ప్రేమను వ్యక్తపరచడానికి ఎప్పుడూ పెద్ద పెద్ద కట్టడాలు, కోటలు అవసరం లేదు. ఒక్కోసారి అది ఎంతో నిశ్శబ్దంగా.. కేవలం ఒకరిపై ఒకరికి ఉన్న శ్రద్ధ, పట్టుదల, సృజనాత్మకత రూపంలో కూడా కనిపిస్తుంది. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి సుమారు 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న అర్తమూరు గ్రామానికి చెందిన 65 ఏళ్ల రైతు సత్తి శివనారాయణ రెడ్డి సరిగ్గా అదే చేసి చూపించారు. తీవ్రమైన మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్న తన 58 ఏళ్ల భార్య సత్యవేణి కోసం ఆయన చేసిన అద్భుతం ఇప్పుడు అందరినీ కదిలిస్తోంది.
డిగ్రీలు లేవు.. కానీ భార్య కష్టం చూడలేక

శివనారాయణ రెడ్డికి ఎలాంటి ఇంజనీరింగ్ డిగ్రీ లేదు, కనీసం సాంకేతిక శిక్షణ కూడా లేదు. కానీ తన భార్య ప్రతిరోజూ 21 మెట్లు ఎక్కి మొదటి అంతస్తుకు వెళ్లడానికి పడుతున్న నరకయాతనను ఆయన చూడలేకపోయారు. కేవలం 20 రోజుల్లో, 70 వేల రూపాయల ఖర్చుతో ఆయన స్వయంగా ఇంట్లోనే ఒక ‘ఎస్కలేటర్’ తయారు చేసి భార్యకు బహుమతిగా ఇచ్చారు.
గోదావరి డెల్టా పరిధిలోని మండపేట సమీపంలో ఉన్న అర్తమూరు గ్రామం పచ్చని వరిపొలాలు, కాలువలతో కళకళలాడుతూ ఉంటుంది. చిన్నప్పుడు స్కూలు చాలా దూరంగా ఉండటం వల్ల శివనారాయణ రెడ్డి కేవలం ఐదో తరగతి వరకే చదువుకోగలిగారు. అయితే చిన్నతనం నుంచే ఆయనకు యంత్రాలంటే అమితమైన ఆసక్తి. కాలక్రమేణా వ్యవసాయ పనిముట్లతో పని చేస్తూ ఆ నైపుణ్యాన్ని పెంచుకున్నారు. వ్యవసాయం చేస్తూనే.. తన ట్రాక్టర్లు, రైస్ మిల్లు మిషన్లను ఆయనే స్వయంగా రిపేర్ చేసుకుంటారు.
ఒక్క మాట.. ఒక ఆవిష్కరణ!
'వాస్తు నిపుణుల సలహా ప్రకారం ఇంటి యజమానిపై అంతస్తులోనే ఉండాలి. అందుకే మేం మొదటి అంతస్తులో ఉంటున్నాం. కానీ మోకాళ్ల నొప్పుల వల్ల నా భార్య మెట్లు ఎక్కడానికి పడే ఇబ్బంది నన్ను రోజు నిలవనీయలేదు. ఒకరోజు ఆమె నాతో.. మీరు టెక్నీషియన్ కదా, మన ఇంటి కోసం లిఫ్ట్ లాంటిది ఏదైనా తయారు చేయలేరా? అంది. ఆ మాట నా మనసులో బలంగా నాటుకుపోయింది.' అని చెప్పారు శివనారాయణ రెడ్డి.
ఎలాగైనా భార్య బాధను దూరం చేయాలనే పట్టుదలతో కొన్ని నెలల పాటు రకరకాల టెక్నాలజీలను అధ్యయనం చేశారు శివనారాయణ. ఆ తర్వాత ఒక మోటార్, ఎలక్ట్రికల్ వైరింగ్, ఇతర సామాగ్రిని కొనుగోలు చేసి.. 1.5 హెచ్‌పి (HP) మోటార్‌తో నడిచే ఒక చిన్న ఎస్కలేటర్‌ను సిద్ధం చేశారు. ఇది చాలా తక్కువ విద్యుత్‌ను వినియోగిస్తుంది. సుమారు 300 కిలోల బరువును సురక్షితంగా మోయగలదు. భద్రత కోసం ఆటోమేటిక్ స్టాప్ మెకానిజం కూడా ఏర్పాటు చేశారు. కరెంట్ పోయినా ఇబ్బంది లేకుండా 1400 VA ఇన్వర్టర్తో ఇది నడుస్తుంది. ఇప్పుడు సత్యవేణే కాదు, శివనారాయణ రెడ్డి, వారి పిల్లలు కూడా దీనినే వాడుతున్నారు.
{{/usCountry}}ఎలాగైనా భార్య బాధను దూరం చేయాలనే పట్టుదలతో కొన్ని నెలల పాటు రకరకాల టెక్నాలజీలను అధ్యయనం చేశారు శివనారాయణ. ఆ తర్వాత ఒక మోటార్, ఎలక్ట్రికల్ వైరింగ్, ఇతర సామాగ్రిని కొనుగోలు చేసి.. 1.5 హెచ్‌పి (HP) మోటార్‌తో నడిచే ఒక చిన్న ఎస్కలేటర్‌ను సిద్ధం చేశారు. ఇది చాలా తక్కువ విద్యుత్‌ను వినియోగిస్తుంది. సుమారు 300 కిలోల బరువును సురక్షితంగా మోయగలదు. భద్రత కోసం ఆటోమేటిక్ స్టాప్ మెకానిజం కూడా ఏర్పాటు చేశారు. కరెంట్ పోయినా ఇబ్బంది లేకుండా 1400 VA ఇన్వర్టర్తో ఇది నడుస్తుంది. ఇప్పుడు సత్యవేణే కాదు, శివనారాయణ రెడ్డి, వారి పిల్లలు కూడా దీనినే వాడుతున్నారు.
{{/usCountry}}ఈ అద్భుతమైన ఆవిష్కరణ గురించి తెలిసి చాలా మంది శివనారాయణ రెడ్డికి ఫోన్ చేసి అభినందిస్తున్నారు. దీని డిజైన్‌ను అడిగి తెలుసుకుంటున్నారు. మనకు పట్టుదల, ప్రాక్టికల్ నాలెడ్జ్, సమస్యను పరిష్కరించాలనే తపన ఉంటే.. సమాజానికి ఉపయోగపడే ఏదైనా సృష్టించవచ్చు అని ఆయన చెబుతారు.
కేవలం మెకానికల్ నైపుణ్యాలే కాకుండా.. శివనారాయణ రెడ్డికి సేవలోనూ మంచి పేరుంది. ఆ ప్రాంతంలోని పలు దేవాలయాల నిర్మాణానికి ఆయన ఆర్థిక సాయం చేశారు. ఆలయ ధ్వజస్తంభాలను ప్రతిష్టించడంలో ఆయన సిద్ధహస్తులు.