AP Mega DSC : మెగా డీఎస్సీలో ఏ చిన్న తప్పూ జరగలేదు - ఏపీ విద్యాశాఖ వివరణ

AP Education Department On DSC: మెగా డీఎస్సీ-2025 నిర్వహణలో ఎలాంటి పొరపాట్లూ జరగలేదని ఏపీ విద్యాశాఖ స్పష్టం చేసింది. రాజకీయ దురుద్దేశంతో జరుగుతున్న అవాస్తవ ప్రచారాలను నమ్మవద్దని…. నిబంధనల ప్రకారమే స్పోర్ట్స్ కోటాలో నియామకాలు జరిగాయని వివరించింది.

Published on: May 31, 2026, 07:07:09 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

AP Education Department On DSC: మెగా డీఎస్సీ-2025 నిర్వహణ అత్యంత పారదర్శకంగా జరిగిందని…. ఇందులో ఎలాంటి పొరపాట్లు లేదా తప్పిదాలకు తావులేదని ఏపీ విద్యాశాఖ స్పష్టం చేసింది. గతేడాది డీఎస్సీ ద్వారా ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులు ఎవరూ కూడా ఇలాంటి అవాస్తవ ప్రచారాలు చూసి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపింది. ఉద్దేశ్యపూర్వకంగా తప్పుడు ప్రచారం చేసిన వారిపై కేసులు పెడతామని తేల్చి చెప్పింది.

ఏపీ మెగా డీఎస్సీ
ఏపీ మెగా డీఎస్సీ

గత కొన్ని రోజులుగా మెగా డీఎస్సీ-2025 నిర్వహణ, ఉద్యోగాల నియామకంపై జరుగుతున్న ప్రచారాలపై విద్యాశాఖ కార్యదర్శి శనివారం విజయవాడలోని విద్యా భవన్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మెగా డీఎస్సీ 2025 నిర్వహణ ప్రక్రియను వివరిస్తూ ప్రజెంటేషన్ ఇచ్చారు. మెగా డీఎస్సీ-2025ను అత్యంత పారదర్శకంగా నిర్వహించామని… అభ్యర్థులు కష్టపడి చదవి ఉద్యోగాలు పొందారని వివరించారు.

"2018 తర్వాత మళ్లీ 2025లోనే మేము మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చాం. ఈ రిక్రూట్‌మెంట్‌ను అడ్డుకోవడానికి, సవాల్ చేస్తూ కోర్టుల్లో ఏకంగా 241 కేసులు వేశారు. వాటన్నింటినీ చట్టపరంగా ఎదుర్కొని, ప్రభుత్వ పక్షాన బలమైన వాదనలు వినిపించాం. న్యాయస్థానాల అనుమతితో కేవలం 148 రోజుల్లోనే ఈ భారీ ప్రక్రియను పూర్తి చేసి రికార్డు సృష్టించాం," అని కోన శశిధర్ తెలిపారు.

“154 టీసీఎస్ ఐయాన్ సెంటర్లల్లో ఈ డీఎస్సీ పరీక్షను నిర్వహించాం. ఒకే సబ్జెక్టుకు వివిధ తేదీల్లో పరీక్షలు నిర్వహించాం.. కాబట్టి వేర్వేరు పేపర్లే ఉంటాయి. ఒక్కో సబ్జెక్టుకు సుమారు 3 వేల క్వశ్చన్లతో క్వశ్చన్ బ్యాంకు రూపొందించాం. పర్మినెంట్ ఉద్యోగులైన ఇద్దరికి మాత్రమే క్వశ్చన్ బ్యాంకుకు యాక్సెస్ ఉంటుంది. ప్రతి రోజూ పాస్ వర్డ్స్ మారుతూ ఉంటాయి. ఎస్‌ఎస్‌సీ, ఆర్ఆర్‌బీ, ఐబీపీఎస్, గేట్, ఎన్టీఏ, సీఏటీ, ఏపీపీఎస్సీ, హైకోర్ట్ పరీక్షలు వంటివి నిర్వహించిన టీసీఎస్ ఐయాన్‌కే ఈ బాధ్యతలు అప్పగించాం. ఇది మాన్యువల్ ఎగ్జామ్ కాదు.. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్-CBT పద్దతిలో మెగా డీఎస్సీ నిర్వహించాం" అని కోన శశిధర్ పేర్కొన్నారు.

స్కోర్స్ పబ్లిష్ చేశాం…

అన్ని జిల్లాల స్కోర్స్ వెబ్ సైట్లల్లో పబ్లిష్ చేశామని ఆయన తెలిపారు. టెట్, డీఎస్సీ సోర్స్ కూడా వెబ్ సైట్లల్లో పబ్లిష్ చేశామని… ఇప్పటికీ అవి ఉన్నాయన్నారు. స్కోర్స్ ఇవ్వలేదని చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని కొట్టి పారేశారు.

“సర్టిఫికేట్ వెరిఫికేషన్‌లో భాగంగా ముందుగా ఆన్ లైన్లో అప్లోడ్ చేయాలని నిబంధన పెట్టాం.. అయితే వెరిఫికెషన్ కు వచ్చినప్పుడు సర్టిఫికెట్లు తెస్తామని రిక్వెస్ట్ చేయడంతో ప్రభుత్వం అంగీకరించింది. గతానుభవాల దృష్ట్యా వెయిటింగ్ లిస్టు కాకుండా.. 1:1 పద్దతిలో పిలిచాం. దీన్ని ఆనాడే అందరికీ చెప్పాం. వెరిఫికేషన్లో ఎవరైనా ఫెయిల్ అయితే ఆ తర్వాత వారిని వెరిఫికేషన్‌కు పిలిచాం" అని వెల్లడించారు.

"హారిజంటల్ రిజర్వేషన్లలో స్పోర్ట్స్, మహిళ, దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్ మెన్ కోటాలు ఉంటాయి. ఇలాంటి జాగ్రత్తలు తీసుకున్నాం కాబట్టే కోర్టులు డీఎస్సీ-2025 నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. ప్రస్తుతం పేపర్లల్లో వస్తోన్న కథనాలన్నీ హారిజాంటల్ రిజర్వేషన్లకు సంబంధించినవే. ప్రతి ఫిర్యాదును పరిశీలించాం....సమాధానాలిచ్చాం. ఎవరికైనా అనుమాలు ఉంటే.. వారికున్న అనుమానాలను నివృత్తి చేశాం. సంవత్సరం అయిన తర్వాత ఇప్పుడు ఆరోపణలు చేయడం ఆశ్చర్యంగా ఉంది” అని విద్యా శాఖ కార్యదర్శి వ్యాఖ్యానించారు.

“నవీన్ అనే అభ్యర్థి ఎస్సీఈఆర్టీ ఔట్ సోర్సింగ్ ఉద్యోగి. రెండు పరీక్షలు రాశారు.. ఓ దాంట్లో 1వ ర్యాంక్, రెండో దాంట్లో 6వ ర్యాంక్ వచ్చింది. అతను సెలెక్షన్ లిస్టులో ఉన్నారు.. కానీ వెరిఫికేషన్ కోసం రాలేదు. దీంతో నిబంధన ప్రకారం అతణ్ని రిక్రూట్మెంట్ చేయలేకపోయాం. ఆ తర్వాత నవీన్ కోర్టుకు వెళ్లాడు... కోర్టుల్లో మేమూ మా వాదనలు వినిపించాం. కోర్టు మా వాదనను బలపరిచింది. నవీన్ కేసులో కోర్టులు చెప్పినట్టే నడుచుకున్నాం. అతను వెరిఫికేషన్ ప్రక్రియకు ఎందుకు రాలేదో అతనికే తెలియాలి" అని కోన శశిధర్ తెలిపారు.

“లక్షల మంది అభ్యర్థులు పరీక్షలు రాస్తే ఒక్కరు కూడా ఫిర్యాదు చేయలేదు... తప్పు పట్టలేదు. హారిజంటల్ రిజర్వేషన్లను కొందరు అర్థం చేసుకోలేకపోయారు. ప్రస్తుతం పేపర్లల్లో వస్తున్న వార్తలు అవాస్తమని చెబుతున్నాను... ఆధారాలతో సహా వచ్చాను. స్పోర్ట్స్ కోటాలో కూడా ఎలాంటి తప్పులు జరగలేదు. స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు దక్కించుకున్న వారు కూడా కష్టపడి ఉద్యోగాన్ని సాధించారు” అని శశిధర్ చెప్పారు.

త్వరలో మరో డీఎస్సీ - కోన శశిధర్

డీఎస్సీ నిర్వహణపై అవాస్తవాలు చెప్పొద్దని కోన శశిధర్ విజ్ఞప్తి చేశారు. “ఏమైనా చెప్పాలనుకుంటే నిజాలు చెప్పండి. జరుగుతున్న అవాస్తవ ప్రచారంతో కష్టపడి చదివి టీచర్ ఉద్యోగాలు దక్కించుకున్న వారందరూ బాధపడతారు. టీచర్లెవ్వరూ బాధపడొద్దని కోరుతున్నాను. శాఖాపరంగా తప్పు ఏదైనా ఉంటే చెప్పండి.. నేర్చుకోవడానికి మేం సిద్దంగా ఉన్నాం. త్వరలో మరో డీఎస్సీని కూడా నిర్వహిస్తాం. దానికీ ఏర్పాట్లు జరుగుతున్నాయి” అని వివరించారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More