AP Degree Admissions 2026 Counselling : రాష్ట్రంలోని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ డిగ్రీ కళాశాలల్లో మొదటి సంవత్సరం కోర్సుల్లో చేరేందుకు కౌన్సెలింగ్ ప్రక్రియ సాగుతోంది. 2026-27 విద్యాసంవత్సరానికి గాను డిగ్రీ ప్రవేశాల ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ గడువు ముగియగా... మరోవైపు వెబ్ ఆప్షన్లు అందుబాటులోకి వచ్చాయి. ఈ గడువు ఆగస్ట్ 27వ తేదీతో ముగుస్తుంది. సమయం దగ్గరపడిన నేపథ్యంలో రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులు వెంటనే వెబ్ ఆప్షన్ల ప్రాసెస్ పూర్తి చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
డిగ్రీ ప్రవేశాల కౌన్సెలింగ్ - ముఖ్య తేదీలు :
- వెబ్ ఆప్షన్ల నమోదు : విద్యార్థులు తమకు నచ్చిన కళాశాలలు, కోర్సులను ఎంచుకోవడానికి ఆగస్ట్ 27వ తేదీ వరకు గడువు ఉంటుంది.
- ఆప్షన్ల ఎడిట్ : నమోదు చేసుకున్న వెబ్ ఆప్షన్లలో ఏవైనా మార్పులు లేదా చేర్పులు చేసుకోవాలనుకునే అభ్యర్థులకు ఈ నెల 28వ తేదీన ఎడిట్ చేసుకోవడానికి అవకాశం కల్పించారు.
- సీట్ల కేటాయింపు : విద్యార్థులు ఎంచుకున్న ఆప్షన్లు, ఇంటర్మీడియట్ మెరిట్ మార్కులు మరియు రిజర్వేషన్ల ఆధారంగా సెప్టెంబర్ 2వ తేదీన సీట్ల కేటాయింపు వివరాలను వెల్లడిస్తారు.
- ఇక సీట్లు పొందిన అభ్యర్థులు సెప్టెంబర్ 3 నుంచి 7వ తేదీల మధ్య తమకు కేటాయించిన కళాశాలలకు నేరుగా వెళ్లాల్సి ఉంటుంది. అక్కడ అవసరమైన ఒరిజినల్ సర్టిఫికెట్లను సమర్పించి సెల్ఫ్ రిపోర్టింగ్ పూర్తి చేయాలి.
- అధికారిక వెబ్ సైట్ - https://cap.apcfss.in/

{{^htLoading}} {{/htLoading}}
మరోవైపు డిగ్రీ మొదటి సంవత్సరం రెగ్యులర్ తరగతులను సెప్టెంబర్ 3వ తేదీ నుంచే ప్రారంభించనున్నట్లు ఉన్నత విద్యాశాఖ స్పష్టం చేసింది. కాబట్టి విద్యార్థులు ఆఖరి నిమిషం వరకు వేచి చూడకుండా నిర్ణీత గడువు లోపలే వెబ్ ఆప్షన్ల ప్రక్రియను పూర్తి చేసుకోవాలని అధికారులు కోరారు.
Advertisement
{{/htLoading}}{{#usCountry}} {{/usCountry}}