...
...
Next Story

విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం బంపర్ ఆఫర్.. నీట్ హాల్ టికెట్ చూపిస్తే ఫ్రీ బస్సు సౌకర్యం!

నీట్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు ఏపీఎస్ఆర్టీసీ ఉచిత బస్సు సౌకర్యం కల్పించనుంది. విద్యార్థులు పరీక్షకు వెళ్లే సమయంలో హాల్ టికెట్ చూపించి ఫ్రీ బస్సును ఉపయోగించుకోవాలి.

Published on: Jun 16, 2026, 15:43:20 IST
Advertisement

రాబోయే జూన్ 21న దేశవ్యాప్తంగా అత్యంత ప్రతిష్టాత్మకమైన నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (NEET 2026) జరగనుంది. ఈ నేపథ్యంలో విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా, సకాలంలో తమ పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలనే ఉద్దేశంతో ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక కార్యాచరణను సిద్ధం చేసింది. పరీక్షకు వెళ్లే అభ్యర్థులు కండక్టర్‌కు తమ నీట్ హాల్ టికెట్ (NEET Hall Ticket) చూపిస్తే చాలు, రూపాయి ఖర్చు లేకుండా ఉచితంగా ప్రయాణించవచ్చని మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి స్పష్టం చేశారు.

ఏపీఎస్ఆర్టీసీ ఫ్రీ బస్సు
ఏపీఎస్ఆర్టీసీ ఫ్రీ బస్సు

విద్యార్థుల రద్దీకి అనుగుణంగా ఆర్టీసీ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారని రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. పరీక్షా కేంద్రాలు ఉన్న ప్రధాన నగరాలు, పట్టణాలకు వెళ్లే మార్గాల్లో ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంచాలన్నారు. విద్యార్థుల అవసరాల దృష్ట్యా ఎక్కడా రవాణా కొరత లేకుండా రాష్ట్రవ్యాప్తంగా డిమాండ్ ఉన్న రూట్లలో అదనపు ఆర్టీసీ సర్వీసులను నడపాలన్నారు.

పరీక్ష ప్రారంభ సమయానికి ముందే విద్యార్థులు సురక్షితంగా సెంటర్లకు చేరుకునేలా బస్సుల టైమింగ్స్ నిర్వహించాలని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు.

సాధారణంగా నీట్ వంటి జాతీయ స్థాయి పరీక్షల కోసం విద్యార్థులు తమ సొంత ఊర్ల నుండి సుదూర ప్రాంతాల్లో ఉన్న సెంటర్లకు ప్రయాణించాల్సి వస్తుంది. ఇలాంటి సమయంలో విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు కూడా తోడుగా వెళ్తుంటారు. ప్రయాణ ఖర్చులు పెరిగిపోతున్న తరుణంలో, ఏపీ ప్రభుత్వ ఉచిత బస్సు ప్రయాణ నిర్ణయం పేద, మధ్యతరగతి కుటుంబాలపై ఉన్న ఆర్థిక భారాన్ని గణనీయంగా తగ్గిస్తుందని మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి అభిప్రాయపడ్డారు.

ఎంతో కష్టపడి ఈ పరీక్షకు సిద్ధమైన విద్యార్థులందరికీ రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్‌రెడ్డి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు. కాబట్టి విద్యార్థులు జూన్ 21న జరిగే నీట్ పరీక్షకు వెళ్లే సమయంలో తమ హాల్ టికెట్లను చూపించి ఏపీఎస్‌ఆర్టీసీ ఉచిత ప్రయాణ సేవలను ఉపయోగించుకోవాల్సిందిగా అధికారులు కోరారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe