రాష్ట్రంలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సమావేశమైన రాష్ట్ర మంత్రివర్గం కీలకమైన నిర్ణయం తీసుకుంది. వెనుకబడిన తరగతుల (బీసీ) రిజర్వేషన్ల ఖరారుపై ప్రభుత్వం ఒక స్పష్టమైన ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. రాజీవ్ రంజన్ కమిషన్ ప్రభుత్వం అందించిన సమగ్ర నివేదికను క్షుణ్ణంగా పరిశీలించిన కేబినెట్ …. దాని ఆధారంగానే స్థానిక సంస్థల వారీగా బీసీ రిజర్వేషన్ల శాతాన్ని ఖరారు చేసింది.

కేబినెట్ భేటీ ముగిసిన అనంతరం రాష్ట్ర మంత్రులు ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. గ్రామ స్థాయి నుంచి నగరాల వరకు మొత్తం 8 వేర్వేరు కేటగిరీల్లో పంచాయతీ వార్డు మెంబర్, సర్పంచ్, ఎంపీటీసీ, ఎంపీపీ, జడ్పీటీసీ, జడ్పీ ఛైర్‌పర్సన్, మున్సిపల్ వార్డు మెంబర్, మున్సిపల్ ఛైర్‌పర్సన్ మరియు మేయర్ పదవులకు సంబంధించి బీసీలకు ఎంతమేర ప్రాతినిధ్యం కల్పించాలో పక్కాగా నిర్ణయించినట్లు తెలిపారు.
గ్రామీణ స్థానిక సంస్థల్లో:
- గ్రామ పంచాయతీ వార్డు మెంబర్లలో బీసీలకు 26.73 శాతం రిజర్వేషన్లు కల్పించాలని మంత్రివర్గం తీర్మానించింది.
- సర్పంచ్ పదవుల్లో బీసీలకు 27.95 శాతం మేర రిజర్వేషన్ వర్తిస్తుంది.
- మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ (ఎంపీటీసీ) స్థానాల్లో 25.55 శాతం రిజర్వేషన్లు ఇస్తున్నారు.
- మండల పరిషత్ అధ్యక్షుల (ఎంపీపీ) పదవుల్లో 24.60 శాతం రిజర్వేషన్ ఖరారైంది.
- జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ (జడ్పీటీసీ) స్థానాలకు 24.60 శాతం కేటాయించారు.
- జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్ పదవుల్లో బీసీలకు 23.08 శాతం రిజర్వేషన్లు దక్కనున్నాయి.
పట్టణ స్థానిక సంస్థల్లో:
- పట్టణాల్లోని మున్సిపల్ అర్బన్ వార్డు మెంబర్లలో బీసీలకు అత్యధికంగా 32.78 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
- మున్సిపల్ ఛైర్‌పర్సన్ పదవుల్లో 32.03 శాతం రిజర్వేషన్ ఇవ్వనున్నారు.
- కార్పొరేషన్ల మేయర్ స్థానాల్లో బీసీలకు ఏకంగా 35.02 శాతం మేర రిజర్వేషన్లు దక్కేలా ప్రతిపాదనను ఆమోదించారు.
వెనుకబడిన వర్గాలకు స్థానిక పాలనలో ప్రాతినిధ్యం పెంచేందుకు చట్టబద్ధమైన కమిషన్ ఇచ్చిన గణాంకాలు, వర్గీకరణలనే ప్రామాణికంగా తీసుకుని ప్రభుత్వం ఈ కోటాను నిర్ధారించిందని మంత్రులు తెలిపారు.
పార్టీపరంగా 34 శాతం సీట్లు - మంత్రి అచ్చెన్నాయుడు
{{/usCountry}}వెనుకబడిన వర్గాలకు స్థానిక పాలనలో ప్రాతినిధ్యం పెంచేందుకు చట్టబద్ధమైన కమిషన్ ఇచ్చిన గణాంకాలు, వర్గీకరణలనే ప్రామాణికంగా తీసుకుని ప్రభుత్వం ఈ కోటాను నిర్ధారించిందని మంత్రులు తెలిపారు.
పార్టీపరంగా 34 శాతం సీట్లు - మంత్రి అచ్చెన్నాయుడు
{{/usCountry}}బీసీ రిజర్వేషన్లపై రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ నివేదికకు ఏపీ కేబినెట్ ఆమోదముద్ర వేసిందని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ఏపీలో 50.42 శాతం మేరకు బీసీ జనాభా ఉందన్నారు. బీసీలకు టీడీపీ అన్యాయం చేయదన్న ఆయన.. పార్టీ పరంగా బీసీలకు 34 శాతం సీట్లు కేటాయిస్తామని చెప్పారు.