తీరం దాటిన అక్వాన్ తుపాను.. అక్కడ టూరిస్ట్ ప్రాంతాలు క్లోజ్.. శ్రీకాకుళం ప్రజలకు అలర్ట్!
Cyclone Akvan : గోపాల్‌పూర్ సమీపంలో అక్వాన్ తుపాను తీరం దాటింది. ఈ సమయంలో బలమైన గాలులు వీచాయి. మరోవైపు ఒడిశాలో తుపాను ప్రభావం ఉన్న ప్రాంతాల్లో పర్యాటక ప్రదేశాలను మూసివేశారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుపాను అక్వాన్(Cyclone Akvan) తీరాన్ని దాటింది. ఉత్తరాంధ్ర – దక్షిణ ఒడిశా తీరాల మధ్య ఒడిశాలోని గోపాల్‌పూర్ సమీపంలో తుపాను తీరం దాటినట్లు భారత వాతావరణ శాఖ ప్రకటించింది. తుపాను తీరం దాటే సమయంలో గంటకు 70 నుండి 80 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచాయని, గరిష్టంగా 90 కిలోమీటర్ల వేగానికి చేరుకున్నాయని అధికారులు వెల్లడించారు.

తుపాను తీరం దాటినప్పటికీ, దాని ప్రభావం ఉత్తరాంధ్ర జిల్లాలపై ఇంకా కొనసాగుతోందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ హెచ్చరించారు. తుపాను ప్రభావంతో ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి. మిగిలిన ఉత్తరాంధ్ర జిల్లాల్లోనూ తేలికపాటి నుండి మోస్తరు వర్షాలకు అవకాశం ఉంది.
తీరం దాటిన తర్వాత కూడా బలమైన గాలులు, వర్షాల తీవ్రత ఉండే అవకాశం ఉన్నందున శ్రీకాకుళం జిల్లా ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని ప్రఖర్ జైన్ సూచించారు.
తుపాను ఒడిశా గంజాం జిల్లా గోపాల్‌పూర్ వద్ద తీరాన్ని తాకడంతో ఒడిశా ప్రభుత్వం రక్షణ చర్యలు చేపట్టింది. ప్రత్యేక సహాయక కమిషనర్ రాజేష్ పి. పాటిల్ తెలిపిన వివరాల ప్రకారం.. లోతట్టు, తీర ప్రాంతాల నుండి ఇప్పటివరకు 2,98,676 మందిని (దాదాపు 3 లక్షల మంది) సురక్షిత ప్రాంతాలకు తరలించి, 2,523 పునరావాస శిబిరాల్లో ఆశ్రయం కల్పించారు. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు మొత్తం 9,341 షెల్టర్లను సిద్ధంగా ఉంచారు.
ఒక్క గంజాం జిల్లాలోనే అత్యధికంగా 1,38,311 మందిని సురక్షిత కేంద్రాలకు తరలించినట్లు జిల్లా కలెక్టర్ వి. కీర్తి వాసన్ తెలిపారు. సహాయక చర్యల కోసం ఒడిశా వ్యాప్తంగా 423 రెస్క్యూ బృందాలను రంగంలోకి దించారు. ఇందులో 60 ఓడ్రాఫ్ (ODRAF), 14 ఎన్డీఆర్ఎఫ్ (NDRF), 131 అగ్నిమాపక, అత్యవసర సేవల బృందాలు ఉన్నాయి.
తుపాను ముప్పు నేపథ్యంలో ఒడిశాలోని పలు ప్రముఖ పర్యాటక ప్రదేశాలు, ఉద్యానవనాలను అధికారులు తాత్కాలికంగా మూసివేశారు. తీర ప్రాంతాల్లోని ప్రమాదకర ప్రదేశాలకు పర్యాటకులు వెళ్లకుండా నిషేధం విధించారు. భువనేశ్వర్‌లోని నందన్‌కనన్ జులాజికల్ పార్క్, భితర్‌కనికా నేషనల్ పార్క్, సిమిలిపాల్ టైగర్ రిజర్వ్‌లను తాత్కాలికంగా మూసివేశారు.
పూరీలోని గుండిచా ఆలయాన్ని నవంబర్ 21 వరకు మూసివేస్తున్నట్లు ప్రకటించారు. అయితే, పూరీ జగన్నాథ ఆలయంలో నిత్య పూజలు, ఆచారాలు యథావిధిగా కొనసాగుతున్నాయి.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


