...
...
Next Story

తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్ - 2 రోజులు వీఐపీ బ్రేక్‌ దర్శనాలు రద్దు

తిరుమల శ్రీవారి ఆలయంలో జూలై 17న ఆణివార ఆస్థానం, జూలై 14న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో సదరు తేదీల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలతో పాటు పలు ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది.

Published on: Jul 5, 2026, 07:05:58 IST
Advertisement

కలియుగ వైకుంఠం తిరుమల క్షేత్రంలో జూలై నెలలో నిర్వహించబోయే విశేష పర్వదినాల నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) దర్శన వేళల్లో, సేవలలో పలు కీలక మార్పులు చేసింది. శ్రీవారి ఆలయంలో జూలై 17వ తేదీన అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘ఆణివార ఆస్థానం’ కొలువును ఘనంగా నిర్వహించనున్నారు.

తిరుమల శ్రీవారి ఆలయం
తిరుమల శ్రీవారి ఆలయం

దక్షిణాయన పుణ్యకాలంలో వచ్చే ఈ చారిత్రాత్మక ఉత్సవాన్ని పురస్కరించుకుని, ఆలయ సాంప్రదాయాల ప్రకారం అంతకుముందు వచ్చే మంగళవారం అంటే జూలై 14న ‘కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం’ (ఆలయ శుద్ధి కార్యక్రమం) జరపనున్నారు.

ఈ రెండు ప్రధాన ఉత్సవాల కారణంగా తిరుమలలో భక్తుల రద్దీని క్రమబద్ధీకరించడానికి, ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా మిగిలిన ఇతరులందరికీ జూలై 14, జూలై 17 తేదీల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలను టీటీడీ పూర్తిగా రద్దు చేసింది. ఇందులో భాగంగా జూలై 13, జూలై 16వ తేదీల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలకు సంబంధించిన ఎలాంటి సిఫార్సు లేఖలనూ కార్యాలయంలో స్వీకరించబోరని అధికారులు స్పష్టం చేశారు. కేవలం స్వయంగా వచ్చే ప్రోటోకాల్ వీఐపీలకు మాత్రమే బ్రేక్ దర్శన సౌకర్యం ఉంటుంది.

ఆర్జిత సేవలు రద్దు

ఉత్సవాల నిర్వహణ దృష్ట్యా జూలై 17న శ్రీవారి ఆలయంలో నిత్యం జరిగే పలు ఆర్జిత సేవలను కూడా అధికారులు రద్దు చేశారు. ఆ రోజున నిర్వహించాల్సిన కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవంతో పాటు సహస్ర దీపాలంకరణ సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe