...
...
Next Story

AP Model Schools : ఏపీ మోడల్ స్కూల్ ప్రవేశాలు - దగ్గరపడిన గడువు, వెంటనే దరఖాస్తు చేసుకోండి

AP Model School Admissions 2026 : ఏపీ మోడల్ స్కూళ్లలో ప్రవేశాలకు దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఈ గడువు దగ్గరపడింది. ఈనెల 31వ తేదీలోపు అర్హులైన విద్యార్థులు… అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.

Published on: Mar 29, 2026 08:26 AM IST
Advertisement

ఆంధ్రప్రదేశ్‌లోని 164 మోడల్ స్కూళ్లలో 6వ తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఈ ఎంట్రెన్స్ ఎగ్జామ్ ద్వారా 2026-27 విద్యా సంవత్సరానికి ప్రవేశాలను కల్పిస్తారు. అయితే దరఖాస్తుల గడువు దగ్గరపడింది. అర్హులైన విద్యార్థులు…. మార్చి 31వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. సమయం దగ్గరపడిన నేపథ్యంలో… ఆలస్యం చేయకుండా వెంటనే అప్లయ్ చేసుకోవాలని అధికారులు,టీచర్లు సూచిస్తున్నారు.

ఏపీ మోడల్ స్కూల్స్ ప్రవేశాలు
ఏపీ మోడల్ స్కూల్స్ ప్రవేశాలు

దరఖాస్తు చేసుకునే విద్యార్థి…. సంబంధిత జిల్లాలల్లో ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలల్లో 2024-25, 2025-26 విద్యా సంవత్సరాలలో చదివి ఉండాలి. 2025-26 విద్యా సంవత్సరములో 5వ తరగతి చదువుతూ ప్రమోషన్ అర్హత పొంది ఉండాలి. ఓసీ, బీసీ కేటగిరీకి చెందిన విద్యార్థులు 01.09.2014-31.08.2016 మధ్య పుట్టి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ కేటగిరీకి చెందిన విద్యార్థులు 01.09.2012-31.08.2016 మధ్య పుట్టి ఉండాలి. ఏపీ మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్ష అప్లికేషన్ ఫీజు కింద ఓసీ, బీసీలకు రూ.200, ఎస్సీ, ఎస్టీలకు రూ.125 చెల్లించాలి.

ఏప్రిల్ 12న ఎంట్రెన్స్ ఎగ్జామ్…..

ఏపీ మోడల్ స్కూల్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ ఏప్రిల్ 12వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తారు. ఏ మండలంలో ఆదర్శ పాఠశాలలు పనిచేస్తున్నాయో.. ఆ పాఠశాలలో ఉదయం 10 గంటల నుండి 12 గంటల వరకు ప్రవేశ పరీక్ష ఉంటుంది. ఈ ప్రవేశ పరీక్షకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవాలి. ప్రవేశ పరీక్ష 5వ తరగతి స్థాయిలో తెలుగు /ఇంగ్లీషు మీడియాల్లో నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం ఇలా….

  1. ముందుగా https://apms.apcfss.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
  2. హోం పేజీలోని అప్లికేషన్ లింక్ పై క్లిక్ చేసి ఫీజు చెల్లించాలి.
  3. ఆ తర్వాత అప్లికేషన్ లింక్ పై క్లిక్ చేయాలి. ఇక్కడ ఐడీ, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేయాలి.
  4. లాగిన్ అయిన తర్వాత అప్లికేషన్ ఫారమ్ ఓపెన్ అవుతుంది.
  5. వివరాల నమోదు తర్వాత అప్లికేషన్ ప్రాసెస్ పూర్తవుతుంది.
  6. ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ ద్వారా రిజిస్ట్రేషన్ కాపీని పొందొచ్చు.

ఈ లింక్ పై క్లిక్ చేసి ఏపీ మోడల్ స్కూల్ కు దరఖాస్తు చేసుకోవచ్చు

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe