AP DSC 2026: డీఎస్సీ అభ్యర్థులకు అలర్ట్.. నియామకాల్లో కీలక మార్పులు
AP DSC 2026 New Rules : ఏపీ డీఎస్సీ 2026లో ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. కనీస అర్హత మార్కులను తప్పనిసరిగా సాధించాలనే నిబంధన తీసుకొచ్చింది.
ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయ నియామకాల కోసం నిర్వహించే డీఎస్సీ-2026 (AP DSC 2026) నిబంధనల్లో పాఠశాల విద్యాశాఖ పలు కీలక సంస్కరణలు చేపట్టింది. పోటీ పరీక్షల నిర్వహణ, అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో పారదర్శకతను పెంచేందుకు సరికొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈసారి కనీస అర్హత మార్కులు, స్థానిక కేటాయింపులు, ప్రాధాన్య ఆప్షన్స్ ఎడిట్ సదుపాయంతో పాటు క్రీడా కోటా నిబంధనలలో మార్పులు తీసుకొచ్చారు.

కేటగిరీల వారీగా కనీస అర్హత మార్కులు
కొత్త మార్గదర్శకాల ప్రకారం రాతపరీక్ష, టెట్ వెయిటేజీ కలిపి అభ్యర్థులు కేటగిరీల వారీగా కనీస అర్హత మార్కులు సాధించడం తప్పనిసరి. కట్ ఆఫ్ కంటే తక్కువ మార్కులు వస్తే ఉద్యోగ ఎంపికకు అనర్హులుగా ప్రకటిస్తారు. పోస్టులు మిగిలిపోయినా ఈ నిబంధనలో సడలింపు ఉండదు. గతంలో ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీలో కనీస అర్హత మార్కుల నిబంధన లేదు. ఈ కారణంగా కొన్ని కేటగిరీల అభ్యర్థులకు మార్కులు తక్కువ వచ్చినా ఉద్యోగం ఇవ్వాల్సి వచ్చేది.
కొత్తగా తీసుకొచ్చిన కనీస మార్కుల నిబంధన ప్రకారం.. OC / EWS వారికి 40 శాతం కనీస మార్కులు, బీసీ కేటగిరీ 35 శాతం, ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులకు 30 శాతం కనీస మార్కులు రావాలి.
రాష్ట్రపతి ఉత్తర్వులు-2025కు అనుగుణంగా నియామకాలు ఉంటాయి. 95 శాతం పోస్టులు స్థానిక అభ్యర్థులకు కేటాయిస్తారు. 5 శాతం పోస్టులు ఓపెన్ కాంపిటీషన్ కింద ఉంటాయి. వీటిని స్థానిక, స్థానికేతర అభ్యర్థుల మెరిట్ ఆధారంగా భర్తీ చేస్తారు.
లాంగ్వేజ్ స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు 2017 తర్వాత నిర్వహించిన ప్రత్యేక భాషా టెట్ మార్కులను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు. అంతకుముందు నాటి ఉమ్మడి టెట్ మార్కులను అంగీకరించరు.
గత డీఎస్సీ అనుభవాలను దృష్టిలో ఉంచుకుని అభ్యర్థులకు బిగ్ రిలీఫ్ ఇచ్చారు. దరఖాస్తు సమయంలో పోస్టులు, యాజమాన్యాల ప్రాధాన్య క్రమాన్ని నమోదు చేయాలి. మెరిట్ జాబితా విడుదల చేసిన తర్వాత ఆప్షన్లను మార్చుకోవడానికి వారం రోజుల పాటు ఎడిట్ ఆప్షన్ సదుపాయం కల్పిస్తారు.
కేజీబీవీ, టీటీడీ, ఐఈఆర్‌టీ, ఐఈడీఎస్‌ఎస్ తదితర సంస్థల్లో పనిచేసిన ప్రత్యేక ఉపాధ్యాయులకు సర్వీస్ ఆధారంగా అదనపు మార్కులు ఇస్తారు. ప్రతి ఒక సంవత్సరం సర్వీసుకు 0.5 మార్కులు కేటాయిస్తారు. గరిష్ఠంగా 5 మార్కులు ఉంటాయి. ఒక ఏడాదిలో 6 నెలల కంటే ఎక్కువ అనుభవం ఉంటే దానిని పూర్తి సంవత్సరంగా పరిగణిస్తారు. డీఎస్సీ రాతపరీక్షలో కనీస అర్హత మార్కులు సాధించిన వారికి మాత్రమే ఈ వెయిటేజీ వర్తిస్తుంది.
క్రీడా కోటా నిబంధనలు
శాప్(SAAP) స్పోర్ట్స్ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకుని, ఆ ఐడీని డీఎస్సీ అప్లికేషన్‌లో నమోదు చేయాలి. అప్‌లోడ్ చేసిన సర్టిఫికెట్లలో ఉత్తమమైన 3 సర్టిఫికెట్లను ఎంచుకోవాలి. వీటిని జెన్యూనిటీ పరిశీలనకు పంపుతారు. స్పోర్ట్స్ కోటా అభ్యర్థులు కూడా డీఎస్సీ రాతపరీక్షలో కనీస అర్హత మార్కులు సాధించడం తప్పనిసరి.
వయోపరిమితి
గరిష్ఠ వయోపరిమితి (2026 జులై 1 నాటికి) ఓపెన్ కేటగిరీ 44 ఏళ్లు, ఎస్సీ/ఎస్టీ/బీసీ/ఈడబ్ల్యూఎస్ 49 ఏళ్లు (5 ఏళ్ల సడలింపు), దివ్యాంగులకు 54 ఏళ్లు (10 ఏళ్ల సడలింపు) వరకు అవకాశం ఉంది. మాజీ సైనికోద్యోగులకు సైనిక సర్వీస్ కాలంతో పాటు అదనంగా 3 ఏళ్ల మినహాయింపు ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ
నియామకాల కోసం వెయిటింగ్ లిస్ట్ అంటూ ఉండదు. మిగిలిపోయిన ఖాళీలను తదుపరి నోటిఫికేషన్‌కే మళ్లిస్తారు. ఎంపికైన అభ్యర్థులకు డైరెక్ట్ రెగ్యులర్ నియామక ఉత్తర్వులు ఇస్తారు(అప్రెంటిస్ విధానం ఉండదు). నియామక పత్రం అందుకున్న 30 రోజుల్లోగా విధుల్లో చేరకపోతే ఉద్యోగ అవకాశం రద్దవుతుంది.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


