...
...
Next Story

Kakinada : వేటకు వెళ్లి ఏడుగురు ఉప్పాడ మత్స్యకారులు గల్లంతు - రంగంలోకి కోస్ట్ గార్డ్ నౌకలు, గాలింపు చర్యలు ముమ్మరం

కాకినాడ జిల్లా ఉప్పాడకు చెందిన ఏడుగురు మత్స్యకారులు ఒడిశా తీరంలోని పారాదీప్ సమీపంలో గల్లంతయ్యారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశాలతో కోస్ట్ గార్డ్ నౌకలు, హెలికాప్టర్లతో ముమ్మరంగా గాలింపు చేపట్టారు.

Published on: Nov 25, 2026, 07:17:32 IST
Advertisement

పొట్టకూటి కోసం సముద్రంలో వేటకు వెళ్లిన ఏడుగురు తెలుగు మత్స్యకారుల ఆచూకీ గల్లంతవ్వడం తీర ప్రాంతాల్లో తీవ్ర ఆందోళన రేకెత్తిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ జిల్లా ఉప్పాడ గ్రామానికి చెందిన ఏడుగురు మత్స్యకారులు ఒడిశా తీరంలోని పారాదీప్ పోర్టు సమీపంలో బోటుతో సహా అదృశ్యమయ్యారు. నవంబర్ 19 నుంచి వారి బోటుతో సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. ఇప్పటివరకు వారి జాడ తెలియకపోవడంతో మత్స్యకార కుటుంబాల్లో తీవ్ర విషాదం, ఆందోళన నెలకొన్నాయి.

నవంబర్ 4న వేటకు వెళ్లి….

మత్స్యకారుల బోటు బోల్తా () (representative image )
మత్స్యకారుల బోటు బోల్తా () (representative image )

అధికారులు, మత్స్యకార కుటుంబాలు తెలిపిన వివరాల ప్రకారం.. ఉప్పాడకు చెందిన ఏడుగురు మత్స్యకారులు నవంబర్ 4వ తేదీన ఒక మోటరైజ్డ్ ఫిషింగ్ బోటులో సముద్రంలో వేటకు బయలుదేరారు. నవంబర్ 10న వారు విశాఖపట్నం పోర్టుకు చేరుకుని, అప్పటివరకు పట్టిన చేపలను అక్కడ విక్రయించారు. అనంతరం అదే రోజు మళ్లీ వేట కోసం లోతట్టు సముద్రంలోకి వెళ్లారు. నవంబర్ 14వ తేదీ వరకు మత్స్యకారులు తమ కుటుంబ సభ్యులతో ఫోన్‌లో మాట్లాడుతూనే ఉన్నారు. అయితే ఆ తర్వాత వారి నుంచి ఎలాంటి సమాచారం అందలేదు. చివరిసారిగా వారి బోటు ఒడిశా తీరంలోని పారాదీప్ పోర్టు సమీపంలో ఉన్నట్లు గుర్తించారు. నవంబర్ 19 నుంచి ఆ బోటుతో సిగ్నల్స్ పూర్తిగా నిలిచిపోయాయి.

ఈ ఘటనపై ముఖ్యమంత్రి కార్యాలయం మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది. గల్లంతైన మత్స్యకారుల మొబైల్ ఫోన్లు, బోటులోని ట్రాన్స్‌పాండర్ స్విచ్ ఆఫ్ అయి ఉన్నాయని అధికారులు తెలిపారు. జీపీఎస్ (GPS) ద్వారా బోటు లొకేషన్‌ను గుర్తించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. సమాచారం అందిన వెంటనే కాకినాడ జిల్లా మత్స్యశాఖ అధికారులు భారత తీర రక్షక దళానికి లేఖ రాసి సహాయం కోరారు. కాకినాడ, చెన్నై, ఒడిశా కోస్ట్ గార్డ్ స్టేషన్ల సమన్వయంతో అధికారులు వెంటనే గాలింపు చర్యలు ప్రారంభించారు. ప్రస్తుతం భారత కోస్ట్ గార్డ్ తన ప్రత్యేక నౌకలు, హెలికాప్టర్ల సాయంతో పారాదీప్ తీర ప్రాంతమంతా జల్లెడ పడుతోంది.

సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు…

మరోవైపు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కూడా ఈ ఘటనపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కాకినాడ జిల్లా కలెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడి మత్స్యకారుల అదృశ్యంపై ఆరా తీశారు. విశాఖపట్నం పోర్టులో చేపలు అమ్మిన తర్వాత వారు తిరిగి వేటకు వెళ్లిన వివరాలను కలెక్టర్ ఉప ముఖ్యమంత్రికి వివరించారు. సహాయక చర్యలను వేగవంతం చేసి మత్స్యకారులను కాపాడాలని పవన్ కల్యాణ్ అధికారులను ఆదేశించారు.

 

ABOUT THE AUTHOR

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks