AP Thalliki Vandanam : ఇవాళే 'తల్లికి వందనం' స్కీమ్ నిధులు విడుదల - అకౌంట్లోకి రూ. 13 వేలు, స్టేటస్ ఇలా చెక్ చేసుకోవచ్చు

AP Thalliki Vandanam Scheme : రాష్ట్రంలోని అర్హులైన పాఠశాల, ఇంటర్ విద్యార్థుల తల్లుల ఖాతాల్లో 'తల్లికి వందనం' నిధులను ప్రభుత్వం జమ చేయనుంది. ఎంతమంది పిల్లలున్నా అందరికీ ఈ లబ్ధి వర్తిస్తుంది. నేటి నుంచి నిధులు ఖాతాల్లోకి జమవుతాయి.

Published on: Jul 22, 2026, 07:25:28 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

AP Thalliki Vandanam Scheme : ఆంధ్రప్రదేశ్‌లోని విద్యార్థుల తల్లులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. రాష్ట్రంలోని అర్హులైన పాఠశాల, ఇంటర్మీడియట్ విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాల్లోకి ఇవాళ్టి నుంచి 'తల్లికి వందనం' పథకం నిధులను సర్కార్ జమ చేయనుంది. కుటుంబంలో ఎంతమంది పిల్లలు చదువుకుంటున్నా… వారందరికీ ఈ పథకం ద్వారా ఆర్థిక సహాయాన్ని అందించనుంది.

'తల్లికి వందనం' స్కీమ్
'తల్లికి వందనం' స్కీమ్

2026-27 విద్యా సంవత్సరానికి గానూ ఈ పథకం కింద ప్రభుత్వం భారీగా నిధులను కేటాయించింది. మొత్తం రూ.10,120.78 కోట్ల ఆర్థిక సాయాన్ని అందించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 67,47,190 మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుండగా, వారికి సంబంధించిన 42,70,802 మంది తల్లులు లేదా సంరక్షకులు ఈ పథకం పరిధిలోకి వస్తున్నారు.

వీరిలో ఇప్పటికే క్షేత్రస్థాయి పరిశీలన పూర్తయిన 64,76,590 మంది విద్యార్థులకు సంబంధించిన 41,07,502 మంది తల్లుల ఖాతాల్లో ఇవాళ నేరుగా నగదు జమ చేయనున్నారు. నిబంధనల ప్రకారం అర్హులైన ఒక్కో విద్యార్థికి కేటాయించిన రూ.15,000 లబ్ధి నుంచి రూ.2,000 మినహాయించి… మిగతా రూ.13,000ల మొత్తం నిధులను తల్లుల ఖాతాల్లో జమ చేస్తారు.

'తల్లికి వందనం' పథకానికి సంబంధించి మీ అర్హత వివరాలను సులువుగా తెలుసుకునేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. మనమిత్ర వాట్సప్ సేవలు లేదా లీప్ (LEAP) యాప్ ద్వారా మీ వివరాలను క్షణాల్లో పరిశీలించుకోవచ్చు.

ఆన్‌లైన్‌లో స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి?

లబ్ధిదారులు ఇంట్లోనే ఉండి తమ అప్లికేషన్ స్టేటస్‌ను సులభంగా తెలుసుకోవడానికి ఈ క్రింది విధానాన్ని అనుసరించండి:

  • ముందుగా అధికారిక పోర్టల్ https://bm-sgsw.ap.gov.in/BM/Schemeout ని సందర్శించాలి.
  • హోమ్ పేజీలో ఆధార్ నంబర్, స్కీమ్ టైప్ (తల్లికి వందనం), విద్యా సంవత్సరం ఆప్షన్లు కనిపిస్తాయి.
  • అక్కడ విద్యార్థి యొక్క ఆధార్ కార్డు నంబర్‌ను స్పష్టంగా నమోదు చేయాలి.
  • ఆ తర్వాత సంవత్సరం కాలమ్‌లో 2026-27 ఎంచుకోవాలి.
  • పక్కనే ఉండే 'గెట్ డిటైల్స్' (Get Details) ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
  • మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వచ్చే ఓటీపీ (OTP) ని స్క్రీన్‌పై నమోదు చేయాలి.
  • చివరగా కనిపిస్తున్న క్యాప్చా కోడ్‌ను ఎంటర్ చేయగానే, మీ పథకం దరఖాస్తు స్టేటస్ స్క్రీన్‌పై డిస్ ప్లే అవుతుంది.

తల్లికి వందనం పథకం నిధుల పంపిణీ వేళ సైబర్ నేరగాళ్లు అమాయకులను బురిడీ కొట్టించేందుకు ప్లాన్ చేస్తున్నారని… వారి నకిలీ లింకుల పట్ల లబ్ధిదారులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు.మొబైల్ ఫోన్లకు వచ్చే అనుమానాస్పద ఫేక్ మెసేజ్‌లను ఎంతమాత్రం నమ్మవద్దని స్పష్టం చేశారు. అటువంటి లింకులపై క్లిక్ చేస్తే ఫోన్ హ్యాక్ అయి, బ్యాంక్ అకౌంట్లలో ఉన్న సొమ్ము మొత్తం సైబర్ దొంగల పాలయ్యే ప్రమాదం ఉం‌దన్నారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More