...
...
Next Story

AP DSC Notification 2026 : ఉగాదికి డీఎస్సీ నోటిఫికేషన్.. ఖాళీలు ఎన్ని ఉన్నాయంటే?

ఆంధ్రప్రదేశ్‌లో మరో డీఎస్సీ నోటిఫికేషన్ రానుంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు ఉపాధ్యాయ నియామకాలపై కసరత్తు చేస్తోంది.

Published on: Feb 19, 2026 11:39 AM IST
Advertisement

ఆంధ్రప్రదేశ్‌లో ప్రతీ సంవత్సరం డీఎస్సీ నిర్వహిస్తామని గతంలో మంత్రి నారా లోకేశ్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు మరో డీఎస్సీ నోటిఫికేషన్ కోసం కసరత్తు జరుగుతోంది. ఈ ఉగాది పండుగ సమయంలో మరో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని ప్రభుత్వం చూస్తోంది. కిందిస్థాయి నుంచి ఖాళీల వివరాలను పాఠశాల విద్యాశాఖ సేకరించినట్టుగా సమాచారం.

ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్ 2026
ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్ 2026

ఆదర్శ పాఠశాలలు, ఏపీ రెసిడెన్షియల్‌ ఎడ్యుకేషన్‌ ఇనిస్టిట్యూషన్లు, సంక్షేమ శాఖల్లో ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇప్పటికే ఇందులో ఖాళీలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించారు అధికారులు. మెుత్తం పోస్టులు 3600 వరకు ఉండవచ్చని తెలుస్తోంది. కిందటి ఏడాది మిగిలిన పోస్టులు కూడా ఇందులో ఉన్నాయి.

అయితే చాలా మంది సిలబస్‌లో ఏమైనా మార్పులు ఉంటాయా అని అనుమానపడుతున్నారు. కానీ ఈసారి ఉగాదికి వచ్చే డీఎస్సీ సిలబస్‌లో ఎలాంటి మార్పు చేయడం లేదు. కిందటి ఏడాది డీఎస్సీకి ఇచ్చిన సిలబస్, మార్గదర్శకాలే ఉంటాయి. ఇప్పటికే ప్రిపేర్ అవుతున్నవారు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రిపరేషన్ కొనసాగించవచ్చు. ప్రత్యేక డీఎస్సీ సిలబస్‌ ఇప్పటికే వెబ్‌సైట్‌లో ఉంది. ఆంగ్ల భాష ప్రావీణ్యం పరీక్ష, కంప్యూటర్‌ ప్రావీణ్యం పరీక్షపై ప్రస్తుతానికి ఆలోచన లేదు.

నిజానికి ఇంగ్లీష్ ఫ్రొఫిషియెన్సీ టెస్టుతో పాటు కంప్యూటర్ నాలెడ్జ్ టెస్టులు కూడా నిర్వహించాలని భావించింది ప్రభుత్వం. ఇంగ్లీష్ మీడియం బోధనలో ఇబ్బందులు రాకుండా ఉండటమే కాకుండా పాఠశాల స్థాయిలోనే పిల్లలకు బేసిక్‌ కంప్యూటర్‌ నాలెడ్జ్‌ అందించవచ్చని విద్యాశాఖ లెక్కలు వేసుకుంది. కానీ ప్రస్తుతానికి ఉగాది డీఎస్సీ నోటిఫికేషన్‌లో దీని గురించి ప్రస్తావన ఉండదు.

ఇటీవల మంత్రి సవిత కూడా డీఎస్సీ గురించి మాట్లాడారు. త్వరలో డీఎస్సీ రాబోతోందని తెలిపారు. ప్రభుత్వ రంగంలో ఉండే కీలక స్థానాల్లో బీసీ యువత ఉండాలన్నది సీఎం చంద్రబాబు సంకల్పమన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడగానే సివిల్ సర్వీసెస్, డీఎస్సీ వంటి పోటీ పరీక్షలకు ఉచిత కోచింగ్ అందజేయాలని నిర్ణయించారన్నారు. త్వరలో రాబోయే డీఎస్సీ నోటిఫికేషన్‌కు బీసీ స్టడీ సర్కిల్‌లో ఉచిత కోచింగ్ అందిస్తామని ఇటీవల వెల్లడించారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe