...
...
Next Story

ANUCDE Admissions : నాగార్జున యూనివర్సిటీ దూరవిద్యలో ప్రవేశాలు - నోటిఫికేషన్ విడుదల, ముఖ్య వివరాలు

ANUCDE Admission Notification 2026 : గుంటూరులోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం, దూర విద్యలో PG, ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశాలకు నోటిఫికేషన్ జారీ అయింది. 2026-27 విద్యాసంవత్సరానికి గాను అడ్మిషన్లు కల్పిస్తారు. అర్హులైన వాళ్లు…. ఆగస్టు 31వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

Published on: May 22, 2026, 14:21:43 IST
Advertisement

ANUCDE Admission Notification 2026 : దూర విద్యలో ఉన్నత చదువులు చదవాలనుకునే అభ్యర్థులకు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం (ANU) ముఖ్యమైన అప్డేట్ ఇచ్చింది. పీజీ కోర్సులతో పాటు ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశాలకు నోటిఫికేషన్ జారీ చేసింది. 2026-27 విద్యాసంవత్సరానికిగానూ ప్రవేశాలు కల్పించనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలని ఓ ప్రకటన ద్వారా కోరింది.

నాగార్జున యూనివర్సిటీ దూరవిద్యలో ప్రవేశాలు
నాగార్జున యూనివర్సిటీ దూరవిద్యలో ప్రవేశాలు

అడ్మిషన్ ఫీజు చెల్లించడానికి చివరి తేదీగా ఆగస్టు 31, 2026ని నిర్ణయించారు. ఈ లోపే ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. నోటిఫికేషన్ లో పేర్కొన్న వివరాల ప్రకారం… ఎంఎస్సీ, ఎంఏ, ఎంకామ్ తో పాటు పలు పీజీ డిప్లోమా కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయి.

పీజీ సైన్స్ కోర్సులు (PG-Science):

  • M.Sc. బోటనీ, జూలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ : సంబంధిత సబ్జెక్టులతో కూడిన బిఎస్సీ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. రెండేళ్ల వ్యవధి (4 సెమిస్టర్లు) గల ఈ కోర్సులకు మొదటి సంవత్సరం ఫీజు రూ. 15,200 గా ఉంది.
  • M.Sc. మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్ : బిఏ/బిఎస్సీ మ్యాథ్స్ చదివిన వారు అర్హులు. డేటా సైన్స్/డేటా అనాలిసిస్‌లో ఐదేళ్లకు పైగా అనుభవం ఉన్న బీటెక్/బీసీఏ అభ్యర్థులు కూడా స్టాటిస్టిక్స్ కోర్సుకు దరఖాస్తు చేసుకోవచ్చు (వీరికి కోర్సు వ్యవధి రెండున్నరేళ్లు ఉంటుంది).
  • M.Sc. కంప్యూటర్ సైన్స్ : బిఎస్సీ కంప్యూటర్ సైన్స్/ఐటీ, బీసీఏ లేదా కంప్యూటర్స్ ఒక సబ్జెక్టుగా ఉన్న ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. మొదటి సంవత్సరం ఫీజు రూ. 22,000.
  • M.C.A (మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్) : మ్యాథ్స్ బ్యాక్‌గ్రౌండ్‌తో 50% మార్కులతో (బీసీ, ఎస్సీ, ఎస్టీలకు 45%) ఏదైనా డిగ్రీ పాసై ఉండాలి. ఏపీ ఐసెట్-2025 (AP ICET) లేదా ANUCDE ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా ప్రవేశం కల్పిస్తారు. మొదటి సంవత్సరం ఫీజు రూ. 24,000

పీజీ ఆర్ట్స్ కోర్సులు (PG-Arts):

  • M.A. ఇంగ్లీష్, తెలుగు, హిందీ, సంస్కృతం : సంబంధిత లాంగ్వేజ్ సబ్జెక్టులతో డిగ్రీ చేసిన వారు అర్హులు. మొదటి సంవత్సరం ఫీజు రూ. 6,730.
  • M.A. ఎకనామిక్స్, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, సోషియాలజీ : ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. వీటిలో ఎకనామిక్స్, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, సోషియాలజీ కోర్సులు తెలుగు మీడియంలో అందుబాటులో ఉన్నాయి.
  • MSW (మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ ): ఏదైనా డిగ్రీ అర్హతతో ఇంగ్లీష్ మీడియంలో ఈ కోర్సును అభ్యసించవచ్చు. ఫీజు రూ. 10,030.
  • M.A. జర్నలిజం & మాస్ కమ్యూనికేషన్ (ఫీజు రూ. 7,730).
  • M.A. హ్యూమన్ రీసోర్స్ మేనేజ్‌మెంట్ (ఫీజు రూ. 8,930), ఏదైనా డిగ్రీ చదివిన వారు అర్హులు.

కామర్స్ - మేనేజ్‌మెంట్ కోర్సులు:

  • M.Com (అకౌంటెన్సీ), M.Com (బ్యాంకింగ్) : బీకామ్/బీబీఎమ్/బీబీఏ చేసిన వారు అర్హులు. ఫీజు రూ. 6,730.
  • M.B.A (జనరల్, ఇంటర్నేషనల్ బిజినెస్, ట్రావెల్ & టూరిజం, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్, హ్యూమన్ రీసోర్స్ మేనేజ్‌మెంట్) : 50% మార్కులతో (రిజర్వ్‌డ్ కేటగిరీలకు 45%) ఏదైనా డిగ్రీతో పాటు టెన్త్/ఇంటర్/డిగ్రీలో మ్యాథ్స్ చదివి ఉండాలి.
  • ఐసెట్-2025 లేదా వర్సిటీ ప్రవేశ పరీక్షలో అర్హత సాధించాలి. మొదటి సంవత్సరం ఫీజు రూ. 23,000.

M.L.I.Sc (మాస్టర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్):

  • బీఎల్ఐఎస్సీ (B.L.I.Sc) పూర్తి చేసిన వారికి ఒకే ఏడాది (2 సెమిస్టర్లు) వ్యవధి గల కోర్సు. ఫీజు రూ. 10,675.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe