AP EAPCET 2026 Counselling : ఏపీ ఈఏపీసెట్‌ తుది విడత కౌన్సెలింగ్ షెడ్యూల్‌ విడుదల - ముఖ్యమైన తేదీలివే

AP EAPCET 2026 Final Phase Counselling : ఏపీ ఈఏపీసెట్‌ 2026 ఇంజినీరింగ్‌ ప్రవేశాలకు సంబంధించి తుది దశ కౌన్సెలింగ్‌ నోటిఫికేషన్‌ విడుదలైంది. ఆగస్టు 17 నుంచి 27 వరకు ఈ ప్రక్రియ కొనసాగనుంది.

Published on: Aug 14, 2026, 14:31:15 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

AP EAPCET 2026 Final Phase Counselling : రాష్ట్రంలో ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఏపీ ఈఏపీసెట్ (APEAPCET)-2026 తుది దశ కౌన్సెలింగ్ ప్రక్రియకు సంబంధించి కీలక అప్డేట్ వచ్చేసింది. ఉన్నత విద్యామండలి నుంచి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ కౌన్సెలింగ్ ప్రక్రియ ఆగస్టు 17వ తేదీ నుంచి ప్రారంభమై ఆగస్టు 27వ తేదీ వరకు కొనసాగనుంది. ఈఏపీసెట్‌-2026 పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని కళాశాలలు, కోర్సులకు సంబంధించి ఆప్షన్లను నమోదు చేసుకోవచ్చు.

ఏపీ ఈఏపీసెట్‌ 2026 కౌన్సెలింగ్
ఏపీ ఈఏపీసెట్‌ 2026 కౌన్సెలింగ్

AP EAPCET ఫైనల్ ఫేజ్ కౌన్సెలింగ్ - ముఖ్యమైన తేదీలు :

  • ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు, సర్టిఫికెట్ల వెరిఫికేషన్ : ఆగస్టు 17, 2026 నుండి ఆగస్టు 20, 2026 వరకు
  • హెల్ప్ లైన్ సెంటర్లలో సర్టిఫికెట్ల ఆన్‌లైన్ వెరిఫికేషన్ : ఆగస్టు 17, 2026 నుండి ఆగస్టు 21, 2026 వరకు
  • వెబ్ ఆప్షన్ల నమోదు : ఆగస్టు 17, 2026 నుండి ఆగస్టు 22, 2026 వరకు
  • నమోదు చేసుకున్న వెబ్ ఆప్షన్లలో మార్పులకు అవకాశం : ఆగస్టు 23, 2026
  • సీట్ల కేటాయింపు (సీట్ అలాట్‌మెంట్) ఫలితాల విడుదల : ఆగస్టు 26, 2026
  • కళాశాలల్లో సెల్ఫ్ రిపోర్టింగ్ - వ్యక్తిగతంగా హాజరుకావడం : ఆగస్టు 27, 2026 నుండి ఆగస్టు 31, 2026 వరకు
  • కళాశాలల్లో తరగతుల ప్రారంభం ఆగస్టు 27, 2026.

విద్యార్థులు నిర్ణీత గడువులోగా అధికారిక పోర్టల్ ద్వారా ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి, ధ్రువపత్రాలను సరిచూసుకోవాలని కౌన్సెలింగ్ నిర్వహణ అధికారులు తెలిపారు. ఈ అవకాశాన్ని అర్హులైన అభ్యర్థులందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మొదటి విడత కౌన్సెలింగ్ లో సీటు రానివారితో పాటు గతంలో సీటు ఖరారైన విద్యార్థులు కూడా ఇందులో పాల్గొనొచ్చు. అయితే మొదటి విడత కౌన్సెలింగ్ లో సెల్ఫ్ రిపోర్టింగ్ ద్వారా సీటు ఖరారు చేసుకుంటే… ఇందులో పాల్గొనేందుకు అవకాశం ఉండదు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More