...
...
Next Story

Veligonda Project : వెలిగొండ నిర్వాసితులకు ఊరట - అర్హులైన యువతకు రూ.169 కోట్ల ఎక్స్ గ్రేషియా! కటాఫ్ డేట్ దాటినప్పటికీ

Veligonda Project Relief Package : వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు ఏపీ ప్రభుత్వం ఊరటనిచ్చేలా మరో నిర్ణయం తీసుకుంది. కటాఫ్ తేదీ దాటినా 18 ఏళ్లు నిండిన అర్హులైన యువతకు రూ.169 కోట్ల ఎక్స్ గ్రేషియా చెల్లించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.

Published on: Aug 28, 2026, 13:29:30 IST
Advertisement

Veligonda Project Relief Package : పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితుల విషయంలో కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రాజెక్టు నిర్మాణంలో ఇళ్లు, ఆస్తులు, భూములు కోల్పోయిన ప్రతి కుటుంబానికి అండగా నిలవడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు. కటాఫ్ తేదీ ముగిసినప్పటికీ, అర్హత కలిగిన యువతకు ఎక్స్ గ్రేషియా అందించేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

వెలిగొండ ప్రాజెక్టు
వెలిగొండ ప్రాజెక్టు

గెజిట్ నోటిఫికేషన్, సోషియో ఎకనామిక్ సర్వేలలో పేర్లు నమోదు కాని అర్హులైన నిర్వాసితులందరికీ సంపూర్ణ న్యాయం చేయాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. సాధారణంగా ప్రాజెక్టు అవార్డు పాస్ కాని వారికి పరిహారం అందడం కష్టం, కానీ అలాంటి యువతకు కూడా ఆర్థిక సాయం అందేలా చూడాలని అధికారులకు మార్గదర్శనం చేశారు.

రూ.169 కోట్ల అదనపు సాయం

ముఖ్యమంత్రి ప్రతిపాదించిన మానవతా దృక్పథం ఆధారంగా కటాఫ్ తేదీ తర్వాత కూడా అర్హత పొందిన వారి కోసం ప్రత్యేకంగా రూ.169 కోట్ల ఎక్స్ గ్రేషియా నిధులను విడుదల చేయడానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఆధునిక దేవాలయాలైన ప్రాజెక్టుల కోసం త్యాగాలు చేసిన కుటుంబాలను ఆదుకోవడం తమ ప్రాథమిక బాధ్యత అని ప్రభుత్వం పేర్కొంది.

2019 కటాఫ్ తేదీ నుండి 2026 నాటికి 18 సంవత్సరాలు నిండిన యువతకు ఒక్కొక్కరికి రూ.2 లక్షల చొప్పున ఈ ఎక్స్ గ్రేషియా అందుతుంది. ఇదివరకే నిర్వాసితులకు అందించిన సాధారణ పరిహారానికి ఇది పూర్తి అదనం. గతంలో పొరపాట్ల వల్ల అవార్డు జాబితాలో నమోదు కాకుండా పోయిన నిర్వాసితులను క్షేత్రస్థాయిలో గుర్తించి, వారికి పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందించడానికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే 7,027 మంది నిర్వాసిత కుటుంబాలకు రూ.905 కోట్ల విలువైన పునరావాసప్యాకేజీని ప్రభుత్వం అందజేసింది. దీనికి తోడు నిర్వాసిత కుటుంబాల జీవన భద్రత కోసం నెల రోజులకు సరిపడా ఉచిత రేషన్ కిట్‌ను పంపిణీ చేయాలని కూడా నిర్ణయించారు.

“ఆగస్టు 31వ తేదీ నాటికి వెలిగొండ ప్రాజెక్టుకు నీటిని విడుదల చేయడమే కాకుండా, చివరి నిర్వాసితుడికి పరిహారం అందించి న్యాయం జరిగే వరకు ఈ ప్రక్రియను ఆపబోం. నిర్వాసితులకు ఎక్కడా అన్యాయం జరిగిందనే మాట రాకుండా పారదర్శకంగా వ్యవహరిస్తాం. నిర్వాసిత కాలనీల్లో డ్రైనేజీ, రహదారులు, తాగునీరు వంటి అన్ని మౌలిక సదుపాయాలను వేగవంతంగా పూర్తి చేస్తాం” అని మంత్రి స్పష్టం చేశారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe