AP BRAGCET 2026 : ఏపీ గురుకులాల్లో అడ్మిషన్లు - దగ్గరపడిన గడువు, వెంటనే అప్లయ్ చేసుకోండి
డా.బీఆర్ అంబేడ్కర్ గురుకులాల్లో ప్రవేశాలకు దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఈ గడువు దగ్గరపడింది. అర్హులైన విద్యార్థులు… ఫిబ్రవరి 19లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. https://apbragcet.apcfss.in/ వెబ్ సైట్ లో వివరాలు తెలుసుకోవచ్చు.
ఏపీలోని డా.బీఆర్ అంబేడ్కర్ గురుకులాల్లో అడ్మిషన్ల కోసం ఆన్ లైన్ దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఇందులో భాగంగా 5వ తరగతి, జూనియర్ ఇంటర్‌లో ప్రవేశాలు కల్పిస్తారు. అయితే ఇందుకు సంబంధించిన ఆన్ లైన్ దరఖాస్తుల గడువు దగ్గరపడింది. ఈనెల 19వ తేదీ వరకు మాత్రమే అవకాశం ఉంది. కాబట్టి అర్హులైన విద్యార్థులు వెంటనే అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

5వ తరగతిలో అడ్మిషన్ కోసం 4వ తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులవుతారు. ఇక 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు అర్హులైన విద్యార్థులను కూడా ఎంపిక చేస్తారు. ఇక ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో అడ్మిషన్ కోసం దరఖాస్తు చేసుకునే వారు టెన్త్ పాసై ఉండాలి. లేదా ప్రస్తుతం పదో తరగతి చదవుతున్న విద్యార్థులు అర్హులవుతారు. వీరు కూడా ఫిబ్రవరి 19వ తేదీలోపు అప్లికేషన్ చేసుకోవాలి. చివరి వరకు వేచి చూడకండా… సాధ్యమైనంత త్వరగా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు పేర్కొన్నారు.
AP BRAGCET 2026 - అప్లికేషన్ ప్రాసెస్
- ముందుగా https://apbragcet.apcfss.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
- ఐదో తరగతి అడ్మిషన్ లింక్ పై క్లిక్ చేయాలి.
- ఇక్కడ విద్యార్థి ఆధార్ నెంబర్, పేరు, రిజర్వేషన్, పుట్టిన తేదీ, మొబైల్ నెంబర్ వివరాలను నమోదు చేయాలి.
- సబ్మిట్ చేసిన తర్వాత అప్లికేషన్ ఫారమ్ ఓపెన్ అవుతుంది. పూర్తి వివరాలను ఎంట్రీ చేసిన తర్వాత సబ్మిట్ చేయాలి.
- ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ ద్వారా రిజిస్ట్రేషన్ ఫారమ్ పొందవచ్చు.
- రిజిస్ట్రేషన్ నెంబర్ సాయంతో హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.
- ఇక జూనియర్ ఇంటర్ ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకునే వాళ్లు కూడా https://apbragcet.apcfss.in/ వెబ్ సైట్ ద్వారా అప్లికేషన్ చేసుకోవచ్చు.
AP BRAGCET 2026లో భాగంగా 5వ తరగతి ఎంట్రెన్స్ కోసం 50 మార్కులకు గానూ ఎగ్జామ్ నిర్వహిస్తారు. తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, ఈవీఎస్ పై ప్రశ్నలుంటాయి. 2 గంటల సమయం ఉంటుంది. ఇంగ్లీష్, తెలుగు మీడియతో ఎగ్జామ్ ఉంటుంది.
ఇంటర్ ఫస్ట్ ఇయర్ ప్రవేశాల కోసం కూడా ఎగ్జామ్ ఉంటుంది. మొత్తం 100 మార్కులకుగానూ నిర్వహిస్తారు. గణితం, ఫిజిక్స్, బయాలజీ, సామాజిక అధ్యయనాలు, ఇంగ్లీశ్, లాజికల్ రీజనింగ్ నుంచి ప్రశ్నలుంటాయి. మొత్తం 2 గంటల 30 నిమిషాల సమయం ఉంటుంది. పదో తరగతి స్థాయిలోప్రశ్నలు అడుగుతారు. ప్రతి తప్పు సమాధానికి 1/4 మార్క్ తీసివేస్తారు.ఇంగ్లీష్, తెలుగు మీడియాల్లో ప్రశ్నాపత్రం ఇస్తారు. విద్యార్థులు సాధించే స్కోర్, ర్యాంకుల ఆధారంగానే సీట్ల కేటాయింపు ఉంటుంది. కౌన్సెలింగ్ చేపట్టి అడ్మిషన్లను పూర్తి చేస్తారు. గురుకుల ప్రవేశాలకు గత కొంత కాలంగా మంచి డిమాండ్ ఉంటోంది.

E-Paper












