AP Inter Supplementary Hall Tickets 2026 : ఏపీ ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు అత్యంత కీలకమైన అప్‌డేట్ వచ్చేసింది. ఈ పరీక్షలకు సంబంధించిన హాల్‌టికెట్లను అధికారులు అధికారికంగా విడుదల చేశారు. ఏపీ ఇంటర్మీడియట్ విద్యామండలి కార్యదర్శి రంజిత్ బాషా ఈ వివరాలను వెల్లడించారు. పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు ఇప్పటి నుంచే తమ హాల్‌టికెట్లను ఆన్‌లైన్ మార్గాల ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చని ఆయన సూచించారు.
విద్యార్థుల సౌకర్యార్థం, ఎలాంటి సాంకేతిక ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ఈసారి హాల్‌టికెట్లను బోర్డు అధికారిక వెబ్ పోర్టల్(https://bie.ap.gov.in/ )తో పాటు వాట్సాప్ వేదికగా కూడా అందుబాటులోకి తెచ్చారు. 'మన మిత్ర' వాట్సాప్ నంబరు 9552300009 కు మెసేజ్ చేయడం ద్వారా విద్యార్థులు నేరుగా తమ మొబైల్‌లోనే హాల్‌టికెట్‌ను సులువుగా పొందే వీలుంది.
ప్రిన్సిపల్ సంతకం అవసరం లేదు
ఇంటర్మీడియట్ విద్యామండలి ఈసారి విద్యార్థులకు, తల్లిదండ్రులకు పెద్ద ఉపశమనం కలిగించింది. ఇంటర్నెట్ లేదా వాట్సాప్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకున్న హాల్‌టికెట్లపై సంబంధిత కళాశాల ప్రిన్సిపల్ సంతకం తీసుకోవాల్సిన అవసరం లేదని కార్యదర్శి రంజిత్ బాషా స్పష్టం చేశారు. డిజిటల్ హాల్‌టికెట్‌ను నేరుగా పరీక్షా కేంద్రానికి తీసుకెళ్లవచ్చని, పరీక్షా కేంద్రాల్లోని అధికారులు దీనిని నిరభ్యంతరంగా అనుమతిస్తారని ఆయన స్పష్టం చేశారు.
విద్యార్థులు హాల్‌టికెట్ డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత అందులో తమ పేరు, ఫోటో, సంతకం, పరీక్షా కేంద్రం వివరాలు, రాసే సబ్జెక్టుల కోడ్‌లు సరిగ్గా ఉన్నాయో లేదో ఒకసారి క్షుణ్ణంగా పరిశీలించుకోవాలని అధికారులు సూచించారు. ఏవైనా తప్పులు ఉంటే వెంటనే కళాశాల యాజమాన్యాన్ని లేదా బోర్డు హెల్ప్‌లైన్‌ను సంప్రదించాల్సి ఉంటుంది. సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణకు ఆంధ్రప్రదేశ్ ఇంటర్ బోర్డు అన్ని రకాల ఏర్పాట్లను పూర్తి చేస్తోంది.
మే 21 నుంచి పరీక్షలు…
ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ థియరీ పరీక్షలు మే 21 నుంచి జూన్ 4 వరకు జరుగుతాయి. ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు రెండు సెషన్లలో నిర్వహిస్తారు. ఇక ప్రాక్టికల్స్ పరీక్షలు జూన్ 7 నుంచి ప్రారంభమై… జూన్ 11 వరకు ఉంటాయి.
{{/usCountry}}ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ థియరీ పరీక్షలు మే 21 నుంచి జూన్ 4 వరకు జరుగుతాయి. ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు రెండు సెషన్లలో నిర్వహిస్తారు. ఇక ప్రాక్టికల్స్ పరీక్షలు జూన్ 7 నుంచి ప్రారంభమై… జూన్ 11 వరకు ఉంటాయి.
{{/usCountry}}ఈ లింక్ పై క్లిక్ చేసి ఏపీ ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ హాల్ టికెట్ ను డౌన్లోడ్ చేసుకోవచ్చు