AP Model Schools Admissions 2026 : ఏపీ మోడల్ స్కూల్స్ ప్రవేశాలకు షెడ్యూల్ విడుదల.. ముఖ్యమైన తేదీలివే

ఆంధ్రప్రదేశ్‌లోని మోడల్ స్కూళ్లలో అడ్మిషన్స్ కోసం షెడ్యూల్ విడుదలైంది. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఆరో తరగతి ప్రవేశాలకు విద్యాశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది.

Published on: Feb 19, 2026, 20:51:07 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఆంధ్రప్రదేశ్‌లోని 164 మోడల్ స్కూళ్లలో 2026-27 విద్యా సంవత్సరానికి 6వ తరగతిలో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదలైంది. 12.04.2026 నాడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రవేశ పరీక్ష ఉంటుంది. ఏ మండలంలో ఆదర్శ పాఠశాలలు పనిచేస్తున్నాయో.. ఆ పాఠశాలలో ఉదయం 10 గంటల నుండి 12 గంటల వరకు ప్రవేశ పరీక్ష ఉంటుంది. ఈ ప్రవేశ పరీక్షకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవాలి. ప్రవేశ పరీక్ష 5వ తరగతి స్థాయిలో తెలుగు /ఇంగ్లీషు మీడియాల్లో నిర్వహిస్తారు.

ఏపీ మోడల్ స్కూల్స్ ప్రవేశాలకు షెడ్యూల్ విడుదల
ఏపీ మోడల్ స్కూల్స్ ప్రవేశాలకు షెడ్యూల్ విడుదల

ఈ ఆదర్శ పాఠశాలల్లో బోధన ఇంగ్లీష్ మీడియంలోనే ఉంటుంది. ఇందులో చదవడానికి ఎలాంటి ఫీజు ఉండదని గుర్తుంచుకోవాలి.

ముఖ్యమైన తేదీలు

  • ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం- 24-02-2026
  • ఫీజు చెల్లింపు చివరి తేదీ- 31-03-2026
  • పరీక్ష తేదీ (పాఠశాలలో)- 12-04-2026
  • మెరిట్, ఎంపిక లిస్ట్ విడుదల- 27-04-2026
  • సర్టిఫికెట్ వెరిఫికేషన్, కౌన్సెలింగ్ - 30-04-2026
  • తరగతులు ప్రారంభ తేదీ జూన్ 2026 (ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం)

ప్రవేశ అర్హతలు

ఓసీ, బీసీ కేటగిరీకి చెందిన విద్యార్థులు 01.09.2014-31.08.2016 మధ్య పుట్టి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ కేటగిరీకి చెందిన విద్యార్థులు 01.09.2012-31.08.2016 మధ్య పుట్టి ఉండాలి.

సంబంధిత జిల్లాలల్లో ప్రభుత్వ లేక ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలల్లో 2024-25, 2025-26 విద్యా సంవత్సరాలలో చదివి ఉండాలి. 2025-26 విద్యా సంవత్సరములో 5వ తరగతి చదువుతూ ప్రమోషన్ అర్హత పొంది ఉండాలి.

దరఖాస్తు చేయడానికి ముందుగా వివరాలతో కూడిన సమాచార పత్రం కోసం www.cse.ap.gov.in లేదా www.apms.apcfss.in దొరుకుతుంది.

దరఖాస్తు ఎలా చేయాలి?

23-02-2026 నుండి 31-03-2026 వరకు నెట్ బ్యాంకింగ్/క్రెడిట్/డెబిట్ కార్డు ఉపయోగించి పేమెంట్ గేట్‌వే ద్వారా పరీక్ష రుసుము చెల్లించిన తరువాత వారికి ఒక జర్నల్ నెంబరు కేటాయిస్తారు. ఆ నెంబర్ ఆధారంగా www.cse.ap.gov.in, www.apms.apcfss.inలో దరఖాస్తు చేసుకోవాలి.

ఓసీ, బీసీలకు రూ.200, ఎస్సీ, ఎస్టీలకు రూ.125 చెల్లించాలి. సీటు ప్రతిభ ఆధారంగా అంటే ప్రవేశపరీక్షలో పొందిన మార్కుల ఆధారంగా వస్తుంది. ప్రవేశపరీక్షా ప్రశ్నాపత్రము ఆబ్జెక్టివ్ టైప్‌లో ఉంటుంది. ప్రవేశ పరీక్షలో 100 ప్రశ్నలు, 100 మార్కులు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు ఉంటుంది. ఈ పరీక్ష తెలుగు, గణితం, సాంఘిక అండ్ సైన్స్, ఇంగ్లీష్ వంటి సబ్జెక్టులపై ఉంటుంది.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More