రాబోయే 2027 గోదావరి పుష్కరాలను అత్యంత వైభవంగా, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుటి నుంచే పక్కా ప్రణాళికలతో సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా పుష్కర ఘాట్ల సమీపంలో ఉన్న 162 దేవాలయాలను పునరుద్ధరించాలని దేవాదాయ శాఖ నిర్ణయించింది.
మౌలిక వసతుల కల్పన

తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, గోదావరి పుష్కరాల ప్రత్యేక అధికారి రాహుల్ మీనాతో కలిసి కమిషనర్ రామచంద్రమోహన్ ప్రతిపాదిత మౌలిక సదుపాయాలు, ఆలయాల అభివృద్ధిపై సుదీర్ఘంగా చర్చించారు. పుష్కరాల కోసం వచ్చే కోట్లాది మంది భక్తులు ఘాట్లలో పవిత్ర స్నానాలు ఆచరించిన అనంతరం సమీపంలోని ఆలయాలను దర్శించుకుంటారని, అందుకే ఈ ప్రాంతాల్లో భక్తులకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
'గోదావరి ప్రాంతంలోని పుష్కర ఘాట్లకు సమీపంలో మొత్తం 543 దేవాలయాలను గుర్తించాం. వాటిలో అత్యంత ప్రాధాన్యత కలిగిన 162 ఆలయాలను మొదటి విడతలో ఆధునీకరించి, మరిన్ని అదనపు వసతులు కల్పించనున్నాం.' అని రామచంద్రమోహన్ పేర్కొన్నారు.
మార్చి 2027 నాటికి పనుల పూర్తి
ఈ 162 ఆలయాల పునరుద్ధరణ పనులకు ఇప్పటికే పరిపాలనాపరమైన అనుమతులు లభించాయి. రాబోయే ఏడాది మార్చి నాటికి ఈ పనులన్నింటినీ పూర్తి చేయాలనే లక్ష్యంతో అధికారులు పనిచేస్తున్నారు. ప్రస్తుతం వీటిలో 43 ఆలయాలకు సంబంధించిన పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయని కమిషనర్ తెలిపారు.
ట్రాఫిక్, క్రౌడ్ మేనేజ్మెంట్
పుష్కరాల సమయంలో భక్తుల రద్దీని నియంత్రించడం అతిపెద్ద సవాల్. ఈ నేపథ్యంలో రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్, దేవాదాయ శాఖ, రెవెన్యూ మరియు పోలీస్ విభాగాల మధ్య గట్టి సమన్వయం ఉండాలని కలెక్టర్ కీర్తి చేకూరి, ప్రత్యేక అధికారి రాహుల్ మీనా సూచించారు.
ఘాట్ల ఆధునీకరణలో భాగంగా ఘాట్ల వద్ద పారిశుధ్యం, తాగునీరు, మహిళలకు దుస్తులు మార్చుకునే గదుల ఏర్పాటు చేస్తున్నారు. వాహనాల పార్కింగ్, క్యూ లైన్ల నిర్వహణ కోసం ప్రత్యేక ప్రణాళికలు చేశారు. సీసీటీవీ నిఘా, అదనపు పోలీస్ బలగాల మోహరిస్తారు. పుష్కరాల నాటికి ఘాట్లు, ఆలయాల రూపురేఖలు మార్చి, భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని పంచడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది.
{{/usCountry}}ఘాట్ల ఆధునీకరణలో భాగంగా ఘాట్ల వద్ద పారిశుధ్యం, తాగునీరు, మహిళలకు దుస్తులు మార్చుకునే గదుల ఏర్పాటు చేస్తున్నారు. వాహనాల పార్కింగ్, క్యూ లైన్ల నిర్వహణ కోసం ప్రత్యేక ప్రణాళికలు చేశారు. సీసీటీవీ నిఘా, అదనపు పోలీస్ బలగాల మోహరిస్తారు. పుష్కరాల నాటికి ఘాట్లు, ఆలయాల రూపురేఖలు మార్చి, భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని పంచడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది.
{{/usCountry}}