ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్ఎడిటర్గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్మెంట్లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.
AP 1st Phase Panchayat Elections : నేడు ఏపీలో తొలి దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్
AP 1st Phase Panchayat Elections : ఆంధ్రప్రదేశ్‌లో తొలి దశ పంచాయతీ, మలి విడత మున్సిపల్ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. 3,240 పంచాయతీలు, 23 పట్టణ స్థానిక సంస్థల్లో గురువారం ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ మెుదలైంది. ఓటర్ల వివరాలు, భద్రతా ఏర్పాట్లు, కౌంటింగ్ తేదీల పూర్తి సమాచారం ఇక్కడ చదవండి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా తొలి దశ గ్రామ పంచాయతీ, మలి విడత పురపాలక ఎన్నికల పోలింగ్‌కు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. గురువారం ఉదయం 7 గంటల నుంచే ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. గ్రామీణ, పట్టణ ఓటర్లు తమ తీర్పును బ్యాలెట్ బాక్సుల్లో వేస్తున్నారు.

రాష్ట్రంలోని మొత్తం 3,240 గ్రామ పంచాయతీలు, 23 పట్టణ స్థానిక సంస్థల పరిధిలో ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందుకోసం అధికారులు 34,312 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా, సుమారు 70 వేల మంది సిబ్బంది ఎన్నికల విధుల్లో నిమగ్నమయ్యారు.
ఏకగ్రీవాలు మినహాయించి 3,189 సర్పంచ్, 25,101 వార్డు సభ్యుల స్థానాలకు మొత్తం 62,863 మంది అభ్యర్థులు తలపడుతున్నారు. కాగా, విశాఖపట్నం, గుంటూరు జిల్లాల్లో తొలి విడత పంచాయతీ ఎన్నికలు జరగడం లేదు.
శ్రీకాకుళం, రాజమహేంద్రవరం, కాకినాడ, మంగళగిరి-తాడేపల్లి కార్పొరేషన్లలో మేయర్ పీఠం కోసం 36 మంది పోటీలో ఉన్నారు. ఈ నాలుగు నగరాల్లోని 260 డివిజన్లలో రెండు ఏకగ్రీవం కాగా, శ్రీకాకుళం 30వ డివిజన్ (కుశాలపురం)లో నామినేషన్లన్నీ ఉపసంహరించుకోవడంతో మిగిలిన 257 డివిజన్లకు పోలింగ్ నిర్వహిస్తున్నారు.
19 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో ఛైర్పర్సన్ పదవుల కోసం 134 మంది తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇక్కడి 750 వార్డుల్లో 39 ఏకగ్రీవమయ్యాయి. నెల్లూరు జిల్లా అల్లూరు నగర పంచాయతీలోని 4 వార్డుల్లో నామినేషన్లు దాఖలు కాకపోవడంతో, మొత్తం 707 వార్డుల్లో ఓటింగ్ జరగనుంది. డివిజన్లు, వార్డులు అన్నీ కలిపి 964 స్థానాల్లో 2,968 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.
ఈ ఎన్నికల్లో మొత్తం 99,43,895 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 3,240 పంచాయతీల పరిధిలో 74,45,583 మంది ఓటర్ల కోసం 31,614 పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేశారు. 23 పట్టణ స్థానిక సంస్థల్లో 24,98,312 మంది ఓటర్లు ఉండగా, వీరి కోసం 2,698 కేంద్రాలు అందుబాటులో ఉన్నాయి.
గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ ముగిసిన వెంటనే, అంటే గురువారం మధ్యాహ్నం 2 గంటల నుంచే ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను వెల్లడిస్తారు. అయితే పట్టణ స్థానిక సంస్థల ఓట్ల లెక్కింపు మాత్రం ఈ నెల 30వ తేదీన నిర్వహించి తుది ఫలితాలను ప్రకటించనున్నారు.
గతంలో జరిగిన మున్సిపల్ తొలి దశ, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల సమయంలో చోటుచేసుకున్న ఉద్రిక్తతలను దృష్టిలో ఉంచుకుని పోలీస్ శాఖ ఈసారి అత్యంత కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా 46,080 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఈ భద్రతా పర్యవేక్షణలో 43 మంది ఎస్పీలు, 76 మంది అదనపు ఎస్పీలు, 179 మంది డీఎస్పీలు, 853 మంది సీఐ/ఆర్ఐలు, 3,601 మంది ఎస్సై/ఆర్ఎస్సైలతో పాటు వేలాది మంది కానిస్టేబుళ్లు పాల్గొంటున్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో డ్రోన్లు, బాడీ ఓర్న్ కెమెరాలు, సీసీటీవీల ద్వారా నిరంతర నిఘా ఉంచారు.
పోలింగ్ ఉదయం 7 గంటలకే ప్రారంభమైనందున ఓటర్లు తమ ఓటరు స్లిప్పులతో పాటు ఎన్నికల సంఘం గుర్తించిన ఏదైనా ఒక గుర్తింపు కార్డును(ఓటర్ ఐడీ, ఆధార్, పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ మొదలైనవి) తప్పనిసరిగా వెంట తీసుకెళ్లాలి. ఉదయమే పోలింగ్ కేంద్రాలకు చేరుకుని ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కును వినియోగించుకోవాలని అధికారులు సూచించారు.

E-Paper
