కృష్ణా నదీ తీరాన ఉన్న పున్నమి ఘాట్‌లో విజయవాడ ఉత్సవ్ పండుగ వాతావరణంలో అత్యంత వైభవంగా జరిగింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ఈ వేడుకల్లో ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. విజయవాడ నగరానికి తొలిసారి విచ్చేసిన తమిళనాడు సీఎం విజయ్‌కు ఏపీ ప్రభుత్వం, నగర ప్రజల నుంచి ఘన స్వాగతం లభించింది.

ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో సీఎం చంద్రబాబుతో తమిళనాడు సీఎం విజయ్ భేటీ అయ్యారు. అనంతరం ఇద్దరు నేతలు నేరుగా పున్నమి ఘాట్‌కు చేరుకుని విజయవాడ ఉత్సవ్‌లో నిర్వహించిన పలు విభిన్న సాంస్కృతిక, కళా ప్రదర్శనలను ఆసక్తిగా తిలకించారు. అశేష జనవాహిని మధ్య జరిగిన ఈ వేడుకలో తమిళనాడు సీఎం విజయ్‌ను ఏపీ సీఎం చంద్రబాబు శాలువాతో సత్కరించారు.
ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. తమిళనాడు సీఎం విజయ్ రాకతో విజయవాడ నగరం దద్దరిల్లిపోయిందని, అభిమానం ఆకాశమే హద్దుగా ప్రజలు తరలివచ్చారని అన్నారు. పార్టీ స్థాపించిన కేవలం రెండు సంవత్సరాలలోనే విజయం సాధించి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించడం విజయ్ నాయకత్వ పఠిమకు నిదర్శనమని కితాబిచ్చారు.
తమిళనాడు రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడిపించేందుకు ఆయన కంకణం కట్టుకున్నారని చంద్రబాబు కొనియాడారు. 'రాష్ట్రాలు వేరైనా మా అభిమతం, ఆశయం ఒక్కటే. ఆంధ్రప్రదేశ్, తమిళనాడుతో పాటు పొరుగున ఉన్న తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలు కూడా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని మేము ఆకాంక్షిస్తున్నాం.' అని చంద్రబాబు పేర్కొన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో దేశంలో ఏదైనా సాధ్యమవుతుందని చంద్రబాబు స్పష్టం చేశారు. సాంకేతికత, పరిజ్ఞానంతో పాటు ఆధ్యాత్మికత కూడా తోడైనప్పుడే సమాజం పురోగమిస్తుందని, ఇటువంటి ఉత్సవాలు ఆధ్యాత్మిక భావాన్ని పెంపొందిస్తాయని అన్నారు. 2047 నాటికి భారతదేశం ప్రపంచంలోనే అత్యున్నత ప్రథమ స్థానంలో నిలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
దక్షిణ భారతదేశంలో నీటి ప్రాజెక్టులు, నదుల అనుసంధానంపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. కనకదుర్గమ్మ తల్లి దివ్య ఆశీస్సులతో భవిష్యత్తులో గోదావరి, కృష్ణా, పెన్నా, తుంగభద్ర, కావేరి అనే ఐదు ప్రధాన నదుల అనుసంధానం జరుగుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. కృష్ణా, గోదావరి నదులు విజయవాడ కేంద్రంగానే కలుస్తున్నాయని, రాబోయే రోజుల్లో గోదావరి-కావేరి అనుసంధానం కూడా సాకారమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
తెలుగులో స్పీచ్ మెుదలుపెట్టిన సీఎం విజయ్
{{/usCountry}}దక్షిణ భారతదేశంలో నీటి ప్రాజెక్టులు, నదుల అనుసంధానంపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. కనకదుర్గమ్మ తల్లి దివ్య ఆశీస్సులతో భవిష్యత్తులో గోదావరి, కృష్ణా, పెన్నా, తుంగభద్ర, కావేరి అనే ఐదు ప్రధాన నదుల అనుసంధానం జరుగుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. కృష్ణా, గోదావరి నదులు విజయవాడ కేంద్రంగానే కలుస్తున్నాయని, రాబోయే రోజుల్లో గోదావరి-కావేరి అనుసంధానం కూడా సాకారమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
తెలుగులో స్పీచ్ మెుదలుపెట్టిన సీఎం విజయ్
{{/usCountry}}తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ తన ప్రసంగాన్ని తెలుగులో అందరికీ నమస్కారం అంటూ ప్రారంభించి సభకు హాజరైన వేలాది మంది ప్రజలను, అభిమానులను విశేషంగా ఆకట్టుకున్నారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాల వేళ విజయవాడకు రావడం, దుర్గమ్మను దర్శించుకుని ఈ వేడుకల్లో భాగస్వామి కావడం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని విజయ్ పేర్కొన్నారు.
విమానాశ్రయం నుంచి పున్నమి ఘాట్ వరకు విజయవాడ ప్రజలు తనకు ఘనస్వాగతం పలికారని చెబుతూ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. థాంక్యూ విజయవాడ.. మీ చూపించిన నిష్కల్మషమైన అభిమానానికి నేను ఎల్లప్పుడూ రుణపడి ఉంటాను అని భావోద్వేగంగా మాట్లాడారు.
ఏపీ సీఎం చంద్రబాబుతో జరిపిన భేటీలో ప్రధానంగా నదుల అనుసంధానం, నీటి వనరుల సమర్థవంతమైన వినియోగం, వ్యవసాయ అభివృద్ధి, రెండు రాష్ట్రాల ఉమ్మడి ప్రయోజనాలపై సుదీర్ఘంగా చర్చించినట్లు విజయ్ తెలిపారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒకే వేదికపై కనిపించడం జనాలకు ఆసక్తికరంగా అనిపించింది.