Vontimitta Brahmotsavams 2026 : బ్రహ్మోత్సవాలకు ఒంటిమిట్ట ముస్తాబు - ఇవాళే అంకురార్పణ, వాహన సేవల వివరాలు

Vontimitta Kodandarama Swamy Brahmotsavams: ఇవాళ ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరగనుంది. మార్చి 27వ తేదీన ధ్వజారోహణంతో శ్రీ బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమవుతాయి.

Published on: Mar 26, 2026, 06:35:47 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయం వార్షిక బ్రహ్మోత్సవాలకు ముస్తాబైంది. ఈ ఆలయం పురాతన, చారిత్రక ప్రాశస్త్యం కలిగినది. ఒకే శిలపై శ్రీ సీతారామ లక్ష్మణుల విగ్రహాలు ప్రతిష్టితమై ఉండటంతో ఒంటిమిట్టను “ఏకశిలా నగరం”గా కూడా పిలుస్తారు.

ఒంటిమిట్ట ఆలయం
ఒంటిమిట్ట ఆలయం

నేటి(మార్చి 26 ) నుంచి ఏప్రిల్ 5వ తేదీ వరకు నిర్వహించనున్న శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాలకు గురువారం రాత్రి శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఉదయం సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొలిపి పరివార దేవతలకు తిరుమంజనం నిర్వహిస్తారు. అనంతరం మూలవిరాట్టులకు వ్యాసాభిషేకం, ఆరాధన, అర్చనలు నిర్వహిస్తారు.

సాయంత్రం అంకురార్పణ…

సాయంత్రం 6 గంటల నుండి అర్చకుల వేదమంత్రోచ్ఛారణల మధ్య అంకురార్పణ శాస్త్రోక్తంగా జరుగుతుంది. ఇందులో భాగంగా శ్రీ సీతారామ లక్ష్మణుల ఉత్సవమూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి ప్రత్యేక వేదికపై కొలువుదీర్చి విష్వక్సేన పూజ, కలశ ప్రతిష్ట, కలశ పూజ, వాసుదేవ పుణ్యాహవచనం, కంకణధారణ నిర్వహిస్తారు. అనంతరం పుట్టమన్ను సేకరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.

మార్చి 27న ధ్వజారోహణం…

మార్చి 27వ తేదీన ధ్వజారోహణంతో ఒంటిమిట్టలో శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభం కానున్నాయి. ఉదయం 9.30 నుండి 10.15 గంటల మధ్య వృషభ లగ్నంలో ధ్వజారోహణం జరుగనుంది.

అదే రోజు ఉదయం 11 గంటలకు శ్రీరామనవమి ఆస్థానం, సాయంత్రం 4 గంటలకు శ్రీ పోతన జయంతి, కవిసమ్మేళనం నిర్వహించనున్నారు. రాత్రి 7 నుండి 9 గంటల వరకు శేష వాహనసేవపై స్వామి, అమ్మవారు భక్తులకు దర్శనమివ్వనున్నారు.

వాహనసేవల వివరాలు :

  • 28.03.2026: ఉదయం – వేణుగానాలంకారము, రాత్రి – హంస వాహనం
  • 29.03.2026 : ఉదయం – వటపత్రశాయి అలంకారము, రాత్రి – సింహ వాహనం
  • 30.03.2026: ఉదయం – నవనీత కృష్ణాలంకారము, రాత్రి – హనుమంత వాహనం
  • 31.03.2026 : ఉదయం – మోహినీ అలంకారము, రాత్రి – గరుడసేవ
  • 01-04-2026 : ఉదయం – శివధనుర్భాణ అలంకరణ, మద్యాహ్నం 03.15 గం.లకు కాంత కోరిక, ఎదుర్కోలు ఉత్సవం సాయంత్రం 06.30 గం.ల నుండి 08.30 గం.ల వరకు శ్రీ సీతారామ కల్యాణోత్సవం. రాత్రి గజవాహన సేవ నిర్వహిస్తారు.
  • 02-04-2026 : ఉదయం – రథోత్సవం
  • 03-04-2026 : ఉదయం – కాళీయమర్ధనాలంకారము, రాత్రి – అశ్వవాహనం
  • 04-04-2026 : ఉదయం – చక్రస్నానం, రాత్రి – ధ్వజావరోహణం.
  • ఏప్రిల్ 05వ తేదీ సాయంత్రం 6 నుండి రాత్రి 9 గంట‌ల వ‌ర‌కు పుష్ప‌యాగం ఉంటుంది.
  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More