...
...
Next Story

పొగాకు కంపెనీల ఆఫర్లకు దూరంగా ఉండండి..! ఏపీ వైద్యారోగ్య శాఖ కీలక సూచనలు

పొగాకు కంపెనీల విషయంలో ఏపీ వైద్యారోగ్యశాఖ కీలక సూచనలు చేసింది. పొగాకు కంపెనీల ఆఫర్లకు ప్రభుత్వ విభాగాలు దూరంగా ఉండాలని స్పష్టం చేసింది. సదరు సంస్థ భాగస్వామ్యంతో క్రీడలు కానీ, సాంస్కృతిక, ఇతర ఎటువంటి కార్యకలాపాలను నిర్వహించొద్దని పేర్కొంది. కేంద్రం మార్గదర్శకాల మేరకు ఈ నిర్ణయం తీసుకుంది.

Published on: Oct 16, 2025, 15:29:26 IST
Advertisement

పొగాకు ఉత్పత్తిదారులు, కంపెనీల చిహ్నాలు, ప్రచారం ప్రభుత్వ శాఖల్లో లేకుండా చూడాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కోరింది. సదరు సంస్థ భాగస్వామ్యంతో క్రీడలు కానీ, సాంస్కృతిక, ఇతర ఎటువంటి కార్యకలాపాలను నిర్వహించొద్దని స్పష్టం చేసింది.

కేంద్రం నుంచి మార్గదర్శకాలు…

పొగాకు కంపెనీల ఆఫర్లకు దూరంగా ఉండాలి -  వైద్యారోగ్య శాఖ పిలుపు
పొగాకు కంపెనీల ఆఫర్లకు దూరంగా ఉండాలి - వైద్యారోగ్య శాఖ పిలుపు

పొగాకు వాడకం తగ్గింపు చర్యల్లో భాగంగా పొగాకు ఉత్పత్తిదారులు, కంపెనీలతో స్పాన్సర్ షిప్, ఒప్పందాలు చేసుకోకూడదని, ఇతర నియంత్రణ చర్యలు పాటించాలని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఇటీవలే ప్రత్యేకంగా మార్గదర్శకాలు జారీచేసింది. వీటిపై ప్రభుత్వ శాఖల అధికారులకు అవగాహన కల్పించే నిమిత్తం విజయవాడలో బుధవారం రాష్ట్ర వైద్యారోగ్యశాఖ ప్రత్యేకమైన వర్క్ షాప్ ను నిర్వహించింది.

ఈ వర్క్ షాప్ నకు పోలీసు, పంచాయతీ రాజ్, పర్యాటక, మహిళా శిశు, గిరిజన సంక్షేమ శాఖ, పాఠశాల, ఇంటర్, కళాశాల, సాంకేతిక విద్య శాఖలకు చెందిన అధికారులు హాజరయ్యారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ ఓ) రూపొందించిన ఎఫ్ సీటీసీ (ఫ్రేమ్ వర్క్ కన్వెన్షన్ అన్ టూబాకో కంట్రోల్) ఆర్టికల్ 5.3 అమలు గురించిపై చర్చించారు. ఈ కార్యశాలలో కేంద్ర ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్న వైటల్ స్ట్రాటజీస్ సంస్థ ముఖ్య ప్రతినిధులు డాక్టర్ అమిత్ యాద‌వ్‌, డాక్టర్ శివంకపూర్ మాట్లాడారు.

" ప్రజారోగ్యంపై పొగాకు పరిశ్రమల ప్రభావం ప్రపంచ స్థాయిలో భారత్ 43వ స్థానంలో ఉంది. పొగాకు వాడకంవల్ల 1.3 మిలియన్ల ప్రజలు మరణిస్తున్నారు. పొగాకు వాడకంతో ఓరల్ క్యాన్సర్, ఊపిరితిత్తులు, ఇతర అనారోగ్య సమస్యలు తీవ్రమవుతున్నాయి. దేశ జనాభాలో 28% మంది పొగాకును ఏదోరకంగా వాడుతున్నారు. ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్న పొగాకు నియంత్రణ చర్యల్లో భాగంగా సదరు కంపెనీల ప్రచారాన్ని నిరోధించేందుకు కేంద్ర ప్రభుత్వం వివిధ రకాల చర్యలు తీసుకుంటుంది. డబ్ల్యూహెచ్ రూపొందించిన ఆర్టికల్-5.3 అమలు దేశంలోని 25 రాష్ట్రాల్లో అమలవుతుంది. ఇదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లోని ప్రభుత్వ శాఖలు కూడా చర్యలు తీసుకోవాలి' అని వారు వివరించారు. వ‌ర్చువ‌ల్ లో డబ్ల్యూహెచ్ ఓ ప్ర‌తినిధి ప్రవీణ్ సిన్హా కూడా కార్యశాలను ఉద్దేశించి ప్రసంగించారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe