...
...
Next Story

AP Weather Updates : ఏపీలో భానుడి భగభగలు - మరోవైపు వర్షాలు, పిడుగుల హెచ్చరిక

AP Weather Updates : ఏపీలో భిన్న వాాతావరణ పరిస్థితులున్నాయి. ఓవైపు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా… మరోవైపు పలు జిల్లాల్లో వర్షాలు పడే సూచనలున్నాయి.

Published on: May 1, 2026, 10:03:42 IST
Advertisement

AP Weather Alert : ఆంధ్రప్రదేశ్ లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఒకవైపు భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తూ నిప్పుల వర్షం కురిపిస్తుంటే, మరోవైపు అకాల వర్షాలు, పిడుగుల ముప్పు పొంచి ఉంది. ఈ రెండు రోజుల పాటు ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఓ ప్రకటన ద్వారా హెచ్చరించింది.

ఏపీలో భిన్న వాతావరణం
ఏపీలో భిన్న వాతావరణం

వేసవి సీజన్‌లోనే అత్యధిక ఉష్ణోగ్రత నెల్లూరు జిల్లా గూడూరులో నమోదైంది. గురువారం ఇక్కడ ఉష్ణోగ్రత 45.8 డిగ్రీల మార్కును తాకింది. రాష్ట్రవ్యాప్తంగా ఎండల తీవ్రత ఏ స్థాయిలో ఉందంటే.. దాదాపు 216 మండలాల్లో 41 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. మండుతున్న ఎండలకు తోడు ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు.

ఇవాళ రాష్ట్రంలోని 9 మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉంది. ఇందులో పార్వతీపురం మన్యం, పోలవరం జిల్లాలున్నాయి. మరికొన్ని జిల్లాల్లో వడగాలులు వీచే సూచనలున్నాయి.

ద్రోణి ప్రభావం…పిడుగులతో కూడిన వర్షాలు

ఎండలు ఒకవైపు దంచికొడుతుంటే… వాతావరణంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.

శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, నెల్లూరు, అనంతపురం, చిత్తూరు, తిరుపతి జిల్లాలకు వర్ష సూచన ఉంది. కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది.

ఎండలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో….. వృద్ధులు, గర్భిణీలు, చిన్న పిల్లలు మధ్యాహ్నం వేళ బయటకు రాకూడదని అధికారులు సూచిస్తున్నారు. ఎండ తీవ్రత దృష్ట్యా ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని… శరీరం డీహైడ్రేషన్ కు గురికాకుండా చూసుకోవాలని కోరారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks