AP Crop Insurance Scheme : ఏపీ రైతులకు అలర్ట్ - ఈనెల 31తో ముగియనున్న పంట బీమా గడువు..!

AP Crop Insurance : ఆంధ్రప్రదేశ్‌లోని రైతులకు రాష్ట్ర వ్యవసాయ శాఖ కీలక ప్రకటన చేసింది. పునర్వ్యవస్థీకరించిన వాతావరణ ఆధారిత పంటల బీమా పథకం (RWBCIS) నమోదుకు జూలై 31 చివరి తేదీ. అర్హులైన రైతులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని స్పష్టం చేసింది.

Published on: Jul 29, 2026, 13:43:54 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

AP Crop Insurance Scheme : ఆంధ్రప్రదేశ్‌లోని అన్నదాతలకు రాష్ట్ర వ్యవసాయ శాఖ కీలకమైన అప్డేట్ ఇచ్చింది. వాతావరణ మార్పులు, హఠాత్తుగా సంభవించే ప్రకృతి విపత్తుల వల్ల జరిగే తీవ్ర నష్టాల నుంచి పంటలకు రక్షణ కల్పించేందుకు కూటమి ప్రభుత్వం 'పునర్వ్యవస్థీకరించిన వాతావరణ ఆధారిత పంటల బీమా పథకం' (RWBCIS)ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ పథకం కింద తమ పంటలకు బీమా చేయించుకోవడానికి అధికారులు చివరి తేదీని ప్రకటించారు. అర్హులైన రైతులు 2026 జూలై 31వ తేదీలోగా తప్పనిసరిగా నమోదు ప్రక్రియను పూర్తి చేసుకోవాలని వ్యవసాయ శాఖ స్పష్టం చేసింది.

ఏపీ రైతులకు ముఖ్య గమనిక (Photographed by Hemant Mishra/Mint)
ఏపీ రైతులకు ముఖ్య గమనిక (Photographed by Hemant Mishra/Mint)

తీవ్ర వర్షాభావం, అకాల వర్షాలు, తుఫానులు, ఈదురు గాలులు లేదా వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల ఏటా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇటువంటి కష్టకాలంలో రైతాంగానికి ఆర్థికంగా కొండంత అండగా నిలవడమే ఈ పంటల బీమా ముఖ్య ఉద్దేశం. ఈ గడువు ముగిస్తే బీమా చేసుకునే అవకాశం ఉండదు కాబట్టి, రైతులు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే తమ సమీప వ్యవసాయ అధికారులను లేదా రైతు సేవా కేంద్రాలను సంప్రదించి పంటల వివరాలను నమోదు చేయించుకోవాలని ప్రభుత్వం సూచించింది.

జూలై 31వ తేదీతో గడువు ముగిసే జిల్లాలు:

రాష్ట్రవ్యాప్తంగా నిర్దేశించిన అనేక జిల్లాల్లో ఈ పథకం నమోదు వేగంగా జరుగుతోంది. జూలై 31వ తేదీ నాటికి గడువు ముగియనున్న జిల్లాల జాబితాను వ్యవసాయ శాఖ ప్రత్యేకంగా వెల్లడించింది. ఆయా జిల్లాల వివరాలు ఇలా ఉన్నాయి….

  • ఎన్టీఆర్
  • గుంటూరు
  • కాకినాడ
  • వైఎస్ఆర్ కడప
  • అన్నమయ్య
  • విజయనగరం
  • శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు
  • చిత్తూరు
  • శ్రీకాకుళం
  • శ్రీ సత్యసాయి
  • తిరుపతి
  • తూర్పు గోదావరి
  • పార్వతీపురం మన్యం

ఆపద సమయంలో లేదా ప్రకృతి వైపరీత్యాలు ముంచెత్తినప్పుడు పంట బీమా ఎంతో రక్షణ ఇస్తుంది. కాబట్టి పైన పేర్కొన్న జిల్లాల్లోని రైతులందరూ సమయాన్ని వృథా చేయకుండా, నిర్ణీత గడువు లోగానే తమ పంటలకు బీమా చేయించుకోవాలని వ్యవసాయ శాఖ విజ్ఞప్తి చేస్తోంది.

ఎలా చేసుకోవాలంటే..?

పంటల బీమా కోసం ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేదు. పీఎంఎఫ్‌బీవై వెబ్‌సైట్‌ ( https://pmfby.gov.in/ ) లేదా క్రాప్‌ ఇన్సూరెన్సు ఫార్మర్‌ యాప్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ముందుగా యాప్‌లో లాగిన్‌ అవ్వాలి. వివరాలను ధ్రువీకరించాలి. పంట, భూమి వివరాలను నమోదు చేయాలి. అవసరమైన పత్రాలను అప్‌లోడ్‌ చేయాలి. బీమా ప్రీమియం చెల్లించి రసీదు డొన్లోడ్ చేసుకోవచ్చు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More