AP Gurukul Results 2026 : ఏపీ గురుకుల ప్రవేశాల ఫలితాలు విడుదల - కౌన్సెలింగ్ అప్డేట్స్ ఇవే

AP Gurukul Results 2026 : ఏపీ గురుకుల విద్యాసంస్థల్లో 2026-27 విద్యా సంవత్సరానికి నిర్వహించిన ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. కౌన్సెలింగ్ షెడ్యూల్, టాపర్ల జాబితా పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి….

Published on: May 13, 2026, 05:12:46 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గురుకుల విద్యాసంస్థల్లో ప్రవేశాల కోసం వేచి చూస్తున్న విద్యార్థులకు కీలక అప్‌డేట్ వచ్చేసింది. 2026-27 విద్యా సంవత్సరానికి గాను నిర్వహించిన APRS CAT, APR JC. DC CET పరీక్షల ఫలితాలను ఏపీ గురుకుల విద్యాసంస్థల సంస్థ (APREIS) కార్యదర్శి ఎ. కృష్ణమోహన్ మంగళవారం అధికారికంగా విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గురుకుల పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఈ పరీక్షల్లో విద్యార్థులు తమ ప్రతిభను చాటారు.

ఏపీ గురుకుల ఫలితాలు విడుదల (image source istock)
ఏపీ గురుకుల ఫలితాలు విడుదల (image source istock)

ఫలితాలు ఇలా!

ఈ ఏడాది గురుకులాల్లో మొత్తం 7,569 సీట్లు అందుబాటులో ఉండగా… ఏకంగా 76,376 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 66,300 మంది పరీక్షకు హాజరయ్యారు. ఏప్రిల్ 24న రాష్ట్రవ్యాప్తంగా ప్రశాంతంగా జరిగిన ఈ పరీక్షల ఫలితాల్లో జిల్లాల వారీగా విద్యార్థులు సత్తా చాటారు.

ఐదో తరగతి ప్రవేశాలకు నిర్వహించిన APRS CAT లో శ్రీ సత్యసాయి జిల్లాకు చెందిన హెచ్. వర్షిత్ (96/100), విజయనగరం జిల్లాకు చెందిన ఆకాష్ రెడ్డి (97/100), శ్రీకాకుళం జిల్లాకు చెందిన మోక్షిత్ (90/100), ఎన్టీఆర్ జిల్లాకు చెందిన కొర్లపాటి రక్షిత (96/100) అత్యుత్తమ మార్కులు సాధించారు.

APRJC CET (ఇంటర్మీడియట్):

  • ఎంపీసీ: కొత్తకోట మహాలక్ష్మి (విజయనగరం జిల్లా) - 144/150
  • బైపీసీ: తోలేటి బెర్నిస్ దియా (తూర్పు గోదావరి) - 145/150
  • ఎంఈసీ: నందమూరి సాయి శశాంక్ (తూర్పు గోదావరి) - 143/150
  • సీఈసీ: నందుపిల్లి లాస్య ప్రియ (తూర్పు గోదావరి) - 141/150

APRDC CET (డిగ్రీ):

  • బీఏ: కొర్ర రాజేష్ (పార్వతీపురం మన్యం) - 101/150
  • బీకామ్: మండల్ల అర్జునరెడ్డి (పల్నాడు) - 127/150
  • బీఎస్సీ: చిప్పాడ వరుణ్ సాయి తేజ (కోనసీమ) - 112/150

ఫలితాలు ఎలా చూసుకోవాలి?

అభ్యర్థులు తమ రిజల్ట్స్ కోసం అధికారిక వెబ్‌సైట్ https://aprs.apcfss.in ను సందర్శించాలి. అక్కడ తమ క్యాండిడేట్ ఐడీని ఎంటర్ చేసి ఫలితాలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

ఎంపికైన విద్యార్థుల మెరిట్ జాబితా, కౌన్సెలింగ్ వివరాలను ఇవాళ (మే 13) ఆయా పాఠశాలలకు పంపిస్తారు. జూనియర్, డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు సంబంధించి కౌన్సెలింగ్ నిర్వహించే తేదీలు, వేదికల వివరాలను కూడా ఇవాళే వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతారు.

రాష్ట్రంలోని 10 జూనియర్ కళాశాలల్లో ఇంటర్మీడియట్ విద్యతో పాటు IIT-JEE, నీట్, సీఏ/CMA వంటి జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు ఉచిత కోచింగ్ ఇస్తారు. అనుభవజ్ఞులైన అధ్యాపకులతో ఎన్డీఏ, సీడీఎస్, ఆర్ఆర్ బీ వంటి పరీక్షలకు కూడా ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్లు కృష్ణమోహన్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. గ్రామీణ విద్యార్థులకు ఇది గొప్ప అవకాశమని ఆయన వివరించారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More