AP KGBV Admissions 2026 : కేజీబీవీల్లో అడ్మిషన్లు - మరోసారి దరఖాస్తు గడువు పొడిగింపు

AP KGBVs Admissions 2026 : ఏపీలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో (KGBV) అడ్మిషన్లకు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. అయితే ఈ గడువును ఏప్రిల్ 20వ తేదీ వరకు పొడిగించారు.

Published on: Apr 11, 2026, 19:33:38 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఏపీ వ్యాప్తంగా ఉన్న 352 కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో(KGBV) 6 నుంచి 11వ తరగతుల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. 2026-27 విద్యా సంవత్సరానికి గానూ అడ్మిషన్లు కల్పించటంతో పాటు 7, 8, 9, 10, 12వ తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్లను కూడా భర్తీ చేస్తారు.

కేజీబీవీల్లో అడ్మిషన్లు - మరోసారి దరఖాస్తు గడువు పొడిగింపు (image source istock)
కేజీబీవీల్లో అడ్మిషన్లు - మరోసారి దరఖాస్తు గడువు పొడిగింపు (image source istock)

ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం… ఆన్ లైన్ దరఖాస్తుల గడువు ఏప్రిల్ 10వ తేదీనే పూర్తి అయింది. అయితే ఈ తేదీని ఏప్రిల్ 20వ తేదీ వరకు పొడిగిస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి అర్హులైన విద్యార్థులు…. ఈ తేదీ వరకు అప్లికేషన్ చేసుకునే వీలుంటుంది. ఆరో తరగతిలో ప్రవేశం కోసం దరఖాస్తు చేసుకునే విద్యార్థి 5వ తరగతిలో తప్పనిసరిగా ఉత్తీర్ణులై ఉండాలి. ఇక ఇంటర్ ఫస్ట్ ఇయర్ సీటు కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థి.. టెన్త్ పాసై ఉండాలి.

  • ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న వర్గాలకు చెందిన విద్యార్థినులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులవుతారు.
  • అడ్మిషన్ల కోసం కేవలం ఆన్‌లైన్ దరఖాస్తులను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు.
  • 6వ తరగతి, ఇంటర్ ప్రథమ సంవత్సరం (11వ తరగతి)లో కొత్త ప్రవేశాలుంటాయి. అలాగే 7 నుంచి 10 మరియు 12వ తరగతుల్లో మిగిలి ఉన్న ఖాళీ సీట్ల భర్తీకి ఈ దరఖాస్తులు స్వీకరిస్తారు.
  • రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కేజీబీవీల్లో మొత్తం 32,079 సీట్లు అందుబాటులో ఉన్నాయి.
  • అనాథలు, బడి బయట పిల్లలు, డ్రాపౌట్లు, అలాగే ఆర్థికంగా వెనుకబడిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, బీపీఎల్ (BPL) వర్గాల బాలికలకు ఈ పాఠశాలల్లో ప్రాధాన్యత ఉంటుంది.
  • అధికారిక వెబ్‌సైట్ apkgbv.apcfss.in ద్వారా అప్లికేషన్ సమర్పించవచ్చు.
  • ఎంపికైన విద్యార్థుల జాబితాను ఆయా పాఠశాలల నోటీసు బోర్డుల్లో ఉంచడంతో పాటు, ఎంపికైన వారికి ఎస్ఎంఎస్ (SMS) ద్వారా సమాచారం అందిస్తారు.
  • ఏవైనా సందేహాలు ఉంటే, విద్యార్థులు, తల్లిదండ్రులు పని వేళల్లో (ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు) 7993329115, 7075039990 ఫోన్ నంబర్లను సంప్రదించవచ్చు.

AP KGBV దరఖాస్తు విధానం ఇలా:

  1. ముందుగా https://apkgbv.apcfss.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
  2. ఆరో తరగతి రిజిస్ట్రేషన్ లింక్ పై క్లిక్ చేయాలి.
  3. అభ్యర్థి పేరు, ఆధార్ నెంబర్, పుట్టిన తేదీ, మొబైల్ నెంబర్ వివరాలతో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
  4. ఆ తర్వాత దరఖాస్తు ఫారమ్ ఓపెన్ అవుతుంది. మీ పూర్తి వివరాలను నమోదు చేసి సబ్మిట్ చేయాలి.
  5. చివరగా ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ ద్వారా దరఖాస్తు రిజిస్ట్రేషన్ కాపీని పొందొచ్చు.

పైన పేర్కొన్న మాదిరిగానే ఇతర తరగతుల్లో ప్రవేశాలకు కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇతర వివరలాతో పాటు అడ్మిషన్లకు సంబంధించిన అప్డేట్స్ తెలుసుకునేందుకు https://apkgbv.apcfss.in/ వెబ్ సైట్ ను సంప్రదించవచ్చు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More