...
...
Next Story

AP KGBV Recruitment 2026 : ఏపీ కేజీబీవీల్లో 299 ఉద్యోగాలు - దరఖాస్తుకు ఇవాళే చివరి తేదీ, ఎగ్జామ్ లేకుండానే భర్తీ!

AP KGBV Recruitment 2026 Updates : ఆంధ్రప్రదేశ్ కేజీబీవీల్లో 299 టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తు గడువు నేటితో ముగియనుంది. రాత పరీక్ష లేకుండా కేవలం అకడమిక్స్ మెరిట్ ఆధారంగానే అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

Published on: Jun 20, 2026, 12:35:54 IST
Advertisement

AP KGBV Recruitment 2026 Update : ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ పరిధిలోని కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాల్లో (కేజీబీవీ) ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియ ముగింపు దశకు చేరుకుంది. టైప్-III కేజీబీవీలలో ఒప్పంద (కాంట్రాక్ట్) ప్రాతిపదికన పనిచేయడానికి అర్హులైన మహిళా అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఈ దరఖాస్తుల సమర్పణకు ఇవాళే(20 జూన్, 2026) చివరి తేదీ. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు వెంటనే తమ దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

ఏపీ కేజీబీవీ ఉద్యోగాలకు నేడే ఆఖరి గడువు
ఏపీ కేజీబీవీ ఉద్యోగాలకు నేడే ఆఖరి గడువు

తూర్పు గోదావరి, డాక్టర్ బీఆర్.అంబేడ్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలు మినహా… రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా ఏర్పడిన జిల్లాలను ఒక యూనిట్‌గా తీసుకుని మిగిలిన 352 కేజీబీవీలలో ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 299 బోధనా సిబ్బంది పోస్టులను భర్తీ చేస్తున్నారు.

ఖాళీల వివరాలు

  • ప్రిన్సిపల్: 16 పోస్టులు
  • పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ (PGT): 98 పోస్టులు
  • కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్స్ (CRT): 133 పోస్టులు
  • ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ (PET): 52 పోస్టులు

విద్యా అర్హతలు - టెట్ మినహాయింపు

అభ్యర్థులు పోస్టులను అనుసరించి సంబంధిత సబ్జెక్టులలో ఇంటర్మీడియట్, యూజీడీపీఈడీ/బీపీఈడీ/ఎంపీఈడీ లేదా కనీసం 50 శాతం మార్కులతో డిగ్రీ, పీజీ, బీఈడీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు దివ్యాంగులకు నిబంధనల ప్రకారం మార్కులలో సడలింపు ఉంటుంది.

నోటిఫికేషన్‌లో అభ్యర్థులకు అత్యంత కీలకమైన ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నిబంధన నుండి అధికారులు తాత్కాలిక మినహాయింపు ఇచ్చారు. సాధారణంగా కేజీబీవీల్లో ఉపాధ్యాయ పోస్టులకు టెట్ క్వాలిఫై కావడం తప్పనిసరి. అయితే తాజా సవరణ ప్రకారం ప్రస్తుతం టెట్ పాస్ కాకపోయినా అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన అభ్యర్థులు విధుల్లో చేరిన రోజు నుంచి ఏడాది లోపు కచ్చితంగా ఏపీ టెట్ (AP TET) అర్హత సాధించాల్సి ఉంటుంది. కేజీబీవీలలో ఆంగ్ల మాధ్యమంలోనే బోధన సాగుతుంది కాబట్టి, అభ్యర్థులకు ఇంగ్లీష్‌ మీడియంలో బోధించే సామర్థ్యం ఉండాలి. అలాగే డిగ్రీ వరకు ఒక సబ్జెక్టుగా ఇంగ్లీష్ చదివి ఉండాలి.

  • 01-07-2025 నాటికి అభ్యర్థుల కనీస వయస్సు 18 ఏళ్లు నిండి ఉండాలి. గరిష్ఠ వయస్సు 45 ఏళ్లు దాటకూడదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు గరిష్ఠ వయోపరిమితి 50 ఏళ్లుగాను, దివ్యాంగులకు 52 ఏళ్లుగాను అధికారులు నిర్ణయించారు.
  • గౌరవ వేతనం (నెలకు): ప్రిన్సిపల్ పోస్టుకు రూ. 34,139 కాగా.. పీజీటీ, సీఆర్‌టీ, పీఈటీ పోస్టులకు రూ. 26,759 గా చెల్లిస్తారు.

అప్లికేషన్ - ఎంపిక విధానం

సర్టిఫికెట్ల పరిశీలన పూర్తయిన తర్వాత పారదర్శకంగా తుది జాబితాను ప్రకటించి నియామక ఉత్తర్వులు జారీ చేస్తారు. అర్హులైన మహిళా అభ్యర్థులు కేవలం ఆన్‌లైన్ ( http://kgbvrecruitment.apcfss.in ) ద్వారానే దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు రుసుము కింద రూ. 300 ఆన్‌లైన్ ద్వారా చెల్లించాల్సి ఉంటుంది.

ఈ డైరెక్ట్ లింక్ పై క్లిక్ చేసి ఈ ఉద్యోగాలకు అప్లయ్ చేసుకోవచ్చు

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe