AP ICET 2026 Counselling : ఏపీ ఐసెట్ కౌన్సెలింగ్ అప్డేట్ - రిజిస్ట్రేషన్లు ప్రారంభం, ముఖ్య తేదీలివే!

AP ICET 2026 Counselling Registration : ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఏపీ ఐసెట్ 2026 మొదటి విడత కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఆగస్టు 31 వరకు రిజిస్ట్రేషన్లకు అవకాశం ఉండగా…, సెప్టెంబర్ 7న సీట్ల కేటాయింపు జరగనుంది.

Published on: Aug 25, 2026, 06:13:00 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

AP ICET 2026 Counselling Registration : రాష్ట్రంలోని ఎంబీఏ (MBA), ఎంసీఏ (MCA) కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఏపీ ఐసెట్-2026 (AP ICET-2026) మొదటి విడత కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు ఉన్నత విద్యామండలి అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో తమ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ పూర్తి చేసుకోవచ్చు.

ఏపీ ఐసెట్ 2026 అప్డేట్
ఏపీ ఐసెట్ 2026 అప్డేట్

కౌన్సెలింగ్ షెడ్యూల్ ఇలా…

అర్హులైన విద్యార్థులు ఆగస్టు 31వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు అవకాశం కల్పించారు. రిజిస్ట్రేషన్ పూర్తయిన అభ్యర్థులు ఆగస్టు 27 నుంచి సెప్టెంబర్ 2వ తేదీ వరకు తమకు కావలసిన కళాశాలలు, కోర్సులను ఎంచుకుంటూ వెబ్ ఆప్షన్లను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.

సీట్ల కేటాయింపు ఎప్పుడంటే..

నమోదు చేసుకున్న వెబ్ ఆప్షన్లలో ఏవైనా మార్పులు లేదా చేర్పులు చేసుకోవాలనుకుంటే సెప్టెంబర్ 3న ఒక్కరోజు అవకాశం ఇచ్చారు. అదే రోజు రాత్రి 10 గంటలకు ఆప్షన్లు ఫ్రీజ్ అవుతాయి. అభ్యర్థుల మెరిట్, రిజర్వేషన్లు, వెబ్ ఆప్షన్ల ఆధారంగా సెప్టెంబర్ 7న సీట్ల కేటాయింపు ఫలితాలను విడుదల చేస్తారు.

సీట్లు పొందిన అభ్యర్థులు సెప్టెంబర్ 8 నుంచి సెప్టెంబర్ 11 వరకు సంబంధిత కళాశాలల్లో ఆన్‌లైన్ సెల్ఫ్ జాయినింగ్‌తో పాటు నేరుగా హాజరై రిపోర్టింగ్ చేయాలి. ఇక అన్ని కళాశాలల్లోనూ సెప్టెంబర్ 8 నుంచే నూతన విద్యా సంవత్సరం తరగతులు ప్రారంభమవుతాయని అధికారులు స్పష్టం చేశారు.

రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఇలా….

  • అభ్యర్థులు ముందుగా అధికారిక కౌన్సెలింగ్ పోర్టల్ https://cap.apcfss.in/ వెబ్‌సైట్‌ను సందర్శించాలి.
  • హోమ్‌పేజీలో కనిపించే 'Register Now' ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
  • ఐసెట్ హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీ వంటి ప్రాథమిక వివరాలను నమోదు చేసి, మొబైల్ నంబర్‌కు వచ్చే ఓటీపీ (OTP) ద్వారా వెరిఫికేషన్ పూర్తి చేయాలి.
  • లాగిన్ ఐడీ క్రియేట్ అయిన తర్వాత, అవసరమైన సర్టిఫికెట్లను అప్‌లోడ్ చేసి రిజిస్ట్రేషన్ ప్రక్రియతో పాటు ప్రాసెసింగ్ రుసుము చెల్లించి అప్లికేషన్‌ను సబ్మిట్ చేయాలి.

ఈ ఏడాది ఏపీ ఐసెట్ పరీక్ష కోసం రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 26,219 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వారిలో 23,198 మంది అభ్యర్థులు ప్రవేశ పరీక్షకు హాజరయ్యారు. ఫలితాల్లో అత్యధికంగా 21,205 మంది అభ్యర్థులు కౌన్సెలింగ్‌కు అర్హత సాధించారు. దీనితో ఈ ఏడాది ఐసెట్‌లో మొత్తం 91.41 శాతం మంది విద్యార్థులు క్వాలిఫై అయ్యారు. వీరంతా కూడా కౌన్సెలింగ్ లో పాల్గొనే అవకాశం ఉంటుంది.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More