...
...
Next Story

AP ICET 2026 Counselling : ఏపీ ఐసెట్ మొదటి విడత కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల - ముఖ్య తేదీలివే

AP ICET 2026 Counselling Schedule: ఏపీ ఐసెట్-2026 మొదటి విడత కౌన్సెలింగ్ షెడ్యూల్‌ విడుదలైంది. ఆగస్టు 24 నుంచి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు ప్రారంభం కానుండగా… సెప్టెంబర్ 7న సీట్ల కేటాయింపు ఉంటుంది.

Published on: Aug 21, 2026, 15:57:34 IST
Advertisement

AP ICET 2026 counselling schedule : ఎంబీఏ (MBA), ఎంసీఏ (MCA) కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఏపీ ఐసెట్-2026 (AP ICET-2026) మొదటి విడత కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైంది. అర్హత సాధించిన అభ్యర్థుల కోసం తొలి విడత అడ్మిషన్ల ప్రక్రియను ప్రవేశాల కన్వీనర్ అధికారికంగా ప్రకటించారు.

ఏపీ ఐసెట్ కౌన్సెలింగ్ - ముఖ్యమైన తేదీలు…

ఏపీ ఐసెట్ 2026 కౌన్సెలింగ్
ఏపీ ఐసెట్ 2026 కౌన్సెలింగ్

అభ్యర్థులు సర్టిఫికెట్ల ఆన్‌లైన్ పరిశీలన, నమోదు రుసుము (రిజిస్ట్రేషన్) చెల్లింపు ప్రక్రియను ఆగస్టు 24 నుంచి ఆగస్టు 31 వరకు నిర్వహించుకోవచ్చు. విద్యార్థులు అప్‌లోడ్ చేసిన ధృవపత్రాల ఆన్‌లైన్ వెరిఫికేషన్ ప్రక్రియ హెచ్‌ఎల్‌సీల ద్వారా ఆగస్టు 25 నుంచి సెప్టెంబర్ 1 వరకు కొనసాగుతుంది.

కౌన్సెలింగ్‌లో పాల్గొనే విద్యార్థులు ఆగస్టు 27 నుంచి సెప్టెంబర్ 2 వరకు వెబ్ ఆప్షన్లను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. నమోదు చేసుకున్న వెబ్ ఆప్షన్లలో ఏవైనా మార్పులు చేసుకోవాలనుకుంటే సెప్టెంబర్ 3న అవకాశం కల్పించారు. అర్హులైన అభ్యర్థులు https://cap.apcfss.in/ వెబ్ సైట్ లోకి ఈ ప్రాసెస్ పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది.

అభ్యర్థులకు సీట్ల కేటాయింపు ఫలితాలను సెప్టెంబర్ 7న విడుదల చేయనున్నారు. సీట్లు పొందిన అభ్యర్థులు సెప్టెంబర్ 8 నుంచి సెప్టెంబర్ 11 వరకు సంబంధిత కళాశాలల్లో ఆన్‌లైన్ సెల్ఫ్ జాయినింగ్ తో పాటు నేరుగా రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. అన్ని కళాశాలల్లో సెప్టెంబర్ 8 నుంచే తరగతులు ప్రారంభమవుతాయని కన్వీనర్ స్పష్టం చేశారు.

ఈ ఏడాది ఏపీ ఐసెట్ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 26,219 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. వారిలో 23,198 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. హాజరైన వారిలో అత్యధికంగా 21,205 మంది అభ్యర్థులు కౌన్సెలింగ్‌కు అర్హత సాధించారు. దీనితో ఈ ఏడాది ఐసెట్‌లో మొత్తం 91.41 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe