రాష్ట్రంలో అగ్రికల్చర్, ఫార్మసీ, బయోటెక్నాలజీ తదితర వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఏపీ ఈఏపీసెట్ (AP EAPCET) 2026 బైపీసీ (BiPC) స్ట్రీమ్ కౌన్సెలింగ్ కొనసాగుతోంది. ఒకవైపు విద్యార్థుల ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు, ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపుల ప్రక్రియ కొనసాగుతుండగా…. ప్రవేశాల ప్రక్రియలో అత్యంత కీలకమైన వెబ్ ఆప్షన్ల నమోదు కూడా అందుబాటులోకి వచ్చింది.

అభ్యర్థులు సాధించిన మెరిట్ ర్యాంకు, రిజర్వేషన్ కేటగిరీలను ప్రాతిపదికగా తీసుకుని ఈ నెల 23వ తేదీన మొదటి విడత సీట్లను కేటాయించనున్నట్లు ఉన్నత విద్యామండలి అధికారులు స్పష్టం చేశారు.
కౌన్సెలింగ్ షెడ్యూల్ — ముఖ్యమైన తేదీలు
- రిజిస్ట్రేషన్, ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు : ఆగస్టు 17వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించి నమోదు చేసుకోవచ్చు.
- సర్టిఫికెట్ల పరిశీలన : నిర్దేశిత సహాయ కేంద్రాల (HLCs) వద్ద ఆన్‌లైన్ ధ్రువపత్రాల పరిశీలన ఆగస్టు 18వ తేదీ వరకు కొనసాగుతుంది.
- వెబ్ ఆప్షన్ల నమోదు : విద్యార్థులు తమకు కావలసిన కోర్సులు, ప్రాధాన్యత గల కళాశాలలను ఆగస్టు 19వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లుగా ఎంచుకోవచ్చు.
- నమోదు చేసిన వెబ్ ఆప్షన్లలో ఏవైనా మార్పులు లేదా చేర్పులు చేసుకోవాలనుకుంటే ఆగస్టు 20న అవకాశం కల్పిస్తారు.
- సీట్ల కేటాయింపు : మెరిట్, రిజర్వేషన్ ఆధారంగా ఆగస్టు 23న ప్రథమ విడత సీట్లను కేటాయిస్తారు.
- కళాశాలల్లో రిపోర్టింగ్: సీట్లు పొందిన అభ్యర్థులు ఆగస్టు 24 నుంచి 27వ తేదీలోపు కేటాయించిన కళాశాలల్లో స్వయంగా రిపోర్ట్ చేసి అడ్మిషన్ పూర్తి చేయాల్సి ఉంటుంది.
సీట్ల కేటాయింపు పూర్తయిన వెంటనే…. అంటే ఈ నెల 24వ తేదీ నుంచే కళాశాలల్లో తరగతులను ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు. కాబట్టి అభ్యర్థులు చివరి నిమిషం వరకు వేచి చూడకుండా…. నిర్దేశిత గడువు లోగానే సర్టిఫికేట్ల పరిశీలన, వెబ్ ఆప్షన్ల ప్రక్రియను పూర్తి చేసుకోవాలని సూచించారు.
ఈ ఏడాది నిర్వహించిన ఏపీ ఈఏపీసెట్ - 2026 బైపీసీ (అగ్రికల్చర్, ఫార్మసీ) విభాగంలో విద్యార్థులు విశేష ప్రతిభ కనబరిచారు. పరీక్ష రాసిన వారిలో ఏకంగా 89.59 శాతం మంది ఉత్తీర్ణత సాధించగా, మొత్తం 63,546 మంది అభ్యర్థులు కౌన్సెలింగ్కు అర్హత పొందారు. అర్హత సాధించిన అభ్యర్థులందరూ ఈ కౌన్సెలింగ్ విధానంలో పాల్గొని తమకు నచ్చిన కోర్సు, కళాశాలలను ఎంచుకోవచ్చు.
{{/usCountry}}ఈ ఏడాది నిర్వహించిన ఏపీ ఈఏపీసెట్ - 2026 బైపీసీ (అగ్రికల్చర్, ఫార్మసీ) విభాగంలో విద్యార్థులు విశేష ప్రతిభ కనబరిచారు. పరీక్ష రాసిన వారిలో ఏకంగా 89.59 శాతం మంది ఉత్తీర్ణత సాధించగా, మొత్తం 63,546 మంది అభ్యర్థులు కౌన్సెలింగ్కు అర్హత పొందారు. అర్హత సాధించిన అభ్యర్థులందరూ ఈ కౌన్సెలింగ్ విధానంలో పాల్గొని తమకు నచ్చిన కోర్సు, కళాశాలలను ఎంచుకోవచ్చు.
{{/usCountry}}ప్రవేశ పరీక్షలో సాధించిన ర్యాంకుల ఆధారంగా వివిధ విడతల్లో ఈ కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. సాధారణ కౌన్సెలింగ్ విడతలన్నీ పూర్తయిన తర్వాత కూడా ఏవైనా సీట్లు ఖాళీగా మిగిలిపోతే, వాటి భర్తీ కోసం ప్రత్యేకంగా స్పాట్ అడ్మిషన్ల మార్గదర్శకాలను ఉన్నత విద్యామండలి విడుదల చేయనుంది.