...
...
Next Story

UAE పర్యటనకు సీఎం చంద్రబాబు - పెట్టుబడులే లక్ష్యం, 3 రోజులు అక్కడే....!

ఏపీ సీఎం చంద్రబాబు యూఏఈ పర్యటనకు వెళ్లారు. మూడు రోజుల పాటు అక్కడే పర్యటిస్తారు. ఇందులో భాగంగా వివిధ పారిశ్రామికవేత్తలతో భేటీ అవుతారు. చివరి రోజున దుబాయ్‌లో AP NRT ఆధ్వర్యంలో నిర్వహించనున్న తెలుగు డయాస్పోరా సమావేశంలో చంద్రబాబు ప్రసంగిస్తారు.

Published on: Oct 22, 2025, 11:51:04 IST
Advertisement

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మూడు రోజుల యూఏఈ పర్యటనకు బయలుదేరారు. ఉదయం అమరావతి నుంచి హైదరాబాద్‌ శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లారు. అక్కడి నుంచి 10 గంటలకు యూఏఈకు బయలుదేరుతారు.

ఏపీ సీఎం చంద్రబాబు (ఫైల్ ఫొటో)
ఏపీ సీఎం చంద్రబాబు (ఫైల్ ఫొటో)

విశాఖలో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న భాగస్వామ్య సదస్సుకు దేశ విదేశాలకు చెందిన పారిశ్రామికవేత్తలు, ప్రభుత్వ ప్రతినిధుల్ని ఆహ్వానిస్తోంది. దీంట్లో భాగంగా యూఏఈలో పర్యటించే ముఖ్యమంత్రి మూడు రోజుల పాటు వివిధ పారిశ్రామికవేత్తలతో భేటీ అవుతారు.

తొలిరోజు పర్యటన ఇలా…..

తొలిరోజు పర్యటనలో భాగంగా 22వ తేదీన ఐదు కంపెనీలకు చెందిన పారిశ్రామికవేత్తలతో సీఎం భేటీ కానున్నారు. శోభా గ్రూప్, షరాఫ్ డీజీ, ట్రాన్స్ వరల్డ్ గ్రూప్, లూధా గ్రూప్, దుబాయ్ ఫ్యూచర్ ఫౌండేషన్ సంస్థలకు చెందిన ప్రతినిధులతో సీఎం చంద్రబాబు సమావేశం అవుతారు. వీరితో వన్ టు వన్ సమావేశాలు నిర్వహిస్తారు. వీరితో జరిపే వేర్వేరు భేటీల్లో ఇండస్ట్రీయల్, ఐటీ పార్కులు, లాజిస్టిక్స్, వేర్ హౌసింగ్ సదుపాయాలు, పోర్టులు-షిప్ మేనేజ్మెంట్ వంటి రంగాల్లో పెట్టుబడులపై ఆయా సంస్థల ప్రతినిధులతో సీఎం చంద్రబాబు చర్చించనున్నారు.

తొలి రోజు పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు…. బృందం పలు ప్రాంతాలను సందర్శించనుంది. మ్యూజియం సందర్శనలో భాగంగా జర్నీ టూ 2071 థీమ్ తో ఉండే స్పేస్ ట్రావెల్ ఎక్స్ పీరియన్స్ సెంటర్ ను సీఎం పరిశీలిస్తారు. అలాగే ఇదే మ్యూజియంలో ఏర్పాటు చేసిన భవిష్యత్ టెక్నాలజీ సొల్యూషన్స్ అనే అంశంపైనా సీఎం అధ్యయనం చేయనున్నారు. ఇక రాత్రికి సీఐఐ భాగస్వామ్య సదస్సుకు సంబంధించిన రోడ్ షోకు ముఖ్యమంత్రి హాజరుకానున్నారు.

ఈ రోడ్ షోలో పాల్గొని వివిధ పరిశ్రమల ప్రతినిధులతో సమావేశం నిర్వహించి.. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని కోరనున్నారు. అలాగే విశాఖలో వచ్చే నెల 14,15వ తేదీల్లో జరగబోయే పెట్టుబడుల సదస్సుకు ఆహ్వానించనున్నారు. పర్యటన చివరి రోజున దుబాయ్‌లో ఏపీ ఎన్ఆర్టీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న తెలుగు డయాస్పోరా సమావేశంలో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు. చంద్రబాబుతో పాటు మంత్రులు టీజీ భరత్, బీసీ జనార్థన్ రెడ్డి, సీఎం సెక్రటరీ కార్తికేయ మిశ్రా, ఇండస్ట్రీస్ సెక్రటరీ యువరాజ్, ఏపీ ఇడిబి సీఈఓ సాయికాంత్ వర్మ, రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ సీఈఓ ధాత్రిరెడ్డి దుబాయ్ పర్యటనలో పాల్గొననున్నారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe