ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగాన్ని సరికొత్త ఎత్తులకు తీసుకెళ్లేందుకు విశాఖపట్నం వేదికగా 31వ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (CII) భాగస్వామ్య సదస్సు ఘనంగా ప్రారంభం అవుతోంది. ఈ అంతర్జాతీయ ఆర్థిక సదస్సు ద్వారా రాష్ట్రానికి రూ. 11 లక్షల కోట్ల భారీ పెట్టుబడులను ఆకర్షించడమే కాకుండా, దాదాపు 2.5 లక్షల కొత్త ఉద్యోగ అవకాశాలను సృష్టించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంచనా వేస్తోందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు వెల్లడించారు.

కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, సీఐఐ సంయుక్తంగా రెండు రోజుల పాటు నిర్వహిస్తున్న ఈ గ్లోబల్ సదస్సు కోసం సాగరతీర నగరం విశాఖపట్నం సర్వాంగ సుందరంగా సిద్ధమైంది. ఈ భారీ పారిశ్రామిక సదస్సుకు సంబంధించిన వివరాలను పల్లా శ్రీనివాసరావు వెల్లడించారు.
ఈ సదస్సులో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 58 దేశాలకు చెందిన పారిశ్రామికవేత్తలు, అంతర్జాతీయ ప్రతినిధులు, దౌత్యవేత్తలు, వివిధ రంగాల వ్యాపార దిగ్గజాలు పాల్గొంటున్నారు. ఈ వేదికపై వివిధ రంగాలకు చెందిన దాదాపు 3,800 అవగాహనా ఒప్పందాలు (MoUs) కుదరనున్నట్లు ప్రభుత్వం అంచనా వేస్తోంది. కేంద్రమంత్రి పియుష్ గోయల్ ఈ సదస్సులో పాల్గొంటారు.
'మారుతున్న కాలానికి అనుగుణంగా: సాంకేతికత, నమ్మకం, వాణిజ్యం - నూతన ప్రపంచ వ్యవస్థలో ముందంజ (Navigating Change: Technology, Trust and Trade – Leading the Way in a New World Order)' అనే ప్రధాన ఇతివృత్తంతో ఈ సదస్సు సాగనుంది.
ఈ అంతర్జాతీయ ఆర్థిక వేదికపై కేంద్ర ప్రభుత్వం నుంచి సైతం కీలక నేతలు పాల్గొంటున్నారు. నవంబర్ 12న జరిగే సదస్సు ప్రారంభోత్సవం తర్వాత పారిశ్రామిక చర్చలు, గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమావేశాలు జరుగుతాయి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పెట్టుబడులకు ప్రధాన గమ్యస్థానంగా మారడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజన్, స్పష్టమైన పాలనా దిశానిర్దేశం, ఆకర్షణీయమైన పారిశ్రామిక విధానాలే ప్రధాన కారణమని పల్లా శ్రీనివాసరావు పేర్కొన్నారు. విదేశీ, స్వదేశీ పెట్టుబడిదారులను ఆకర్షించేలా రాష్ట్ర ప్రభుత్వం టైలర్-మేడ్ ఇన్సెంటివ్లు, రాయితీలు, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ సౌకర్యాలను కల్పిస్తోంది.
{{/usCountry}}ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పెట్టుబడులకు ప్రధాన గమ్యస్థానంగా మారడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజన్, స్పష్టమైన పాలనా దిశానిర్దేశం, ఆకర్షణీయమైన పారిశ్రామిక విధానాలే ప్రధాన కారణమని పల్లా శ్రీనివాసరావు పేర్కొన్నారు. విదేశీ, స్వదేశీ పెట్టుబడిదారులను ఆకర్షించేలా రాష్ట్ర ప్రభుత్వం టైలర్-మేడ్ ఇన్సెంటివ్లు, రాయితీలు, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ సౌకర్యాలను కల్పిస్తోంది.
{{/usCountry}}విశాఖపట్నంలో డేటా సెంటర్ ఎకోసిస్టమ్ శరవేగంగా అభివృద్ధి చెందుతోందని, గూగుల్ వంటి అంతర్జాతీయ ఐటీ దిగ్గజాలు విశాఖలో తమ డేటా సెంటర్లను ఏర్పాటు చేయడానికి ముందుకు రావడం శుభపరిణామమని పల్లా శ్రీనివాసరావు వెల్లడించారు.
డేటా సెంటర్ల వల్ల విద్యుత్, నీటి వినియోగంపై వస్తున్న విమర్శలపై పల్లా స్పందిస్తూ.. ఏపీలో గ్రీన్ డేటా సెంటర్లు ప్రవేశపెడుతున్నామని స్పష్టం చేశారు. ఇవి తక్కువ విద్యుత్, పరిమితమైన నీటి వినియోగంతో పర్యావరణానికి హాని కలగకుండా పనిచేస్తాయని వివరించారు. విశాఖపట్నం వేదికగా జరుగుతున్న ఈ సీఐఐ సదస్సు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి మాత్రమే కాకుండా, దేశ ఆర్థిక రంగానికి కూడా భారీ స్థాయిలో ప్రయోజనం చేకూరుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.