...
...
Next Story

AP Govt : రాయలసీమ లిఫ్ట్ పనులపై సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు- ఖండించిన ఏపీ ప్రభుత్వం

రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పనులు నిలిపివేయించానన్న తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలను ఏపీ సర్కార్ ఖండించింది. ఏపీ నీటి హక్కులు, సీమ సాగునీటి ప్రయోజనాల విషయంలో రాజీ ఉండబోదని స్పష్టం చేసింది.

Published on: Jan 4, 2026, 12:20:06 IST
Advertisement

రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులపై తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఏపీ ప్రభుత్వం ఖండించింది. చంద్రబాబుపై ఒత్తిడి తీసుకొచ్చి పనులు నిలిపివేయించానన్న వ్యాఖ్యలను కొట్టిపారేసింది. రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు అసంబద్ధమని స్పష్టం చేసింది. ఏపీ నీటి హక్కులు, రాయలసీమ సాగునీటి ప్రయోజనాల విషయంలో రాజీ ఉండబోదని క్లారిటీ ఇచ్చింది.

ఏపీ ప్రభుత్వం
ఏపీ ప్రభుత్వం

వైఎస్ఆర్ కాంగ్రెస్ హయంలో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పనులు చేపట్టారు. ఈ ప్రాజెక్ట్ పై నాటి నుంచే తెలంగాణ నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతూ వచ్చాయి. కేంద్రంతో పాటు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో కూడా తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదు చేసింది. దీనిపై విచారించిన ఎన్జీటీ… ఈ పనులను నిలిపివేయాలని ఆదేశాలు కూడా ఇచ్చింది.

ఇదే అంశంపై ఏపీ సర్కార్ ఓ ప్రకటన విడుదల చేసింది. రాయలసీమకు రోజుకు 3 టీఎంసీలంటూ ప్రకటనలతో నాటి వైఎస్ఆర్ ప్రభుత్వం పనులు చేపట్టిందని పేర్కొంది. ఈ లిఫ్ట్‌ పనులపై తెలంగాణ ప్రభుత్వం కోర్టులో కేసులు వేసింది. ఈ ఫిర్యాదులను విచారించిన తర్వాత అనుమతులు లేనందున పనులు నిలిపివేయాలని 2020లోనే ఎన్‌జీటీ, కేంద్రం ఆదేశాలు ఇచ్చింది. 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందే కేంద్రం పనులను నిలిపివేయించింది’’ అని ఏపీ వివరణ ఇచ్చింది.

మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ… కూటమి ప్రభుత్వాన్ని వైసీపీ ప్రశ్నిస్తోంది. రాష్ట్రాన్ని, రాయలసీమ ప్రాంతాన్ని చంద్రబాబు దారుణంగా దెబ్బతీశారని విమర్శిస్తోంది. రాయలసీమ ప్రాంతాన్ని ఎడారిచేసేందుకు, చంద్రబాబు చేసుకున్న రహస్య ఒప్పందం వెలుగులోకి వచ్చిందని చెబుతోంది. తన స్వార్థ ప్రయోజనాల కోసం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్‌ను చంద్రబాబు బలిపెట్టారని ఆరోపిస్తోంది. తాను కోరినందునే చంద్రబాబు నాయుడు రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ను ఆపేశారని తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కీలక విషయాలు చెప్పారని గుర్తు చేస్తోంది.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks