AP ICET 2026 Counselling Registration : రాష్ట్రంలోని ఎంబీఏ (MBA), ఎంసీఏ (MCA) కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఏపీ ఐసెట్-2026 (AP ICET-2026) మొదటి విడత కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు ఉన్నత విద్యామండలి అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో తమ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ పూర్తి చేసుకోవచ్చు.
కౌన్సెలింగ్ షెడ్యూల్ ఇలా…

అర్హులైన విద్యార్థులు ఆగస్టు 31వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు అవకాశం కల్పించారు. రిజిస్ట్రేషన్ పూర్తయిన అభ్యర్థులు ఆగస్టు 27 నుంచి సెప్టెంబర్ 2వ తేదీ వరకు తమకు కావలసిన కళాశాలలు, కోర్సులను ఎంచుకుంటూ వెబ్ ఆప్షన్లను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.
సీట్ల కేటాయింపు ఎప్పుడంటే..
నమోదు చేసుకున్న వెబ్ ఆప్షన్లలో ఏవైనా మార్పులు లేదా చేర్పులు చేసుకోవాలనుకుంటే సెప్టెంబర్ 3న ఒక్కరోజు అవకాశం ఇచ్చారు. అదే రోజు రాత్రి 10 గంటలకు ఆప్షన్లు ఫ్రీజ్ అవుతాయి. అభ్యర్థుల మెరిట్, రిజర్వేషన్లు, వెబ్ ఆప్షన్ల ఆధారంగా సెప్టెంబర్ 7న సీట్ల కేటాయింపు ఫలితాలను విడుదల చేస్తారు.
సీట్లు పొందిన అభ్యర్థులు సెప్టెంబర్ 8 నుంచి సెప్టెంబర్ 11 వరకు సంబంధిత కళాశాలల్లో ఆన్‌లైన్ సెల్ఫ్ జాయినింగ్‌తో పాటు నేరుగా హాజరై రిపోర్టింగ్ చేయాలి. ఇక అన్ని కళాశాలల్లోనూ సెప్టెంబర్ 8 నుంచే నూతన విద్యా సంవత్సరం తరగతులు ప్రారంభమవుతాయని అధికారులు స్పష్టం చేశారు.
రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఇలా….
- అభ్యర్థులు ముందుగా అధికారిక కౌన్సెలింగ్ పోర్టల్ https://cap.apcfss.in/ వెబ్‌సైట్‌ను సందర్శించాలి.
- హోమ్‌పేజీలో కనిపించే 'Register Now' ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
- ఐసెట్ హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీ వంటి ప్రాథమిక వివరాలను నమోదు చేసి, మొబైల్ నంబర్‌కు వచ్చే ఓటీపీ (OTP) ద్వారా వెరిఫికేషన్ పూర్తి చేయాలి.
- లాగిన్ ఐడీ క్రియేట్ అయిన తర్వాత, అవసరమైన సర్టిఫికెట్లను అప్‌లోడ్ చేసి రిజిస్ట్రేషన్ ప్రక్రియతో పాటు ప్రాసెసింగ్ రుసుము చెల్లించి అప్లికేషన్‌ను సబ్మిట్ చేయాలి.
ఈ ఏడాది ఏపీ ఐసెట్ పరీక్ష కోసం రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 26,219 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వారిలో 23,198 మంది అభ్యర్థులు ప్రవేశ పరీక్షకు హాజరయ్యారు. ఫలితాల్లో అత్యధికంగా 21,205 మంది అభ్యర్థులు కౌన్సెలింగ్‌కు అర్హత సాధించారు. దీనితో ఈ ఏడాది ఐసెట్‌లో మొత్తం 91.41 శాతం మంది విద్యార్థులు క్వాలిఫై అయ్యారు. వీరంతా కూడా కౌన్సెలింగ్ లో పాల్గొనే అవకాశం ఉంటుంది.
{{/usCountry}}ఈ ఏడాది ఏపీ ఐసెట్ పరీక్ష కోసం రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 26,219 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వారిలో 23,198 మంది అభ్యర్థులు ప్రవేశ పరీక్షకు హాజరయ్యారు. ఫలితాల్లో అత్యధికంగా 21,205 మంది అభ్యర్థులు కౌన్సెలింగ్‌కు అర్హత సాధించారు. దీనితో ఈ ఏడాది ఐసెట్‌లో మొత్తం 91.41 శాతం మంది విద్యార్థులు క్వాలిఫై అయ్యారు. వీరంతా కూడా కౌన్సెలింగ్ లో పాల్గొనే అవకాశం ఉంటుంది.
{{/usCountry}}