...
...
Next Story

AP EAPCET : ఏపీ ఈఏపీసెట్ 2026 అప్డేట్ - వెంటనే దరఖాస్తు చేసుకోండి..! గడువు దాటితే లేట్ ఫీజు చెల్లించాల్సిందే

AP EAPCET Online Applications : ఏపీఈఏపీసెట్ - 2026 దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. అయితే ఫైన్ లేకుండా దరఖాస్తు చేసుకునేందుకు గడువు దగ్గరపడింది. అర్హులైన అభ్యర్థులు మార్చి 24వ తేదీ వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు.

Published on: Mar 23, 2026 10:04 AM IST
Advertisement

రాష్ట్రంలోని ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కాలేజీల్లో ప్రవేశాలకు నిర్వహించే ఏపీఈఏపీసెట్ - 2026 దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. అయితే ఫైన్ లేకుండా దరఖాస్తు చేసుకునేందుకు గడువు పొడిగించగా… ఆ తేదీ కూడా దగ్గరపడింది. అర్హులైన విద్యార్థులు…. మార్చి 24వ తేదీ వరకు అప్లయ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆయా విద్యార్థులు ఆలస్యం చేయకుండా వెంటనే దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. మార్చి 24వ తేదీ దాటితే… సాధారణ ఫీజుతో పాటు ఫైన్ కూడా చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

ఆలస్య రుసుంతో దరఖాస్తు తేదీలు:

ఏపీఈఏపీసెట్ - 2026 దరఖాస్తులు (istock image)
ఏపీఈఏపీసెట్ - 2026 దరఖాస్తులు (istock image)

ఇక రూ. 1000 ఫైన్ తో మార్చి 28వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక రూ. 2 వేల ఫైన్ తో ఏప్రిల్ 1, 4 వేల ఆలస్య రుసుంతో ఏప్రిల్ 6వ తేదీ వరకు అవకాశం కల్పించారు. రూ. 10 వేల ఫైన్ తో ఏప్రిల్ 10వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తాజా ప్రకటనలో తెలిపారు.

ఇక ఏపీ ఈఏపీసెట్ అప్లికేషన్ ఎడిట్ ఆప్షన్ ఏప్రిల్ 11వ తేదీన అందుబాటులోకి రానుంది. ఏప్రిల్ 13వ తేదీ వరకు ఏమైనా తప్పులుంటే సరిచేసుకోవచ్చు. ఏప్రిల్ 28వ తేదీన హాల్ టికెట్లు అందుబాటులోకి వస్తాయి. మే 12వ తేదీ నుంచి 15 వరకు వరకు ఇంజినీరింగ్ స్ట్రీమ్ పరీక్షలను నిర్వహిస్తారు.మరియు18-05-2026 తేదీల్లో పూర్తవుతాయి. ఇక అగ్రికల్చర్, ఫార్మసీ స్ట్రీమ్ పరీక్షలు మే 19న ప్రారంభమై…20వ తేదో పూర్తవుతాయి. జూన్ 1వ తేదీన ఫలితాలు ప్రకటించే అవకాశం ఉంటుంది.

ఏపీ ఈఏపీసెట్ - 2026 దరఖాస్తు చేసుకునేందుకు ఇంటర్ పూర్తి అయిన వారితో పాటు ప్రస్తుతం ఇంటర్మీడియట్ సెకండియర్ పరీక్షలు రాసే విద్యార్థులు కూడా అర్హులవుతారు.ఈ పరీక్షను ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఉన్నత విద్యామండలి తరఫున జేఎన్‌టీయూ కాకినాడ, నిర్వహిస్తోంది.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe