...
...
Next Story

ఆంధ్రప్రదేశ్ గ్రూప్-2 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట.. త్వరలో తుది ఫలితాలు విడుదల!

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు గ్రూప్-2 అభ్యర్థులకు ఊరట కల్పించింది. రిజర్వేషన్ పాయింట్లను సవాలు చేస్తూ.. పలువురు అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది.

Published on: Dec 30, 2025, 15:29:56 IST
Advertisement

ఆంధ్రప్రదేశ్ గ్రూప్-2 అభ్యర్థులకు సంబంధించి ఒక ముఖ్యమైన పరిణామం జరిగింది. 2023 గ్రూప్-2 నోటిఫికేషన్‌లో పేర్కొన్న రిజర్వేషన్ విధానాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. ప్రభుత్వ రిజర్వేషన్ ఫ్రేమ్‌వర్క్‌ను రద్దు చేస్తూ, సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటించాలని కోరుతూ అనేక మంది అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు.

ఏపీ హైకోర్టు
ఏపీ హైకోర్టు

ప్రస్తుతం గ్రూప్-2 నోటిఫికేషన్‌ను రద్దు చేయాలని, సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా రిజర్వేషన్ రోస్టర్ పాటించాలని, కొత్త నోటిఫికేషన్ జారీ చేయాలని పిటిషనర్లు కోరారు. అయితే జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పిటిషన్లను తిరస్కరించింది. పాత నోటిఫికేషన్ రద్దు చేసి కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలన్న పిటిషనర్ల వాదనలను పక్కన పెట్టింది. దీనితో గ్రూప్ 2 అభ్యర్థులకు ఉపశమనం లభించింది.

ఏపీపీఎస్సీ 905 గ్రూప్ 2 ఉద్యోగాలకు ఈ ఏడాది ఫిబ్రవరి 23న మెయిన్స్ పరీక్షను నిర్వహించింది. ఏప్రిల్‌లో ఫలితాలను విడుదల చేసింది. ధ్రువపత్రాల పరిశీలన కోసం 1:2 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేసిన విషయం తెలిసిందే. స్పోర్ట్స్ సహా సాధారణ కోటాతో కలిపి మెుత్తం 2517 మంది అభ్యర్థులను ఎంపిక చేశారు. వీరికి ధ్రువపత్రాల తనిఖీ తేదీలను కాల్ లెటర్ల ద్వారా తెలియపరచనున్నట్టుగా అధికారులు చెప్పారు.

అయితే గ్రూప్ 2 ఉద్యోగ నియామకాల్లో రోస్టర్ పాయింట్ల అంశం హైకోర్టులో ఉండటంతో తుది తీర్పునకు లోబడి తుది నియామక ప్రక్రియ చేపట్టనున్నట్టుగా ఏపీపీఎస్సీ స్పష్టం చేసింది. ఫలితాలతోపాటుగా మెయిన్ పరీక్ష ఫైనల్ కీని కూడా అధికారులు వెబ్‌సైట్‌లో పెట్టారు.

ఈ లింక్ క్లిక్ చేసి గ్రూప్ 2 మెయిన్స్ ఫలితాలు చూడండి.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks