రాష్ట్రంలోని పేదలు, వృద్ధులు, దివ్యాంగులకు వైకల్యం లేదా వయోభారం భారం కాకూడదనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సామాజిక భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 62 లక్షల మంది ఎన్టీఆర్ భరోసా పింఛనుదారులకు ప్రతి నెలా వారి ఇంటి వద్దే పింఛను మొత్తాన్ని అందిస్తోంది. ఈ సంక్షేమ పథకాన్ని నిరంతరాయంగా కొనసాగించేందుకు గానూ 2026–27 ఆర్థిక సంవత్సరానికి రూ. 33,485.10 కోట్లను కేటాయించామని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు ), గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు.
అక్టోబర్ 1 నుంచి కొత్త చెల్లింపు విధానం

మొత్తం 62 లక్షల మంది లబ్ధిదారులలో జాతీయ సామాజిక సహాయ కార్యక్రమం (NSAP) పరిధిలోకి వచ్చే 9.34 లక్షల మందికి కేంద్ర ప్రభుత్వం రూ. 382.82 కోట్ల నిధులను కేటాయించింది. కేంద్ర ప్రభుత్వ నూతన మార్గదర్శకాల ప్రకారం…. ఈ నిధులను 'SNA-SPARSH' విధానంలో నేరుగా లబ్ధిదారుల ఆధార్ అనుసంధానిత బ్యాంకు ఖాతాల్లో అక్టోబర్ 1వ తేదీ నుంచే జమ చేస్తారు.
బ్యాంకులో కేంద్ర వాటా పడినప్పటికీ, లబ్ధిదారులకు అందే మొత్తం పింఛను పరిమాణంలో ఎలాంటి కోత లేదా మార్పు ఉండదు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే మిగిలిన వాటాను 'స్వర్ణ గ్రామం / స్వర్ణ వార్డు' సచివాలయ సిబ్బంది ద్వారా ఎప్పటిలాగే లబ్ధిదారుల ఇంటి వద్దే నగదు రూపంలో అందజేస్తారు. ఈ కొత్త నిబంధన కేవలం NSAP పరిధిలోని 9.34 లక్షల మందికి మాత్రమే వర్తిస్తుంది. మిగిలిన సుమారు 53 లక్షల మంది ఎన్టీఆర్ భరోసా లబ్ధిదారులకు పూర్తి పింఛను మొత్తాన్ని యథావిధిగా ఇంటి వద్దే నగదు రూపంలో చెల్లిస్తారు.
కేంద్ర ప్రభుత్వ వాటా సొమ్ము ఎటువంటి ఆటంకం లేకుండా డిపాజిట్ కావడానికి NSAP పరిధిలోని 9.34 లక్షల మంది పింఛనుదారులు తమ ఆధార్‌తో అనుసంధానమైన బ్యాంకు పొదుపు (SB) ఖాతాలను తక్షణమే యాక్టివేట్ చేసుకోవాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. సొమ్ము బ్యాంకులో జమైన వెంటనే ప్రతి నెలా లబ్ధిదారుల ఫోన్లకు ఎస్ఎంఎస్ ద్వారా సమాచారం అందిస్తారు. ఖాతాల యాక్టివేషన్, ఆధార్ సీడింగ్ లేదా పింఛను చెల్లింపులపై ఏవైనా సందేహాలు ఉంటే సమీపంలోని స్వర్ణ గ్రామం లేదా స్వర్ణ వార్డు సచివాలయం అధికారులను సంప్రదించి నివృత్తి చేసుకోవచ్చు.
{{/usCountry}}కేంద్ర ప్రభుత్వ వాటా సొమ్ము ఎటువంటి ఆటంకం లేకుండా డిపాజిట్ కావడానికి NSAP పరిధిలోని 9.34 లక్షల మంది పింఛనుదారులు తమ ఆధార్‌తో అనుసంధానమైన బ్యాంకు పొదుపు (SB) ఖాతాలను తక్షణమే యాక్టివేట్ చేసుకోవాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. సొమ్ము బ్యాంకులో జమైన వెంటనే ప్రతి నెలా లబ్ధిదారుల ఫోన్లకు ఎస్ఎంఎస్ ద్వారా సమాచారం అందిస్తారు. ఖాతాల యాక్టివేషన్, ఆధార్ సీడింగ్ లేదా పింఛను చెల్లింపులపై ఏవైనా సందేహాలు ఉంటే సమీపంలోని స్వర్ణ గ్రామం లేదా స్వర్ణ వార్డు సచివాలయం అధికారులను సంప్రదించి నివృత్తి చేసుకోవచ్చు.
{{/usCountry}}