ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేమండ్ గ్రూప్ ద్వారా రూ.940 కోట్ల విలువైన రెండు పెట్టుబడులకు ఆమోదం తెలిపింది. ఇవి ఏరోస్పేస్, ఆటోమోటివ్ కాంపోనెంట్స్ తయారీకి సంబంధించినవని అధికారులు ప్రకటించారు. రేమండ్ గ్రూప్ ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాలో రెండు గ్లోబల్ మాన్యుఫాక్చరింగ్ యూనిట్లను స్థాపిస్తుంది.

ఈ అనుమతులు రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధి విధానం 4.0 కింద వస్తాయి. ఈ ప్రాజెక్టుల ద్వారా 5,500 ప్రత్యక్ష ఉద్యోగాలను వస్తాయని భావిస్తున్నారు. 'ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ పాలసీ 4.0 (2024-29) కింద రేమండ్ గ్రూప్ నుండి రెండు ల్యాండ్‌మార్క్ పెట్టుబడులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.' అని ప్రభుత్వం తెలిపింది.
కొత్త ఏరోస్పేస్ పాలసీ కింద ఆంధ్రప్రదేశ్‌లో ఇది తొలి ఏరోస్పేస్ పెట్టుబడి అని, ప్రత్యేక ప్యాకేజీ ప్రాజెక్టు ప్రారంభాన్ని వేగవంతం చేస్తుందని ప్రకటన వెలువడింది. రేమండ్ గ్రూప్ అనుబంధ సంస్థ అయిన జెకె మైనీ గ్లోబల్ ఏరోస్పేస్ లిమిటెడ్ రూ. 510 కోట్ల పెట్టుబడితో అధునాతన ఏరోస్పేస్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. దీనితో 1,400 ప్రత్యక్ష ఉద్యోగాలను సృష్టిస్తుంది. గ్లోబల్ ఒరిజినల్ పరికరాల తయారీదారులు, టైర్-1 సరఫరాదారులకు ప్రెసిషన్ కాంపోనెంట్‌లను ఉత్పత్తి చేస్తుందని, ఆంధ్రప్రదేశ్‌ను గ్లోబల్ ఏరోస్పేస్ సరఫరా గొలుసులో అనుసంధానిస్తుందని అంచనా. వాణిజ్య ఉత్పత్తి మే 2027 నాటికి ప్రారంభం కానుంది.
అదేవిధంగా, రేమండ్ అనుబంధ సంస్థ జెకె మైనీ ప్రెసిషన్ టెక్నాలజీ లిమిటెడ్ గుడిపల్లిలో ఆటోమోటివ్ కాంపోనెంట్ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేస్తుంది, రూ. 430 కోట్లు పెట్టుబడి పెట్టి 4,096 ఉద్యోగాలను సృష్టిస్తుంది. మే 2027 నాటికి ఉత్పత్తిని ప్రారంభించాలని షెడ్యూల్ చేసిన ఈ ప్లాంట్.. భారతదేశం, విదేశాలలోని ప్రముఖ ఆటో కంపెనీలకు అవసరాలను తీరుస్తుంది. ప్రాంతీయ ఉపాధి, నైపుణ్య అభివృద్ధిని పెంచుతుంది.
ఈ ప్రాజెక్టులు అనంతపురంలో ఏర్పాటు చేయడంలో ఏపీ ప్రభుత్వ పారిశ్రామిక విధానాలు కీలక పాత్ర పోషించాయి. రేమండ్ గ్రూప్.. అనంతపురం నుంచి ప్రంపచానికి హైటెక్ భాగాలను పంపించనుంది. అనంతపురం ఏరోస్పేస్, ఆటోమోటివ్ హబ్‌గా తీర్చిదిద్దే శక్తివంతమైన అడుగుగా అనుకుంటున్నారు.
{{/usCountry}}ఈ ప్రాజెక్టులు అనంతపురంలో ఏర్పాటు చేయడంలో ఏపీ ప్రభుత్వ పారిశ్రామిక విధానాలు కీలక పాత్ర పోషించాయి. రేమండ్ గ్రూప్.. అనంతపురం నుంచి ప్రంపచానికి హైటెక్ భాగాలను పంపించనుంది. అనంతపురం ఏరోస్పేస్, ఆటోమోటివ్ హబ్‌గా తీర్చిదిద్దే శక్తివంతమైన అడుగుగా అనుకుంటున్నారు.
{{/usCountry}}