మత్స్యకార కుటుంబాలకు ప్రభుత్వం భరోసా.. 4 లక్షల మందికిపైగా గ్రూప్ ఇన్సురెన్స్!
రాష్ట్రంలో మత్స్యకార కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పిస్తూ.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మత్స్యకారులకు గ్రూప్ బీమా పాలసీ అందిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
తెలంగాణలోని మత్స్యకారుల సంక్షేమం, వారి కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గానూ నమోదు చేసుకున్న మత్స్యకారుల కోసం గ్రూప్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ స్కీమ్ అమలుకు ఆమోదం తెలిపినట్లు మంత్రి వాకిటి శ్రీహరి వెల్లడించారు.

వేట సమయంలో జలవనరుల వద్ద ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయిన లేదా శాశ్వత వికలాంగులుగా మారిన మత్స్యకార కుటుంబాలను ఆదుకోవడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశమని మంత్రి స్పష్టం చేశారు. 18 నుండి 70 ఏళ్ల వయస్సు గల దాదాపు 4,21,767 మంది నమోదిత మత్స్యకారులకు ఈ బీమా రక్షణ వర్తిస్తుంది. జూన్ 1 నుంచే ఈ పాలసీ వ్యవధి ప్రారంభమైందని, అర్హులైన ప్రతి మత్స్యకారుడికీ బీమా కవరేజ్ అందుతుందని తెలిపారు.
ప్రమాదవశాత్తు మరణిస్తే.. బాధిత కుటుంబానికి రూ. 5 లక్షల అందిస్తారు. పూర్తి శాశ్వత వైకల్యం: రూ. 5 లక్షల పరిహారం, పాక్షిక వైకల్యం: రూ. 2.5 లక్షల పరిహారం, ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చేరితే రూ. 25,000 వరకు వైద్య సాయం అందిస్తారు.
ఈ పథకానికి అయ్యే ప్రీమియం భారాన్ని మత్స్యకారులపై వేయకుండా ప్రభుత్వమే పూర్తిగా భరిస్తోంది. ఒక లబ్ధిదారునికి వార్షిక ప్రీమియం రూ. 79.96 కాగా, దీనిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 60:40 నిష్పత్తిలో పంచుకుంటాయి. రాష్ట్ర వాటాగా తెలంగాణ ప్రభుత్వం రూ. 21.34 కోట్లు కేటాయించింది.
తెలంగాణ ఏర్పాటు తర్వాత చెరువులు, ప్రాజెక్టుల్లో ఉచిత చేప పిల్లల పంపిణీ, సబ్సిడీ వాహనాల అందజేత, మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలకు ప్రోత్సాహం అందించడం ద్వారా మత్స్యకార కుటుంబాల ఆర్థిక ముఖచిత్రం మారింది. ప్రమాదాలకు గురైన వేళ క్లెయిమ్‌లను వేగంగా పరిష్కరించేలా జిల్లాల్లో ప్రత్యేక అధికారులను నియమించనున్నట్లు మత్స్యశాఖ వర్గాలు తెలిపాయి.
ప్రమాదకర పరిస్థితుల్లో నీటి వనరుల వద్ద వృత్తిని కొనసాగించే మత్స్యకారులకు ప్రమాద బీమా ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది. బాధితుల కుటుంబాలకు కొండంత అండగా నిలుస్తుందని మత్స్యకార సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


