రాష్ట్రంలోని బీఈడీ, బీఈడీ (స్పెషల్) కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి నిర్వహించి ఏపీ ఎడ్‌సెట్ 2026 నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. ముందుగా ప్రకటించిన తేదీల ప్రకారం… ఇవాళ్టితో లేట్ ఫీజు లేకుండా దరఖాస్తుల ప్రక్రియ ముగియాల్సి ఉంది. అయితే అధికారులు కీలక అప్డేట్ ఇచ్చారు. దరఖాస్తుల గడువు పొడిగిస్తూ… కొత్త తేదీలను ప్రకటించారు.
ఏపీ ఎడ్ సెట్ 2026 దరఖాస్తులు - కొత్త తేదీలు:
- ఎడ్ సెట్ ఆన్‌లైన్ దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ- 19-03-2025.
- రూ.1000 ఫైన్ తో దరఖాస్తుకు చివరి తేదీ - 23-03-2026.
- ఆలస్య రుసుము రూ.2000తో దరఖాస్తుకు చివరి తేదీ - 27-03-2026.
- రూ.4000 ఆలస్య రుసుంతో దరఖాస్తుకు చివరి తేదీ - 31-03-2026.
- ఆలస్య రుసుము రూ.10,000తో దరఖాస్తుకు చివరి తేదీ - 04-04-2026.
- అప్లికేషన్ ఎడిట్ ఆప్షన్ - 05-04-2026.
- ఏపీ ఎడ్ సెట్ హాల్ టికెట్ డౌన్లోడ్ - 20-04-2026.
- ప్రవేశ పరీక్ష తేదీ - 04-05-2026.
- ప్రిలిమినరీ కీ విడుదల: 07-05-2026.
- ఎడ్ సెట్ ఫలితాలు విడుదల: 18-05-2026.

ఏపీ ఎడ్ సెట్ పరీక్ష ఆధారంగా 2026- 2027 విద్యా సంవత్సరానికి బీఈడీ కోర్సుల్లో అడ్మిషన్లు కల్పిస్తారు. ఈ ఏడాది పరీక్షను చిత్తూరు జిల్లా కుప్పంలోని ద్రావిడ యూనివర్సిటీ నిర్వహిస్తోంది. చిలర్ డిగ్రీ ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. లాంగ్వేజేస్, సోషల్ స్టడీస్, మ్యాథ్స్, సైన్స్ అభ్యర్థులు ఈ పరీక్ష రాయవచ్చు.
ప్రస్తుతం చివరి సంవత్సరం డిగ్రీ చదువుతున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.ఏపీ ఎడ్ సెట్ రిజిస్ట్రేషన్ ఫీజు కింద ఎస్సీ/ ఎస్టీలకు రూ.500; బీసీలకు రూ.600గా నిర్ణయించారు. ఓసీలకు రూ.700గా ఉంది. ఆన్‌లైన్‌లోనే ఫీజు చెల్లించాలి.
ఏపీ ఎడ్‌సెట్ 2026 ఎగ్జామ్ 150 మార్కులకు ఉంటుంది.పరీక్ష పూర్తిగా ఆబ్జెక్టివ్ విధానంలోనే ఉంటుంది.పరీక్షకు కేటాయించిన సమయం రెండు గంటలు ఉంటుంది. ఫలితాల ప్రకటన తర్వాత… కౌన్సెలింగ్ షెడ్యూల్ ఖరారవుతుంది. విడతల వారీగా సీట్లను భర్తీ చేస్తారు. అభ్యర్థులు సాధించే ర్యాంకుల ఆధారంగానే సీట్ల కేటాయింపు ఉంటుంది.
ఏపీ ఎడ్‌సెట్ 2026 - అప్లికేషన్ ప్రాసెస్…
- అభ్యర్థులు https://cets.apsche.ap.gov.in/EDCET/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
- నిర్ణయించిన అప్లికేషన్ ఫీజును చెల్లించాలి.
- హోంపేజీలో కనిపించే స్టెప్ 3(ఫిల్ అప్లికేషన్) పై క్లిక్ చేయాలి.
- ఇక్కడ పేమెంట్ ఐడీ, క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ హాల్ టికెట్ నెంబర్, మొబైల్, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేయాలి.
- సబ్మిట్ చేస్తే ఆన్ లైన్ అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. మీ విద్యా అర్హతలతో పాటు సంబంధిత పత్రాలను అప్ లోడ్ చేయాలి. ఫొటో, సంతకం కూడా అవసరం.
- చివరగా సబ్మిట్ చేస్తే మీ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది.
- ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ ద్వారా రిజిస్ట్రేషన్ కాపీని పొందవచ్చు.
- హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకునే సమయంలో రిజిస్ట్రేషన్ నెంబర్ ఉపయోగపడుంది.