...
...
Next Story

Annadata Sukhibhava Scheme : ప్రతి రైతు ఖాతాలోకి రూ. 6 వేలు - ఇవాళే అన్నదాత సుఖీభవ నిధుల జమ, వెంటనే చెక్ చేసుకోండి

ఇవాళ రాష్ట్రంలోని రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీభవ స్కీమ్ డబ్బులు జమ కానున్నాయి. పీఎం కిసాన్ డబ్బులతో కలిపి ప్రతి రైతు ఖాతాలో రూ. 6 వేలు జమ చేస్తారు. రైతులు బ్యాంక్ ఖాతాలాను చెక్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

Published on: Mar 13, 2026, 09:55:22 IST
Advertisement

ఉగాది కానుకగా ఏపీ ప్రభుత్వం రైతన్నలకు ‘అన్నదాత సుఖీభవ’ నిధులు జమ చేయనుంది. ‘అన్నదాత సుఖీభవ - పీఎం కిసాన్ 3.0’లో భాగంగా రైతులకు శుక్రవారం(ఇవాళ) ఆర్థిక సాయాన్ని విడుదల చేయనుంది.

అన్నదాత సుఖీభవ - పీఎం కిసాన్ నిధులు
అన్నదాత సుఖీభవ - పీఎం కిసాన్ నిధులు

మూడవ విడతగా 46.85 లక్షల మందికి కేంద్ర, రాష్ట్ర వాటా కలిపి ఒక్కో రైతు అకౌంట్‌లో రూ.6,000 జమ చేయనుంది. మూడో విడతగా రూ.2,676 కోట్లను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఖర్చు చేస్తున్నాయి. ఇందులో రాష్ట్ర వాటా రూ.1,874 కోట్లు. ఇప్పటికే రెండు విడతల కలిపి రూ.14 వేలను ప్రభుత్వం అందించింది. శుక్రవారం ఇచ్చే రూ.6 వేలతో కలిపి రైతులకు ఇచ్చిన హామీ ఏడాదికి రూ.20 వేల సాయం పూర్తవుతుంది.

ఏడాదిలో రూ.8,985 కోట్ల సాయం…

ఒక్కో రైతు కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సాయాన్ని అందిస్తామని కూటమి సూపర్ -6లో పేర్కొంది. కేంద్రం పీఎం కిసాన్ కింద రూ.6,000, రాష్ట్ర ప్రభుత్వం రూ.14,000 కలిపి మూడు విడతల్లో ప్రతీ రైతు కుటుంబానికి ఏడాదికి రూ.20 వేలు ఇస్తామని హామీ ఇచ్చింది.

ఈ మేరకు 2025 ఆగస్ట్ 2న మొదటి విడతగా రూ.7 వేల చొప్పున రూ.3,174 కోట్లు, నవంబర్ 19న రెండవ విడతగా రూ.7 వేల చొప్పున రూ.3,135 కోట్లు కలిపి రూ.6,309 కోట్లు రైతులకు అందించింది. ఇవాళ(మార్చి 13) మూడో విడతలో రూ.6 వేల చొప్పున 46.85 లక్షల మందికి రూ.2,676 కోట్లు ఇవ్వనుంది. ఒక్క ఏడాదిలోనే రైతు సోదరులకు కూటమి ప్రభుత్వం రూ.8,985 కోట్లు అందించినట్లు అవుతుంది. ఇందులో రాష్ట్ర వాటా రూ.6,560 కోట్లు కాగా, కేంద్రం వాటా రూ.2,425 కోట్లు.

కృష్ణాజిల్లా, గన్నవరం నియోజకవర్గం, సూరంపల్లిలో శుక్రవారం అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో పాల్గొంటారు. సాయంత్రం 4.20 గంటలకు సీఎం సూరంపల్లికి చేరుకుంటారు. 4.25 గంటల నుంచి 4.55 గంటల వరకు రైతు సోదరులతో ముఖాముఖి అవుతారు. 05.00 గంటలకు ప్రజావేదిక సభలో పాల్గొని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగిస్తారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe