావాల్సినన్ని వసూళ్లు తమ మూవీకి రావడం లేదని మేకర్స్ భావిస్తున్నారు. అయితే తాజాగా నిర్మాత ఇచ్చిన క్లారిటీతో అయినా ప్రేక్షకులు ఈ మూవీ చూడటానికి వస్తారో లేదో చూడాలి.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


