ఆంధ్రప్రదేశ్ మద్యం సరఫరా, రవాణా కాంట్రాక్టుల కేటాయింపుల్లో జరిగిన అక్రమాల కేసులో మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నాయకుడు కారుమూరి నాగేశ్వరరావును ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు నాంపల్లిలోని ప్రత్యేక కోర్టుకు తరలించారు. అరెస్టు అనంతరం ముందస్తు చర్యల్లో భాగంగా అధికారులు ఆయనను గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు పూర్తి చేయించారు. ఆ తర్వాత పటిష్ట భద్రత నడుమ కోర్టులో హాజరుపరిచారు.

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో జారీ చేసిన మద్యం సరఫరా కాంట్రాక్టుల్లో భారీగా నిధులు దారిమళ్లాయని, నిబంధనలకు విరుద్ధంగా పలువురు నేతలు బినామీ పేర్లతో కోట్లాది రూపాయల లబ్ధి పొందినట్లు ఈడీ విచారణలో ఆధారాలు సేకరించింది. ఈ స్కామ్‌కు సంబంధించి ఇప్పటికే పలు కీలక ఆధారాలను స్వాధీనం చేసుకున్న అధికారులు, సంబంధిత వ్యక్తులపై ముమ్మర నిఘా ఉంచారు.
ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఈడీ అధికారులు ముందస్తుగానే కారుమూరి నాగేశ్వరరావుకు చెందిన రూ. 87.7 కోట్ల విలువైన ఆస్తులను తాత్కాలికంగా జప్తు చేశారు. అలాగే ఈ కేసుతో సంబంధమున్న ఇతర నిందితులపై కూడా కఠిన చర్యలు కొనసాగుతున్నాయి.
కారుమూరి కుమారుడు సునీల్ ఇంట్లో జరిపిన సోదాల్లో అత్యంత విలువైన రోలెక్స్ వాచీలు, రేంజ్ రోవర్ లగ్జరీ కారును ఈడీ సీజ్ చేసింది. ఈ అక్రమ రవాణా వ్యవహారంలో ప్రధాన పాత్ర పోషించిన వాసుదేవరెడ్డి, రాజ్‌కెసి రెడ్డిలను కూడా అధికారులు ఇదివరకే అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
మద్యం కుంభకోణంలో లంచాల రూపంలో వచ్చిన డబ్బును ఎక్కడెక్కడ డిపాజిట్ చేశారు. విదేశీ ఖాతాలకు దారిమళ్లించారా అనే కోణంలో ఈడీ అధికారులు నిందితులను కస్టడీకి తీసుకుని మరింత లోతుగా విచారించేందుకు సిద్ధమవుతున్నారు. నాంపల్లి కోర్టు తీర్పును బట్టి కారుమూరిని తమ కస్టడీకి ఇవ్వాలని ఈడీ పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది.
కారుమూరిని ఆదివారం తన మిత్రుడి ఇంట్లో ఉండగా అదుపులోకి తీసుకున్నారు. వైసీపీ హయాంలో మద్యం పాలసీ అడ్డం పెట్టుకుని రూ.వేల కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారని ఆరోపణలు వెల్లువెత్తడంతో కూటమి ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేసింది. మద్యం ధరలు ఇష్టారాజ్యంగా నిర్ణయించడం, మామూళ్లు ఇచ్చిన సంస్థలకే మద్యం అవకాశం ఇవ్వడం వంటి అవకతవకలకు పాల్పడ్డారని, తద్వారా భారీగా కూడబెట్టుకున్నట్టుగా సిట్ గుర్తించింది. ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ డిపోల నుంచి దుకాణాలకు మద్యం సరఫరాలో చేతివాటం చూపారని పేర్కొన్నారు. వీటి ఆధారంగా ఈడీ కేసులు నమోదు చేసింది.
{{/usCountry}}కారుమూరిని ఆదివారం తన మిత్రుడి ఇంట్లో ఉండగా అదుపులోకి తీసుకున్నారు. వైసీపీ హయాంలో మద్యం పాలసీ అడ్డం పెట్టుకుని రూ.వేల కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారని ఆరోపణలు వెల్లువెత్తడంతో కూటమి ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేసింది. మద్యం ధరలు ఇష్టారాజ్యంగా నిర్ణయించడం, మామూళ్లు ఇచ్చిన సంస్థలకే మద్యం అవకాశం ఇవ్వడం వంటి అవకతవకలకు పాల్పడ్డారని, తద్వారా భారీగా కూడబెట్టుకున్నట్టుగా సిట్ గుర్తించింది. ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ డిపోల నుంచి దుకాణాలకు మద్యం సరఫరాలో చేతివాటం చూపారని పేర్కొన్నారు. వీటి ఆధారంగా ఈడీ కేసులు నమోదు చేసింది.
{{/usCountry}}