...
...
Next Story

తిరుమల లడ్డూ కల్తీ అంశంలో అసలు సూత్రదారులను తేల్చేందుకు విచారణ కమిషన్

తిరుమల లడ్డూ కల్తీ అంశంలో ఆంధ్రప్రదేశ్ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. విచారణ కమిషన్ ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకుంది.

Published on: Feb 3, 2026, 16:41:28 IST
Advertisement

తిరుమల ప్రసాదంలో కల్తీ నెయ్యి అంశంపై కొంతకాలంగా దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. ఇప్పటికే సిట్ కోర్టులో ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. కల్తీ జరిగిన మాట వాస్తవమేనని తెలిపింది. అయితే జంతు కొవ్వుల వాడకం అంశాన్ని మాత్రం పేర్కొనలేదు. మరోవైపు ఈ అంశాన్ని అసెంబ్లీ సమావేశాల్లో ప్రత్యేక చర్చ జరపాలని జనసేన విజ్ఞప్తి చేసింది.

ఏపీ కేబినెట్ సమావేశం
ఏపీ కేబినెట్ సమావేశం

ఇలాంటి సమయంలో కేబినెట్ సమవేశం కీలక నిర్ణయ తీసుకుంది. తిరుమల లడ్డూ కల్తీ అంశంలో అసలు సూత్రదారులను తేల్చేందుకు విచారణ కమిషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. మంత్రివర్గ సమావేశంలో సిట్ నివేదికపైనా చర్చ నడిచింది. నివేదికలోని పాత్రధారులపైన చర్యలు సిట్ సిఫార్సు చేసిందని అభిప్రాయం వ్యక్తం చేసింది. విచారణలో పలు అంశాల్లో తేడాలు ఉన్నట్టుగా కేబినెట్ గుర్తించింది. సిట్ విచారణ, ఛార్జ్‌షీట్, ప్రభుత్వానికి సమర్పించిన విషయాలపై అధ్యయనం చేసి వాస్తవాలను సమర్పించేందుకు విచారణ కమిషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.

సిట్ నివేదికలో నివ్వెరపోయే నిజాలు : మంత్రి పయ్యావుల

తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి అంశంపై కేబినెట్ సమావేశంలో ఎక్కువగా చర్చ జరిగిందని మంత్రి పయ్యావుల కేశవ్ వెల్లడించారు. సిట్ నివేదికలో నివ్వెరపోయే విషయాలు బయటకు వచ్చాయని చెప్పారు. నెయ్యిలో కెమికల్స్, ఇతర ఫ్లేవర్స్ కలిపారని తెలిపారు. వైసీపీ నేతలు కల్తీని సహజం అనడం విడ్డూరంగా ఉందన్నారు. తెలిసి కూడా మౌనంగా ఎందుకు ఉన్నారని తేలాల్సి ఉందన్నారు.

'ప్రభుత్వం దగ్గర అందుబాటులో ఉన్న ఎన్డీడీబీ రిపోర్టు ఆధారంగా జంతు కొవ్వు అవశేషాలు ఉన్నాయని ముఖ్యమంత్రి మాట్లాడారు. నెయ్యి పరీక్షలో ఎస్ వాల్యూలో తేడా ఉంది. అంటే సస్పెక్టెట్ అడల్టరేషన్ జరిగే అవకాశం ఉంది. సోయాబీన్, కోకోనట్, పామ్ ఆయిల్, ఫిష్ ఆయిల్, లార్డ్ వంటి అవశేషాలు ఉండే అవకాశం ఉందని వెల్లడైంది. ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం వెంటనే.. రెండు పోస్టింగుల్లో టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్(ఈవో)గా శ్యామల రావును నియమించారు. అప్పుడే ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. 2022 ఆగస్టు 3న బీటా సిటోస్టెరాల్ ఉన్నట్టు రిపోర్టు వచ్చినా.. దాన్ని కొనసాగిస్తూ తప్పును కప్పిపుచ్చారు.' అని మంత్రి పయ్యావుల ఆరోపించారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks