ఏపీ మెగా డీఎస్సీ 2025 పేపర్ లీక్ అయిందా? పెద్ద స్కాం జరిగిందా?
ఆంధ్రప్రదేశ్ మెగా డీఎస్సీ 2025పై వైసీపీ అధినేత జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ మెగా డీఎస్సీ పేపర్ లీక్ అయిందని ఆరోపణలు చేశారు. పెద్ద స్కాం జరిగిందని విమర్శలు గుప్పించారు.
ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ ఇటీవల నిర్వహించిన మెగా డీఎస్సీ-2025 నియామక ప్రక్రియపై సోషల్ మీడియా వేదికగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. అంతేకాదు కొందరు దీనిని సోషల్ మీడియాలో వైరల్ చేశారు. దీనిపై ప్రభుత్వం స్పందించింది. ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని పేర్కొంది.

వ్యవస్థపై ప్రజలకు ఉన్న విశ్వాసాన్ని దెబ్బతీసేందుకు ఉద్దేశపూర్వకంగా చేస్తున్న తప్పుడు ప్రచారాలు ఇవి అని ప్రభుత్వం ఆరోపించింది. మెగా డీఎస్సీ పరీక్షలను అత్యంత పారదర్శకమైన కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) పద్ధతిలో, అత్యున్నత స్థాయి డిజిటల్ భద్రతా ప్రమాణాలతో నిర్వహించామని తెలిపింది. మల్టీ-సెషన్ పద్ధతిలో వేర్వేరు ప్రశ్నపత్రాలతో నిర్వహించిన ఈ పరీక్షలలో ప్రశ్నాపత్రం లీకేజ్ అవ్వడం సాంకేతికంగా అసాధ్యమని స్పష్టం చేసింది. దీనిపై ఇప్పటి వరకు ఎటువంటి ఫిర్యాదులు కూడా అందలేదని తెలిపింది.
ఇక పి. నవీన్ అనర్హత అంశానికి సంబంధించి, నిబంధనల ప్రకారం ముందస్తు అనుమతి లేకుండా పరీక్ష రాయడం, సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కు గైర్హాజరు కావడంతో రూల్ 20(vi) ప్రకారం ఆయన అభ్యర్థిత్వం రద్దు చేయబడిందని విద్యా శాఖ స్పష్టం చేసింది.
ఈ నిర్ణయంపై ఆయన కోర్టును ఆశ్రయించగా, హైకోర్టు ఉత్తర్వుల మేరకు గ్రీవెన్స్ రెడ్రెస్సల్ కమిటీ, రాష్ట్ర స్థాయి అప్పీల్ కమిటీలు నిబంధనల ప్రకారం విచారణ జరిపి కేసును పరిష్కరించామని ప్రభుత్వం వివరించింది. మెగా డీఎస్సీ-2025 నోటిఫికేషన్ విడుదలైన కేవలం 148 రోజుల్లోనే ఉపాధ్యాయుల నియామక ప్రక్రియను రికార్డు స్థాయిలో పూర్తి చేశారు. పరీక్షలు ముగిసిన తర్వాత 22.08.2025న అభ్యర్థుల పూర్తి వివరాలు, మార్కులు, ర్యాంకులతో కూడిన అధికారిక మెరిట్ జాబితాలను పారదర్శకంగా వెబ్‌సైట్‌లో విడుదల చేసిన తర్వాతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించారని ప్రభుత్వం చెబుతోంది.
ఎటువంటి డేటా డిలీట్ కాలేదని, డిజిటల్ రికార్డులన్నీ మల్టీ-లెవెల్ వెరిఫికేషన్ సిస్టమ్స్ ద్వారా భద్రంగా ఉన్నాయని ప్రభుత్వం వెల్లడించింది. రిజర్వేషన్లు, ఎంపికలు పూర్తిగా నిబంధనల ప్రకారమే జరిగాయని, ముఖ్యంగా మహిళలు, దివ్యాంగులు, ఇతర కోటాలకు 'హారిజాంటల్ రిజర్వేషన్' అమలు చేయడం వల్ల వారు రోస్టర్ పాయింట్ల ప్రకారం ఎంపికయ్యారని వివరణ ఇచ్చింది. అభ్యర్థులు దరఖాస్తు సమయంలో స్వయంగా ఇచ్చిన 'పోస్ట్ ప్రిఫరెన్స్' ఆధారంగానే ఆటోమేటెడ్ కంప్యూటర్ వ్యవస్థ ద్వారా పోస్టుల కేటాయింపు జరిగిందని, ఇందులో ఎటువంటి నిబంధనల ఉల్లంఘన జరగలేదని ప్రభుత్వం స్పష్టం చేసింది.
కన్వీనర్ నియామకం కూడా ప్రభుత్వ ఉత్తర్వులకు మరియు సేవా నిబంధనలకు అనుగుణంగానే అత్యంత పారదర్శకంగా, చట్టబద్ధంగా జరిగిందని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ పేర్కొన్నారు. ఇంత పకడ్బందీగా జరిగిన మెగా డీఎస్సీ-2025 పై తప్పుడు కథనాలు ప్రచారం చేయడం సబబు కాదని ప్రభుత్వం చెప్పింది. ఈ మేరకు ఫ్యాక్ట్ చెక్ ఏపీ ప్రభుత్వ ఎక్స్ అకౌంట్‌లో పోస్ట్ చేసింది.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


