ఆర్టీసీ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం తీపికబురు - ఇకపై అలాంటి వారందరికీ ప్రత్యామ్నాయ ఉద్యోగాలు...!

మెడికల్ అన్‌ఫిట్‌ అయిన ఆర్టీసీ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వారికి ప్రత్యామ్నాయ ఉద్యోగాలు ఇవ్వాలని నిర్ణయించింది. ప్రభుత్వంలో సంస్థ విలీనం అనంతరం నుంచి ఈ చర్యలు చేపట్టాలని ఆదేశించింది.

Published on: Dec 26, 2025, 17:15:54 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

మెడికల్‌ అన్‌ఫిట్ అయిన ఆర్టీసీ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. అన్‌ఫిట్ అయిన ఉద్యోగులకు ప్రత్యామ్నాయ ఉద్యోగాలు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ నిర్ణయంతో… ఆర్టీసీ విలీనం తర్వాత (2020 జనవరి 1) మెడికల్ అన్‌ఫిట్ అయిన ఆర్టీసీ ఉద్యోగులకు లబ్ధి కలగనుంది.

ఏపీఎస్ఆర్టీసీ
ఏపీఎస్ఆర్టీసీ

ఇకపై వారికి కూడా ప్రత్యామ్నాయ ఉద్యోగాలు…

విలీనానికి ముందు మెడికల్ అన్‌ఫిట్ అయిన డ్రైవర్లకు మాత్రమే ప్రత్యామ్నాయ ఉద్యోగాలు ఉండేవి. ఇకపై డ్రైవర్లు, కండక్టర్లు సహా ఉద్యోగులందరికీ ప్రత్నామ్నాయ ఉద్యోగాలు ఇవ్వాలని తాజాగా ప్రభుత్వం నిర్ణయించింది.

కార్పొరేషన్‌లో ఉండగా 21 కేటగిరీల్లో మెడికల్ అన్‌ఫిట్ అయిన వారికి ప్రత్నామ్నాయ ఉద్యోగాలు కల్పించేవారు. విలీనం తర్వాతా 21 కేటగిరీల్లో మెడికల్ అన్‌ఫిట్‌ వారికి ప్రత్యామ్నాయ ఉద్యోగాలు దక్కుతాయి. మెడికల్ అన్‌ఫిట్ అయిన వారికి కండక్టర్, రికార్డు ట్రేసర్ ఉద్యోగాలు ఇవ్వాలని సర్కార్ నిర్ణయించింది. వీరికి అసిస్టెంట్ మెకానిక్ /శ్రామిక్ ఉద్యోగాలు దక్కనున్నాయి.

ఆర్టీసీలో ఇచ్చే ఉద్యోగానికి అర్హత లేకపోతే ప్రభుత్వ విభాగాల్లో అర్హత ప్రకారం ఉద్యోగాలు ఇస్తారు. కలెక్టర్ల ద్వారా ప్రభుత్వ విభాగాల్లో అర్హత మేరకు ప్రత్యామ్నాయ అవకాశాలను కల్పిస్తారు. ఏ ఉద్యోగానికీ అర్హత లేనివారికి అదనపు మానిటరీ ప్రయోజనాలు ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది.

మెడికల్ అన్‌ఫిట్ వల్ల వాలంటరీ రిటైర్డ్ అవ్వాలనుకునే వారికి అదనపు మానిటరీ ప్రయోజనాలు అందుతాయి. తాజా ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకోవాలని ఏపీ రవాణశాఖ కమిషనర్ కు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయగా.. తదుపరి చర్యలు తీసుకోవాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు సూచించింది.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More