ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ యూనివర్సిటీ.. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం పరిధిలో ఉన్న పాలిటెక్నిక్ ఆఫ్ ఆర్గానిక్ ఫార్మింగ్‌లో ఖాళీగా ఉన్న టీచింగ్ పోస్టుల భర్తీకి సవరించిన ప్రకటన విడుదలైంది. పూర్తిగా ఒప్పంద (కాంట్రాక్ట్/తాత్కాలిక) ప్రాతిపదికన 11 నెలల కాలపరిమితి కోసం ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులకు 07.09.2026న వాక్-ఇన్-ఇంటర్వ్యూ నిర్వహించనున్నారు.

టీచింగ్ అసోసియేట్ - 1 పోస్టు కోసం నోటిఫికేషన్ వెలువడింది. వ్యవసాయ శాస్త్రంలో పిహెచ్‌డి లేదా సంబంధిత విభాగంలో మాస్టర్స్ డిగ్రీ కలిగి ఉండాలి. మాస్టర్స్ అభ్యర్థులకు సంబంధిత రంగంలో బోధన/పరిశోధన అనుభవం, రీసెర్చ్ పేపర్ ప్రచురణ లేదా నెట్ అర్హత ఉండాలి. డిగ్రీలు ఐసీఏఆర్(ICAR) గుర్తింపు పొందిన యూనివర్సిటీల నుంచి పొంది ఉండాలి.
పిహెచ్‌డి ఉన్నవారికి నెలకు రూ. 67,000 + హెచ్‌ఆర్ఏ (HRA). మాస్టర్స్ డిగ్రీ ఉన్నవారికి నెలకు రూ. 61,000 + హెచ్‌ఆర్ఏ చెల్లిస్తారు. ఇంటర్వ్యూ తేదీ నాటికి పురుషులకు గరిష్టంగా 40 ఏళ్లు, మహిళలకు 45 ఏళ్లు ఉండాలి.
టీచింగ్ అసిస్టెంట్ 3 పోస్టులు కూడా ఉన్నాయి. దీనికోసం నాలుగేళ్ల బి.ఎస్సీ (అగ్రికల్చర్) లేదా బి.టెక్ (అగ్రికల్చర్ ఇంజనీరింగ్) డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. నెలకు రూ. 35,000 స్థిర వేతనం పొందుతారు. ఇంటర్వ్యూ తేదీ నాటికి గరిష్టంగా 35 ఏళ్ల లోపు ఉండాలి.
ఈ నియామకాలు కేవలం 11 నెలల తాత్కాలిక ప్రాతిపదికన మాత్రమే ఉంటాయి. దీని ఆధారంగా భవిష్యత్తులో క్రమబద్ధీకరణ లేదా శాశ్వత ఉద్యోగం క్లెయిమ్ చేయడానికి వీలుండదు. అభ్యర్థులు తమ స్వంత ఖర్చులతో ఇంటర్వ్యూకు హాజరు కావాల్సి ఉంటుంది, ఎలాంటి టీఏ/డీఏ ఇవ్వరు. నియామకానికి ముందు అభ్యర్థులు తమ సొంత ఖర్చులతో వైద్య పరీక్షలు చేయించుకుని శారీరక ఫిట్‌నెస్‌ను నిరూపించుకోవాలి.
ఇంటర్వ్యూను రద్దు చేసే లేదా వాయిదా వేసే హక్కు పరిశోధన సహ సంచాలకులకు ఉంటుంది. వాక్-ఇన్-ఇంటర్వ్యూ 07 సెప్టెంబర్ 2026, ఉదయం 10.00 గంటల నుంచి ఉంటుంది. ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం, చింతపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లా, ఆంధ్రప్రదేశ్ - 531111లో జరగుతుంది.
{{/usCountry}}ఇంటర్వ్యూను రద్దు చేసే లేదా వాయిదా వేసే హక్కు పరిశోధన సహ సంచాలకులకు ఉంటుంది. వాక్-ఇన్-ఇంటర్వ్యూ 07 సెప్టెంబర్ 2026, ఉదయం 10.00 గంటల నుంచి ఉంటుంది. ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం, చింతపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లా, ఆంధ్రప్రదేశ్ - 531111లో జరగుతుంది.
{{/usCountry}}అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు తమ వివరాలతో కూడిన బయోడేటా ఫారమ్, పదో తరగతి నుంచి పొందిన అన్ని ఒరిజినల్ విద్యార్హతల సర్టిఫికెట్లు, మార్కుల జాబితాలు, ఒక సెట్ సెల్ప్ అటెస్టెడ్ జిరాక్స్ ప్రతులు, రెండు పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు, అనుభవ ధృవీకరణ పత్రాలు, ప్రస్తుతం ఉద్యోగం చేస్తున్నట్లయితే 'నో అబ్జెక్షన్ సర్టిఫికేట్'లతో నేరుగా ఇంటర్వ్యూకి హాజరుకావచ్చు.