ఆంధ్రప్రదేశ్‌లో సుదీర్ఘకాలంగా ఉత్కంఠ రేపుతున్న స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు అత్యంత కీలకమైన తీర్పును వెలువరించింది. రాష్ట్రవ్యాప్తంగా స్థానిక ఎన్నికల ప్రక్రియను రాబోయే ఆరు వారాల్లోపు ప్రారంభించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది.

స్థానిక పోరుతో ముడిపడి ఉన్న పలు కీలక వ్యాజ్యాలు, పిటిషన్లపై గతంలోనే సుదీర్ఘ విచారణ పూర్తి చేసిన హైకోర్టు, తాజాగా తన తీర్పును వెలువరించింది. ఈ విచారణలో భాగంగా వెనకబడిన తరగతులకు(BC) కేటాయించిన రిజర్వేషన్ల జీవోలపై న్యాయస్థానం కీలక నిర్ణయం తీసుకుంది.
బీసీలకు స్థానిక ఎన్నికల్లో 34 శాతం కోటా కల్పిస్తూ ప్రభుత్వం విడుదల చేసిన జీవో నంబర్ 105, 1065లను హైకోర్టు రద్దు చేసింది. సుప్రీంకోర్టు గతంలో నిర్దేశించిన ప్రకారం.. ఎస్సీ, ఎస్టీ, బీసీల మొత్తం రిజర్వేషన్లు 50 శాతం గరిష్ఠ పరిమితిని దాటడానికి వీల్లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే, సమకాలీన బీసీ జనాభా డేటా ఆధారంగానే 34 శాతం కోటాను ఖరారు చేశామని ప్రభుత్వం కోర్టుకు వివరించినప్పటికీ, ఆ జీవోలు చెల్లవని ఉన్నత న్యాయస్థానం తీర్పునిచ్చింది.
స్థానిక పోరును అడ్డుకునేలా లేదా ఆలస్యం చేసేలా దాఖలైన పలు అనుబంధ పిటిషన్లను కూడా ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. ఓటర్ల జాబితా సవరణ (SIR) ప్రక్రియ పూర్తిగా ముగిసిన తర్వాతే స్థానిక ఎన్నికలు నిర్వహించాలంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు తోసిపుచ్చింది.
సమగ్ర బీసీ కుల గణన, విస్తృత సర్వేలు పూర్తయ్యాకే ఎన్నికలకు వెళ్లాలన్న అభ్యర్థనలను సైతం న్యాయస్థానం ఆమోదించలేదు. గ్రామ పంచాయతీలను సమీప మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో విలీనం చేయడం, వార్డుల డిలిమిటేషన్‌ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను కూడా న్యాయస్థానం కొట్టివేసింది.
హైకోర్టు తీర్పుతో ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ, మున్సిపల్ పోరుకు ఉన్న ప్రధాన న్యాయపరమైన అడ్డంకులన్నీ తొలగిపోయాయి. కోర్టు ఆదేశించిన ప్రకారం 6 వారాల్లోపు ప్రక్రియ ప్రారంభించాల్సి ఉన్నందున, రాష్ట్ర ఎన్నికల సంఘం 50 శాతం పరిమితికి లోబడి స్థానిక సంస్థల వారీగా స్థానాల పునర్విభజన, రిజర్వేషన్ల రీ-నోటిఫికేషన్‌పై కసరత్తు ప్రారంభించనుంది.
{{/usCountry}}హైకోర్టు తీర్పుతో ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ, మున్సిపల్ పోరుకు ఉన్న ప్రధాన న్యాయపరమైన అడ్డంకులన్నీ తొలగిపోయాయి. కోర్టు ఆదేశించిన ప్రకారం 6 వారాల్లోపు ప్రక్రియ ప్రారంభించాల్సి ఉన్నందున, రాష్ట్ర ఎన్నికల సంఘం 50 శాతం పరిమితికి లోబడి స్థానిక సంస్థల వారీగా స్థానాల పునర్విభజన, రిజర్వేషన్ల రీ-నోటిఫికేషన్‌పై కసరత్తు ప్రారంభించనుంది.
{{/usCountry}}బీసీ, ఎస్సీ, ఎస్టీ స్థానాల కొత్త రిజర్వేషన్ల జాబితాను రూపొందించిన తర్వాత ఎస్‌ఈసీ అధికారికంగా స్థానిక పోరు నోటిఫికేషన్, పోలింగ్ తేదీల షెడ్యూల్‌ను విడుదల చేయనుంది. దీంతో ఏపీలోని గ్రామాల్లో, పట్టణాల్లో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. స్థానిక సమరానికి సిద్ధం కావాలని ప్రధాన రాజకీయ పార్టీలు కూడా ఇప్పటికే పనులు మెుదలుపెట్టాయి.